Advertisement

సల్మాన్‌ఖాన్‌ కేసు నుంచి బయటపడినట్టేనా..??


బాలీవుడ్‌ కండలవీరుణ్ని పలు కేసులు వేధిస్తున్న సంగతి తెలిసిందే. వీటిల్లో కృష్ణ జింకల వేట, కారు ప్రమాదం కేసులు ప్రధానమైనవి. అయితే కారు ప్రమాదం కేసు నుంచి సల్మాన్‌ తప్పించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2002లో ముంబైలో సల్మాన్‌ ప్రయాణిస్తున్న కారు ఫుట్‌పాత్‌పైకి దూసుకెళ్లడంతో నలుగురు మృత్యువాతపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో సల్మాన్‌ఖానే కారు నడుపుతున్నట్లు ప్రత్యక్షసాక్షులు చెప్పారు. అయితే ఆ సమయంలో సల్మాన్‌ కాకుండా ఆయన డ్రైవర్‌ కారు నడుపుతున్నాడని కండలవీరుడు లాయర్‌ వాదించారు. కొంతకాలం క్రితం ఈ కేసులో ప్రత్యక్ష సాక్షి కూడా సల్మాన్‌కు అనుకూలంగా తన వాంగ్మూలాన్ని మార్చాడు. ఆ రాత్రి సమయంలో కారు నడుపుతున్నదెవరో తాను స్పష్టంగా గమనించలేదని చెప్పాడు. తాజాగా సల్మాన్‌ఖాన్‌ డ్రైవర్‌ కూడా కోర్టులో ప్రమాద సమయంలో తానే కారు నడిపానని చెప్పాడు. దీంతో ఈ కేసు నుంచి సల్మాన్‌ బయటపడినట్లేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇక కృష్ణ జింకల కేసు నుంచి కూడా సల్మాన్‌ తప్పించుకోగలిగితే కండల వీరుడికి పెద్ద ఉపశమనం లభించేనట్లే..!!

Advertisement
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement