Advertisement
Google Ads BL

సినీజోష్ రివ్యూ : భైరవం


భైరవం మూవీ రివ్యూ 

Advertisement
CJ Advs

బ్యానర్: శ్రీ సత్య సాయి ఆర్ట్స్ 

నటీనటులు : బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్, అదితి శంకర్, ఆనంది, దివ్య పిళ్లై, జయసుధ, వెన్నెల కిషోర్ తదితరులు

సంగీతం : శ్రీచరణ్ పాకాల

సినిమాటోగ్రఫీ : హరి కె వేదాంతం

ఎడిటర్ : ఛోటా కె ప్రసాద్

ప్రొడ్యూసర్: KK రాధామోహన్

దర్శకుడు : విజయ్ కనకమేడల

విడుదల తేదీ-30/05/2025

ముగ్గురు హీరోలు కలిసి నటిస్తున్నారు అంటే ప్రేక్షకుల అటెన్షన్ ఆటోమాటిక్ గా ఆ సినిమాపైకి మళ్లుతుంది. ఆ ముగ్గురు స్టార్ హీరోలైనా, మీడియం రేంజ్ హీరోలైనా, పెద్ద హీరోలైనా, చిన్న హీరోలైనా.. ఎవ్వరైనా కలిసి కనిపిస్తే.. కథ ఎలా ఉండబోతుంది, ముగ్గురు హీరోలు స్క్రిప్ట్ ని ఓకె చేసారు అంటే ఖచ్చితంగా కొత్తగా ఉంటుంది అని ఆలోచిస్తారు. ఛత్రపతి హిందీ రీమేక్ తర్వాత బెల్లకొండ శ్రీనివాస్, తొమ్మిదేళ్లు సినిమాలకు దూరమైన మంచు మనోజ్, సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్న నారా రోహిత్ కలిసి నాంది చిత్రంతో దర్శకుడిగా ప్రూవ్ చేసుకున్న విజయ్ కనకమేడల దర్శకత్వంలో గురుడన్ చిత్రానికి రీమేక్ గా భైరవం చిత్రం చేసారు. భైరవం ట్రైలర్, పోస్టర్స్, ప్రమోషన్స్ అన్ని ఈ చిత్రంపై అంచనాలు పెంచాయి, మరి ఆ అంచనాలను నేడు మే 30 న విడుదలైన భైరవం ఎంతవరకు రీచ్ అయ్యింది అనేది సమీక్షలో చూసేద్దాం. 

భైరవం స్టోరీ:

భైరవం కథ రొటీన్ గానే కనిపిస్తుంది. అనగనగ దేవీ పురం. ఆ ఊరిలో వారాహి అమ్మవారి గుడి దానికో ధర్మకర్త, ఆమెకో మనవడు, అతనికో స్నేహితుడు. వారాహి అమ్మవారి ఆలయ భూముల పై కన్నేసే విలన్, ఆ విలన్ కో నమ్మినబంటు.. ప్రతి ఫ్రేమ్ లో కథేమిటనేది ఈజీగా అర్ధమైపోతుంది. ధర్మకర్త మనవడికి అతని స్నేహతుడికి, విలన్ నమ్మినబంటుకు మద్యన ఉన్న స్నేహం వైరంగా ఎలా మారింది అనేది భైరవం సింపుల్ స్టోరీ. 

భైరవం ఎఫర్ట్స్:

బెల్లంకొండ శ్రీనివాస్ కటౌట్ పరంగా కరెక్ట్ కేరెక్టర్ పడితే చెలరేగిపోతాడు అనే దానికి ఉదాహరణగా భైరవం లోని శ్రీను పాత్ర నిలుస్తుంది అనడంలో సందేహం లేదు. యాక్షన్ సీక్వెన్స్ లో బెల్లంకొండ ఎనర్జీ సూపర్బ్ అనే చెప్పాలి. నటనలో మరో మెట్టు ఎక్కాడు. ఇక పెరఫార్మెన్స్ పరంగా మంచు మనోజ్ గజపతి వర్మ పాత్ర లో మరో కోణం ఇందులో కనిపిస్తుంది. నెగెటివ్ షేడ్స్ ఉన్న గజపతి పాత్రలో మనోజ్ ఆహార్యం, అతని లుక్ అన్ని పర్ఫెక్ట్ గా సరిపోతాయి. మరో హీరో నారా రోహిత్ పాత్ర హుందాగా ఉంటుంది. హీరోయిన్స్ విషయానికొస్తే ఆనంది, దివ్యా పిళ్లై పాత్రలకు ఇంపార్టెన్స్ ఉంటుంది. వారి వారి పాత్రలకు న్యాయం చేసారు. ఇక అదితీ శంకర్ పాత్ర అయితే రొటీన్ కమర్షియల్ హీరోయిన్‌‌లా అనిపించినా ఆమె గ్లామర్ గా బబ్లీ గా ఆకట్టుకుంది. అజయ్, సందీప్ రాజ్ పాత్రలు, గోపరాజు రమణ, ఇనయ సుల్తానా, టెంపర్ వంశీ, సంపత్, శరత్ ఇలా అన్ని పాత్రలు తమపరిధిమేర ఆకట్టుకున్నాయి. 

సాంకేతికంగా భైరవం చిత్రానికి ప్లస్ అని చెప్పడానికి.. యాక్షన్ సీక్వెన్స్, విజువల్స్, శ్రీ చరణ్ పాకాల BGM ఇవి భైరవం చిత్రానికి అతిపెద్ద ప్లస్ పాయింట్స్. శ్రీ చరణ్ పాకాల ముగ్గురు హీరోలకు డిఫ్రెంట్ థీమ్స్‌ను అదరగొట్టేశాడు. కథలో చూసేందుకు డిస్టర్బ్ చేసినా సాంగ్స్ వినడానికి, చూడటానికి బాగుంటాయి. పెన్ స్టూడియోస్‌ బ్యానర్‌, శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ విలువలు రిచ్‌గా ఉన్నాయి. 

భైరవం స్క్రీన్  ప్లే:

భైరవం చిత్రం తమిళ గరుడన్ కి రీమేక్ అనేది తెలిసిందే. దర్శకుడు కనకమేడల ఒరిజినల్‌లోని ఉన్న ట్విస్టుల్ని పెద్దగా మార్పులు చేయకుండా తెలుగులో పెట్టేసుకున్నారు. కాకపోతే తెలుగు భైరవం కి దర్శకుడు కమర్షియల్‌ టచ్ ఇచ్చే ప్రయత్నమైతే చేసారు. భైరవం ముగ్గురు హీరోల కథ అన్నట్టుగా మారింది. కానీ గరుడాన్ మాత్రం మూడు పాత్రల చుట్టూ తిరిగే కథగా అనిపిస్తుంది. సినిమా స్టార్ట్ అయిన 40 నిమిషాల వరకు నెమ్మదిగానే వెళ్తుంది. కథలో మెయిన్ ట్రాక్ మొదలైన తర్వాత వేగం పెరుగుతుంది. ఫస్ట్ సీన్ నుంచే ముగ్గురు హీరోల మధ్య బాండింగ్ బాగా చూపించాడు దర్శకుడు విజయ్ కనకమేడల. కాకపోతే ఫైట్లు, భారీ యాక్షన్ సీక్వెన్స్‌ల్ని, లవ్ ట్రాక్‌ని, బెల్లంకొండ ఇమేజ్‌ కోసం వాడినట్లుగా సగటు ప్రేక్షకుడు ఫీలయ్యేలా చేసింది. 

ఫస్టాఫ్ ఎక్కువగా ఎలివేషన్స్ కోసం టైమ్ తీసుకున్నాడు దర్శకుడు. బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ఇలా ఒక్కొక్కరికీ సపరేట్‌గా ఎంట్రీ ప్లాన్ చేసాడు. అసలు కథ మొత్తం సెకండాఫ్‌లోనే ఉంది. ప్రీ ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ సెకండ్ హాఫ్ పై ఆసక్తిని క్రియేట్ చేసింది. ప్రాణానికి ప్రాణంగా ఉన్న స్నేహితులే చంపుకునే వరకు ఎందుకొచ్చారు అనేది ఈ సినిమాలో మెయిన్ ట్విస్ట్. అది థియేటర్లో చూస్తేనే బాగుంటుంది. ముగ్గురి మధ్య వైరం మొదలైన తర్వాత ఆసక్తికరంగా మారింది కథనం. భైరవం కథ, కథనం కొత్తగా ఏమీ అనిపించకపోయినా.. మంచు మనోజ్, బెల్లంకొండ శ్రీనివాస్ పెరఫార్మెన్స్ బోర్ కొట్టించవు. విజయ్ కనకమేడల టెంపుల్ బ్యాక్ డ్రాప్‌లో కమర్షియల్ యాక్షన్ ఫిలిం గా మార్చే ప్రయత్నం చేసాడు. ఓవరాల్‌గా ఇంటర్వెల్, క్లైమాక్స్, ముగ్గురు హీరోల పెరఫార్మెన్స్.. కోసం భైరవం చూసేయ్యొచ్చు. 

భైరవం ఎనాలసిస్:

కమర్షియల్ చిత్రాలకు ఆదరణ ఎక్కువ. ప్రేక్షకులు డీసెంట్ లవ్ స్టోరీస్, సింపుల్ ఫ్యామిలీ స్టోరీస్ కన్నా ఎక్కువగా కమర్షియల్ హంగులకే పడిపోతారు. అందులో యాక్షన్ ట్రెండ్ నడుస్తున్న సమయంలో భైరవం లాంటి యాక్షన్ ఫిలిం మాస్ ఆడియన్స్ బిగ్ రిలీఫ్. థియేటర్స్ లో ఎంటర్టైన్ చేసే సినిమాలేవి లేకపోవడం భైరవం కి కలిసొస్తుంది. ఇంకా వేసవి సెలవలు ఉండడం కూడా భైరవం చిత్రానికి కలిసొచ్చే అంశం. భైరవం గ్రామీణ నేపథ్యంలో రూరల్ అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామాలు చూడాలని కోరుకునే ప్రేక్షకులకు భైరవం చిత్రం బెస్ట్ ఆప్షన్. 

పంచ్ లైన్: ముగ్గురు హీరోల భారీ యాక్షన్ భైరవం 

రేటింగ్: 2.75/5

CInejosh Review: Bhairavam:

Bhairavam Teugu Movie Review
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs