Advertisement

డూడ్..ప్రభాస్ డైలాగ్ తో సినిమా..!!


రీ-రికార్డింగ్‌లో ‘వీలైతే ప్రేమిద్దాం’

Advertisement

వైజాగ్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ పతాకంపై నూతన నటీనటులతో విశాఖ థ్రిల్లర్‌ ‘వెంకట్‌’ దర్శకత్వంలో తేజ నిర్మిస్తోన్న మెసేజ్‌ ఓరియంటెడ్‌ ప్రేమకథా చిత్రం ‘వీలైతే ప్రేమిద్దాం’. ఇటీవలే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం రీ`రికార్డింగ్‌ జరుపుకుంటుంది. 

ఈ సందర్భంగా చిత్ర దర్శకులు వెంకట్‌ మాట్లాడుతూ.. ‘‘ఇది నాలుగు జంటల మధ్య నడిచే ప్రేమకథ. చక్కటి మెసేజ్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు వినోదాన్ని అందించే సకుటుంబ కథా చిత్రమిది. విశాఖ, హైద్రాబాద్‌ పరిసర ప్రాంతాల్లో షూటింగ్‌ పూర్తి చేసుకున్నాం. డబ్బింగ్‌, ఎడిటింగ్‌ కంప్లీట్‌ చేసుకున్నాం. ఈ చిత్రంలో మొత్తం 4 పాటలుంటాయి. స్వర్గీయ ‘ఆకాష్‌’ అందించిన స్వరాలు ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ. జూన్‌లో ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని సినీ ప్రముఖుల సమక్షంలో వైభవంగా జరుపనున్నాం..’ అన్నారు. 

పృథ్వి, తులసి, రాజు, శివ, యాంజలీన, శ్రావ్య, చంద్రకళ, నవీన్‌, పూర్ణిమ, శివన్నారాయణ, షకలక శంకర్‌, జబర్ధస్ట్‌ శ్రీను, రాజా శ్రీధర్‌, ఎఫ్‌ఎమ్‌ బాబాయ్‌, గోపరాజు రమణలతో పాటు విశాఖ నగరానికి చెందిన స్థానిక కళాకారులు ఈ చిత్రంలో నటించారు. ఈ చిత్రానికి కెమెరా: అనిల్‌ పల్లా, సంగీతం: ఆకాష్‌(లేటు), ఎడిటింగ్‌: ఉపేంద్ర, డాన్స్‌: లుక్స్‌ రాజశేఖర్‌, శ్యామ్‌, ఆర్ట్‌: ఎస్‌. ఉత్తమకుమార్‌, ఛీప్‌ కో డైరెక్టర్‌: సురేష్‌. ఆర్‌, దర్శకత్వ పర్యవేక్షణ, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: మూర్తి ఆడారి, సహనిర్మాత: బి. మంగమ్మ, ఎ. రామకృష్ణ, నిర్మాత: తేజ, కథ-మాటలు-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: విశాఖ థ్రిల్లర్‌ ‘వెంకట్‌’.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement