Advertisement

‘ది బెల్స్‌’ షూటింగ్‌ పూర్తి


జగదాంబ ప్రొడక్షన్స్‌ ఫిలింస్‌ పతాకంపై నెల్లుట్ల ప్రవీణ్‌ చందర్‌ దర్వకత్వంలో ఎర్రోజు వెంకటాచారి నిర్మిస్తున్న చిత్రం ‘ది బెల్స్‌’. రాహుల్‌, నేహ దేశ్‌పాండే హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఆడ పిల్లనమ్మా... నేను ఆడ పిల్లనోయి...పాటతో పాపులర్‌ అయిన కూమారి మధుప్రియ మీద చిత్రీకరించిన ‘అక్క నేనేమీసేతు..’ అన్న పాటతో ప్యాచ్‌ వర్క్‌  మినహా షూటింగ్‌ మొత్తం పూర్తయింది.  ఈ సందర్భంగా  నిర్మాత ఎర్రోజు వెంకటాచారి మాట్లాడుతూ... ‘‘ఈ ప్యాచ్‌ వర్క్‌ మినహా షూటింగ్‌ పూర్తయింది. ‘ఆడ పిల్లనమ్మా నేను.. ఆడ పిల్లనోయి...’పాటతో పాపులర్‌ అయిన కూమారి మథుప్రియ మీద చిత్రీకరించిన ‘అక్క నేనేమీసేతు...’ అన్న పాట మా సినిమాకు ప్రధాన ఆకర్షణ. ఈ చిత్రంలో చక్కని సందేశంతో పాటు ఆడియన్స్‌కు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్‌ వున్నాయి. ఇప్పటి వరకు సినిమా క్వాలిటీ విషయంలో ఏమాత్రం రాజీపడకుండా నిర్మించాము. ఈ సినిమాకు కెమెరా, మ్యూజిక్‌ హైలెట్‌గా నిలిచే అంశాలు. సినిమా తీయాలన్న నా చిన్ననాటి కల ఈ సినిమాతో నెరవేరుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్రాన్ని ఆదరించి ప్రేక్షకులు మరెన్నో చిత్రాలు నిర్మించే అవకాశాన్ని అందిస్తారని ఆశిస్తున్నాను’ అన్నారు.

Advertisement

తెలంగాణా భారీనీటి పారుదలశాఖ సలహాదారులు శ్రీ విద్యాసాగర్‌ రావు మాట్లాడుతూ...‘వినోదంతో పాటు చక్కటి సందేశాత్మక చిత్రంలో నేను కూడా ఓ చిన్న పాత్రలో నటించడం చాలా ఆనందంగా ఉంది. టైటిల్‌ అందరినీ ఆకట్టుకునే విధంగా ఉంది. తొలి ప్రయత్నం చేస్తున్న ఈ దర్శక నిర్మాతలకు మంచి పేరు తెచ్చి పెట్టే చిత్రం ఇది కావాలన్నారు.

కూమారి మధుప్రియ మాట్లాడుతూ...‘ది బెల్స్‌’ మూవీలో ఒక పాటలో  నటించే అవకాశాన్నిచ్చిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్‌’ అన్నారు.

దర్శకుడు నెల్లుట్ల ప్రవీణ్‌ చందర్‌ మాట్లాడుతూ...‘అనుకున్నది అనుకున్నట్టుగా పూర్తి చేయగలిగామంటే మా నిర్మాత ప్లానింగే కారణం. ఆయన ఎక్కడా రాజీ పడలేదు. మా చిత్రంలో తెలంగాణా భారీనీటి పారుదలశాఖ సలహాదారులు శ్రీ విద్యాసాగర్‌ రావుగారు అతిథి పాత్రలో నటించడం విశేషం. మిగతా నటీనటులు,సాంకేతిక నిపుణులు మంచి సహాయ సహకారాలు అందించారు. పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు ఓ వైపు శరవేగంగా జరుగుతున్నాయి. ఫిబ్రవరిలో ఆడియో విడుదల చేసి మార్చిలో సినిమాను రిలీజ్‌ చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాము’ అన్నారు.

రాహుల్‌, నేహ దేశ్‌పాండే, సూర్య, శివారెడ్డి, చలపతి, జబర్‌దస్త్‌ అప్పారావు ,జబర్‌దస్త్‌ మూర్తి, సాధురామకృష్ణ, మిధున్‌ సామిరెడ్డి, నిట్టల, గౌతమి, వైజాగ్‌ ప్రసాద్‌, గాయని మధుప్రియ, తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఉదయ్‌, సంగీతం: కాసర్లశ్యామ్‌, పాటలు: వరికుప్పల యాదగిరి, గోరేటి వెంకన్న, కాసర్లశ్యామ్‌, కూనాడి వాసుదేవరెడ్డి, రచన`మాటలు:శేఖర్‌ విఖ్యాత్‌, నిర్మాత:ఎర్రోజు వెంకటాచారి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: నెల్లుట్ల ప్రవీణ్‌ చందర్‌.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement