Advertisement

పాలిటిక్స్ లో వుండే వాళ్ళకే పాలిటిక్స్ తెలుసు: ఆర్పీ


మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్' ఎన్నికలలో రోజుకో వార్త వస్తుంది. ప్రెసిడెంట్ పదవికి పోటీ చేస్తున్న జయసుధ  మంగళవారం పత్రికా ముఖంగా కొన్ని విషయాలను వెల్లడించారు. దీనికి సమాధానంగా బుధవారం రాజేంద్రప్రసాద్ విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమంలో నాగబాబు, కాదంబరి కిరణ్, వింజమూరి మధు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాదంబరి కిరణ్ మాట్లాడుతూ "నాలుగు సంవత్సరాల క్రితం నాగబాబు గారు ప్రెసిడెంట్ గా చేసినపుడు 38 మంది పేదవాళ్లను ఎన్నుకొని నెలకు వెయ్యి రూపాయల చొప్పున ఇచ్చేవాళ్ళం. అలాంటిది ఈరోజు ఒక్కరికి మాత్రమే ఆ సహాయం లభిస్తుండడం దురదృష్టకరం. నర్ర విజయలక్ష్మి గారు మరణిస్తే 'మా' తరఫున ఎలాంటి సహాయం అందివ్వలేకపోయాను. ఆ విషయం నన్ను చాలా కలచివేసింది. ఈ ఎన్నికలలో మేము గెలిస్తే చిన్న వాళ్ళ కోసం ఖచ్చితంగా కృషి చేస్తాను" అన్నారు.
నాగబాబు మాట్లాడుతూ "మురళీమోహన్ గారు స్వయంగా శివాజీరాజా తో 'మా' కు ప్రెసిడెంట్ గా కొత్తవాళ్ళని ఎన్నుకుందాం అని చెప్పగా ఆయన చాలా మందిని సంప్రదించినా ఎవరు ముందుకు రాలేదు. నేను సేవ చేస్తాను అని ముందుకు వచ్చారు రాజేంద్రప్రసాద్ గారు. అప్పటివరకు ఏకగ్రీవంగా జరుగుతాయనుకునే ఎన్నికలలో సడెన్ గా జయసుధను నామినేషన్ వేసేలా కొందరు చేసారు. అంతే కాకుండా రాజేంద్రప్రసాద్ రాజకీయాలు చేస్తున్నాడని ఆరోపణలు చేస్తున్నారు. పుట్టలుపుట్టలుగా ప్యానెల్ మెంబెర్స్ ను వేసుకొని రావడం కాదు.. మార్పు ఒక్కడితో వస్తాది అంటే రాజేంద్రప్రసాద్ లాంటి ఒక్కడు చాలు" అని అన్నారు.
శివాజీ రాజా మాట్లాడుతూ "మోహన్ బాబు గారు ప్రెసిడెంట్ గా చేసినప్పుడు సేవా కార్యక్రమాల్లో నాకు ఎంతగానో సహకరించారు. కాని మురళీమోహన్ గారి హయాంలో నాకు సంతృప్తి లేదు. సేవా కార్యక్రమాలు చేయాలనే దృక్పథం వారిలో లేదు. 'మా' ప్రెసిడెంట్ గా చేయడానికి ఎవరు ముందుకు రాని సమయంలో రాజేంద్రప్రసాద్ గారు వస్తే వోట్ల కోసం ఆయన ఫోన్లు పంచి పెడుతున్నాడని, ఎవరితోనో జయసుధ గారిని విత్ డ్రా చేసుకోమని బెదిరించారని సిల్లీగా మాట్లాడుతున్నారు. ఎలక్షన్ కమీషనర్ గా వ్యవహరించేవాళ్ళు మురళిమోహన్ గారికి సబంధించిన వారే. ఇలాంటి ఎన్నికలలో పోటీ చేయడం నాకు ఇష్టం లేదు అందుకే ఈ ఎన్నికల నుండి ఉపసంహరించుకుంటున్నాను. నా సపోర్ట్ మాత్రం రాజేంద్రప్రసాద్ గారికే" అని తెలిపారు.
రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ "37 సంవత్సరాలుగా కళాకారునిగా పని చేస్తున్న నేను ఈరోజు అభాగ్యులకు సేవా చేయాలనే ఉద్దేశ్యంతో ఎన్నికలో నిలబడితే అనరాని మాటలు అని ఓ కళాకారుడ్ని బాధ పెడుతున్నారు. మేడమ్ జయసుధ, మంత్రివర్యులు మురళీమోహన్ అంటే మాకు చాలా గౌరవం. రాజకీయాల్లో నుండి వచ్చింది వాళ్ళు అయితే నన్ను రాజకీయాలు చేస్తున్నాను అంటున్నారు. రాజకీయాల్లో ఉండేవాళ్ళకే రాజకీయాలు తెలుసు. నామినేషన్ వేసే మనిషి ఖచ్చితంగా నామినేషన్ సెంటర్ కి వెళ్లాలని సూచించడంతో నేను వెళ్లాను. కానీ మేడమ్ జయసుధ గారు అక్కడికి రాలేదు. ఇప్పుడు కొత్తగా మద్రాసు నుండి ఆవిడను తీసుకువచ్చి పోటీగా నిలబెడుతున్నారు. ఎలెక్షన్ కమీషనర్ ఎమ్.పి మురళీమోహన్ గారి సొంత లాయర్ అని తెలిసి విరక్తి పుట్టింది. వోట్ల కోసం సెల్ ఫోన్స్ పంపిణీ చేసానని నాపై ఆరోపణలు వేస్తున్నారు. సెల్ ఫోన్ కోసం వోటు వేసే దౌర్భాగ్య స్థితిలో 'మా' మెంబెర్స్ లేరు. ఈరోజు పత్రికా ముఖంగా వెల్లడిస్తున్నాను నేను ఎన్నికైతే 'మా' అసోసియేషన్ కి ఒక భవనం కట్టిస్తాను. కొందరు స్నేహితుల సహాయంతో 5 కోట్ల రూపాయలను డిపాజిట్ చేసి పేద కళాకారులకు హెల్త్ ఇన్సురెన్స్ లను, పెన్షన్లను ఇస్తాను" అని చెప్పారు. 

Advertisement
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement