Advertisement

కమల్‌ ఇలా రెచ్చిపోతున్నాడేంటి!


వయసు ఫిఫ్టీ ప్లస్‌. కానీ ఆయన దూకుడు మాత్రం కుర్రాళ్లను తలపిస్తోంది. సినిమానే ధ్యాసగా, సినిమానే శ్వాసగా భావించే కమల్‌హాసన్‌ ఇటీవల ఒకేసారి రెండు మూడు చిత్రాలు చేస్తూ బాక్సాఫీసు దగ్గర సందడి చేస్తున్నాడు. మొన్ననే ‘ఉత్తమ విలన్‌’ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇప్పుడు మరో రెండు చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అప్పుడే మళ్లీ కొత్త సినిమాకి పచ్చజెండా ఊపాడు కమల్‌. తెలుగు,తమిళ భాషల్లో రాజేష్‌ దర్శకత్వంలో ఓ చిత్రం చేసేందుకు అంగీకరించారు. తమిళంలో ‘తూంగావనం’ పేరుతో రూపొందుతున్న ఆ చిత్రం తెలుగులో ‘చీకటి రాజ్యం’గా తెరకెక్కుతోంది. ఇందులో కమల్‌ సరసన త్రిష నటిస్తోంది. ఆదివారం హైదరాబాద్‌లో  సినిమా చిత్రీకరణ మొదలైంది. 

Advertisement
కమల్‌హాసన్‌ హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్‌పెట్టి సినిమా విశేషాల్ని వెల్లడిరచారు. సినిమా ప్రారంభంలో భాగంగా ప్రెస్‌మీట్‌లో కొన్ని పోస్టర్లను కూడా  ప్రదర్శించారు. అందులో త్రిషకి లిప్‌ కిస్‌ ఇస్తున్నట్టుగా ఉన్న ఆ పోస్టర్‌ కుర్రకారును కిర్రెక్కిస్తోంది. కుర్రాళ్లను మించిపోయేలా  హీరోయిన్లతో ముద్దుముచ్చట్లు కొనసాగిస్తున్నాడు కమల్‌. పోస్టర్లలోనే వ్యవహారం ఇలా        ఉందంటే ఇక సినిమాలో కమల్‌ ఇంకెంతగా రెచ్చిపోయారో చూడాలి.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement