Advertisement

రామ్ చరణ్ పుట్టిన రోజు కానుకగా 'రేయ్' విడుదల!


మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన యంగ్ హీరో సాయి ధరం తేజ్   ఇటివల రేయ్ చిత్రం విడుదల తేది ప్రకటించినపుడు జరిగిన ప్రెస్ మీట్ లో తన సినిమా కేరేర్ లో మార్చి  27 సంఖ్య  సెంటిమెంట్ గురించి చెప్పాడు. మార్చి  27వ తేది నాడే తన తొలి  ఫోటో సెషన్ జరిగిందని, మార్చి 27 తేది నాడే రేయ్ చిత్రం ప్రారంభం అయ్యిందని, ఇప్పుడు అదే   మార్చి 27న తను  నటించిన  తొలి చిత్రం విడుదల కావడం సెంటిమెంట్ గా ఫీల్ అవుతున్నని చెప్పాడు. అది అలా వుండగా మార్చి 27కి మరో సెంటిమెంట్ జత అయ్యింది. అది రామ్ చరణ్ పుట్టిన రోజు కావడం విశేషం,  ఇంకా చెప్పాలంటే ఒక్క రోజు తేడా తో మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన అల్లు అర్జున్ ఫస్ట్ మూవీ తో లింక్ వుంది అది  గంగోత్రి విడుదల   2003  మార్చి 28న  గంగోత్రి విడుదల అయ్యింది ఇది  మరో విశేషం.  ఈ ఏడాది మార్చి 28న  శ్రీ రామ నవమి ఇది వై వి ఎస్ చౌదరి సెంటిమెంట్ అంటే అతని ఫస్ట్ మూవీ శ్రీ సీతా రాముల కళ్యాణం చూతము రారండి. ఇలా రేయ్ చిత్రానికి అనుకోకుండా అన్ని  మంచి శకునాలు  సూచిస్తున్నాయి.  రామ్ చరణ్ పుట్టిన రోజు నాడే మీ రేయ్ విడుదల చేయడం గల మీ ఆంతర్యం ఏమిటి అని దర్శక నిర్మాత వై వి ఎస్ చౌదరి ని అడగ్గా ... ఆయన స్పందిస్తూ 

Advertisement

"దేవదాసు సినిమా రిలీజ్ అయిన రోజే  మార్నింగ్ షో చూసి ఇంప్రెస్స్ అయిన నిర్మాత అశ్వనిదత్ గారు  చిరంజీవిగారికి రామ్ చరణ్ గారికి స్పెషల్ షో ఏర్పాటు చేసి  రామ్ చరణ్ తేజ్ ఇంట్రడక్షన్ ఫిలిం కి  సబ్జెక్టు రడీ చేయమన్నారు. అలా రామ్ చరణ్ తేజ్ కోసం  రడీ చేసిందే ఈ  రేయ్ సబ్జెక్టు, కొన్ని పరిణామాల తరువాత సాయి ధరం తేజ్ తో రేయ్ సినిమా  తీయటం అంతా యాదృచ్చికం  . రేయ్ ప్రాజెక్ట్ విషయం లో చిరంజీవి, పవన్ కళ్యాణ్  గార్ల  మేనల్లుడు హీరో  కాబట్టి మెగా అభిమానులను  అలరించటానికి  ఈ చిత్రం లో చిరంజీవి గారి ' దొంగ' చిత్రం లోని సూపర్ హిట్ సాంగ్  'గోలీమార్'ను  రీమిక్స్ చేసాము. అలాగే పవన్ కళ్యాణ్ గారికి ట్రిబ్యూట్ గా పవనిజం సాంగ్ ను రికార్డు చేసి  ప్రత్యేకం గా  షూటింగ్ చేసాము.రామ్ చరణ్ పుట్టిన రోజైన మార్చి 27న మెగా అభిమానులకు కానుక గా  రిలీజ్  చేయడం కూడా కాకతాళీయం గా  జరిగిందే ." అని అన్నారు 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement