Advertisement

మార్చి 13న ‘తప్పటడుగు’


లక్ష్మణ్‌, సురభిస్వాతి, సూర్యతేజ, నవీన జాక్సన్‌ ప్రధాన పాత్రల్లో ఎ.ఎస్‌.ఎస్‌.వి. ఆట్‌లియర్స్‌, వైలెట్‌ కైట్‌ పతాకాలపై శ్రీ అరుణ్‌ స్వీయ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో నిర్మించిన చిత్రం ‘తప్పటడుగు’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని మార్చి 13న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా సోమవారం ఫిలింఛాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకనిర్మాత శ్రీఅరుణ్‌, నటులు ఫణి, గిరిధర్‌, సినిమాటోగ్రాఫర్‌ కర్ణ పాల్గొన్నారు. 

Advertisement

శ్రీఅరుణ్‌: ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఆడియోకి చాలా మంచి రెస్పాన్స్‌ వస్తోంది. తమిళ్‌లో కూడా ఆడియో పెద్ద హిట్‌ అయింది. ఈ చిత్రాన్ని మార్చి 13న రెండు భాషల్లో ఒకేసారి రిలీజ్‌ చేస్తున్నాం. మానవ సంబంధాలపై రూపొందించిన సినిమా ఇది. ప్రతి మనిషి జీవితంలో జరిగే సంఘటనల ఆధారంగానే ఈ సినిమా రూపొందించబడిరది. మనం కొన్ని సందర్భాల్లో తీసుకునే నిర్ణయం వల్ల తప్పటడుగు వేస్తాం. అలాంటి ఆసక్తికరమైన సంఘటన ఈ సినిమాలో వుంటుంది. గ్రామీణ నేసథ్యంలో సాగే ఈ సినిమా ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది.

కర్ణ: ఇది ఒక ఫీల్‌గుడ్‌ మూవీ. కథ చెప్పగానే డెఫినెట్‌గా ఇది డిఫరెంట్‌ మూవీ అవుతుందన్న నమ్మకం కలిగింది. విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో తీసిన ఈ సినిమా విజువల్‌గా చాలా గ్రాండ్‌గా వుంటూ అందర్నీ అలరిస్తుంది.

గిరిధర్‌: ఇందులో ఒక విలన్‌గా నటించాను. చాలా రగ్డ్‌గా వుండే క్యారెక్టర్‌ చేశాను. ఈ క్యారెక్టర్‌ని చాలా ఎంజాయ్‌ చేస్తూ చేశాను. నేటివిటీకి చాలా దగ్గరగా వుండే సినిమా ఇది. ఈ సినిమా అందరూ థియేటర్స్‌తో చేయడం జరిగింది. 

ఫణి: ఇందులో లీడ్‌ విలన్‌గా చేశాను. ప్రతి ఒక్కరి జీవితం ఈ సినిమాలో ఐడెంటిఫై అవుతుంది. తమ జీవితాల్లో ఏదో ఒక సమయంలో తప్పటడుగు వేయడం జరుగుతుంది. ఈ సినిమాలో అలాంటి తప్పటడుగు ఏమిటి అనేది ఎంతో ఆసక్తికరంగా తెరకెక్కించారు శ్రీఅరుణ్‌గారు. 

లక్ష్మణ్‌, సురభి స్వాతి, సూర్యతేజ, నవీన జాక్సన్‌, శ్రీలక్ష్మీ, శివాజీ, టి.వి.సుబ్బారావు, గిరిధర్‌, ఫణి, నరేష్‌, నాని, నాగరాజు తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: సాయిమధుకర్‌, కెమెరా: కర్ణ, ఎడిటింగ్‌: వరప్రసాద్‌ రాచూరి, నిర్మాత, దర్శకత్వం: శ్రీఅరుణ్‌. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement