Advertisement

‘శీనుగాడి లవ్‌స్టోరి’ ట్రైలర్ ఆవిష్కరణ


నయనతార`ఉదయనిధి స్టాలిన్‌ (ఓకె ఓకె ఫేం) జంటగా తమిళంలో రూపొంది ఘన విజయం సాధించిన చిత్రానికి తెలుగు అనువాదరూపం ‘శీనుగాడి లవ్‌స్టోరి. భీమవరం టాకీస్‌ పతాకంపై ‘పద్మశ్రీ’ పురస్కార గ్రహీత డా॥కె.సూర్యారావు సమర్పణలో.. ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. సంతానం, శరణ్య, డా॥భరత్‌రెడ్డి ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి శ్రీరామకృష్ణ సంభాషణలు సమకూర్చగా.. వనమాలి సాహిత్యం అందించారు. ‘అపరిచితుడు, గజిని’ వంటి మ్యూజికల్‌ బ్లాక్‌బస్టర్స్‌ ఫేం హేరిస్‌ జైరాజ్‌ ఈ చిత్రానికి స్వర సారధ్యం చేసారు. అనువాద కార్యక్రమాలు పూర్తి చేసుకొని త్వరలో విడుదలవుతున్న ‘శీనుగాడి లవ్‌స్టోరి’ ట్రైలర్ ను  ప్రసాద్‌ ల్యాబ్‌లో జరిగిన వేడుకలో.. ఇటీవలే ‘మా’ అధ్యక్షుడిగా ఎంపికైన నటకిరీటి రాజేంద్రప్రసాద్‌ ఆవిష్కరించారు. ‘మా’ అధ్యక్షుడి హోదాలో రాజేంద్రప్రసాద్‌ హాజరైన తొలి ఫంక్షన్‌ ఇదే కావడం గమనార్హం. ప్రముఖ నిర్మాతలు సి.కళ్యాణ్‌, కె.వి.వి.సత్యనారాయణ, కె.అచ్చిరెడ్డి, ప్రముఖ దర్శకులు యస్‌.వి.కృష్ణారెడ్డి, ‘మా’ కోశాధికారి పరుచూరి వెంకటేశ్వర్రావు, కార్యదర్శి కాదంబరి కిరణ్‌, కొడాలి వెంకటేశ్వర్రావు, ప్రముఖ పి.ఆర్‌.ఓలు మరియు నిర్మాతలైన బి.ఎ.రాజు, సురేష్‌ కొండేటి పాల్లొన్నారు. తమిళంలో ఘన విజయం సాధించిన ‘శీనుగాడి లవ్‌స్టోరి’ తెలుగులో మరింత పెద్ద విజయం సాధించడం ఖాయమని, 2014లో మూడు డబ్బింగ్‌, రెండు స్ట్రయిట్‌ సినిమాలతో కలిసి మొత్తం అయిదు సినిమాలు అందించిన తుమ్మలపల్లి రామసత్యనారాయణ.. 2015లో ఆ సంఖ్యను అధిగమించాలని అతిథులు ఆకాంక్షించారు. ‘మా’ అధ్యక్ష హోదాలో తొలిసారిగా తమ ఫంక్షన్‌కు విచ్చేసి, ట్రయిలర్స్‌ను లాంచ్‌ చేసిన రాజేంద్రప్రసాద్‌కి, మిగతా అతిథులకు పేరుపేరునా తుమ్మలపల్లి కృతజ్ఞతలు తెలిపారు. ఈ చిత్రానికి ఎడిటింగ్‌: శివ వై.ప్రసాద్‌, పోస్టర్స్‌ డిజైన్‌: యాడ్సో యాడ్స్‌ వెంకట్‌, సినిమాటోగ్రఫి: బాలసుబ్రమణియన్‌, సంభాషణలు: శ్రీరామకృష్ణ, సాహిత్యం: వనమాలి, సంగీతం: హేరిస్‌ జైరాజ్‌, సమర్పణ: ‘పద్మశ్రీ’ పురస్కార గ్రహీత డా॥కె.సూర్యారావు, నిర్మాత: తుమ్మలపల్లి రామసత్యనారాయణ, కథ`స్క్రీన్‌ప్లే`దర్శకత్వం.యస్‌.ఆర్‌.ప్రభాకరన్‌!!

Advertisement
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement