Advertisement

సినీ జోష్ రివ్యూ: భళా తందనాన


సినీ జోష్ రివ్యూ: భళా తందనాన 

Advertisement

బ్యానర్: వారాహి చలనచిత్రం

నటీనటులు: శ్రీవిష్ణు, కేథరిన్‌, గరుడ రామ్‌, పొసాని కృష్ణమురళి, సత్య తదితరులు

సంగీతం: మణిశర్మ

సినిమాటోగ్రఫీ: సురేశ్‌ రగుతు

ఎడిటర్‌: మార్తాండ్‌ కె. వెంకటేశ్‌

కథ, డైలాగ్స్‌: శ్రీకాంత్‌ విస్సా

నిర్మాత: రజనీ కొర్రపాటి

దర్శకుడు: చైతన్య దంతులూరి

విడుదల తేది: మే 6, 2022 

హీరో శ్రీ విష్ణు హీరోయిజాన్ని హైలెట్ చేసుకుంటూ ఎదిగిన హీరో కాదు. టాలెంట్ ని నమ్ముకుని పైకి ఎదిగిన హీరో. తాను కథలో హీరోనా, విలనా అనేది చూడడు. విభిన్న కథలతోనే ఆడియన్స్ ని మెప్పించేందుకు ట్రై చేస్తాడు. గత ఏడాది రాజ రాజ చోర తో హిట్ కొట్టిన శ్రీ విష్ణు, అదే ఏడాది చివరిలో అర్జున ఫల్గుణతో ప్లాప్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు భళా తందనాన అంటూ దర్శకుడు చైతన్య దంతులూరి దర్శకత్వంలో నటించాడు. బాణం ఫేమ్ చైతన్య దంతులూరి దర్శకుడిగా ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి చలన చిత్ర నిర్మించిన భళా తందనాన పై అంచనాలు బాగున్నాయి. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన శ్రీ విష్ణు భళా తందనాన ఆడియన్స్ ని ఏ విధంగా మెప్పించిందో సమీక్షలో చూసేద్దాం. 

కథ:

చందు అలియాస్‌ చంద్రశేఖర్‌(శ్రీవిష్ణు) ఓ అనాథాశ్రమంలో అకౌంటెంట్ గా పని చేస్తుంటాడు. ఆ అనాథాశ్రమంలో ఐటి దాడులు నేపథ్యంలో ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్ట్‌ అయిన శశిరేఖ(కేథరిన్‌) ఆ న్యూస్‌ కవర్‌ చేయడానికి ఆశ్రమానికి వెళ్తుంది. అక్కడ చంద్ర శేఖర్ కి, శశిరేఖకి పరిచయమవుతుంది. వీరిద్దరు దగ్గరయ్యే క్రమంలో సిటీలో వరుస హత్యలు జరుగుతాయి. హత్యకు గురైన వారంతా హవాలా కింగ్‌ ఆనంద్‌ బాలి(గరుడ రామ్‌) మనుషులు. అదే టైం లో ఆనంద్‌ బాలి దగ్గర ఉన్న 2వేల కోట్ల హవాలా మనీ ఎవరో దొంగిచించారనే విషయం తెలుస్తుంది. ఆ దొంగతనం చంద్రశేఖర్ మెడకి చుట్టుకుంది. హవాలా కింగ్‌ ఆనంద్‌ బాలి మనుషులని ఎవరు హత్య చేస్తారు? ఇంతకీ 2 వేల కోట్లను దొంగిలించిదెవరు? ఈ దొంగతనం కేసుతో చందుకి ఉన్న సంబంధం ఏంటి? శశిరేఖ - చందు చివరికి ఒక్కటయ్యారా? అనేదే మిగతా కథ

నటీనటులు:

చందు పాత్రలో శ్రీవిష్ణు ఒదిగిపోయాడు. ఫస్టాఫ్‌లో అమాయకుడిలా, సెకండాఫ్‌లో ఢిఫరెంట్‌ షేడ్స్‌ ఉన్న కేరెక్టర్ లో తనదైన నటనతో మెప్పించాడు. ఎమోషనల్ గాను శ్రీ విష్ణు బెస్ట్ ఇచ్చాడు. ఇక ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్టుగా కేథరిన్‌ బొద్దుగా కనిపించినా.. ఆ కేరెక్టర్ కి న్యాయం చేసింది. ఈ సినిమాకు కేథరిన్‌ సొంతంగా డబ్బింగ్‌ చెప్పుకుంది. కానీ ఆమె డబ్బింగ్ అంత కన్విన్సింగ్ గా లేదు. ఇక విలన్‌గా గరుడ రామ్‌ మెప్పించాడు. కానీ అతని కేరెక్టర్ ని అంతగా హైలెట్ చెయ్యలేదు దర్శకుడు. పొసాని కృష్ణమురళి, సత్య మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర మెప్పించారు. 

విశ్లేషణ:

చైతన్య దంతులూరి.. బాణం తర్వాత చాలా గ్యాప్‌ తో క్రైమ్‌ థ్రిల్లర్‌ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు, క్రైం థ్రిల్లర్ కథలకి ట్విస్ట్ లు తోడైతే.. ఆ సినిమా హిట్ అని చాలా సినిమాలు నిరూపించాయి. దర్శకుడు చైతన్య ఎంచుకున్న పాయింట్‌ కొత్తగా ఉంది. భళా తందనాన క్రైమ్‌ థ్రిల్లర్‌ కథని సీరియస్ గా నడిపించకుండా కామెడీ, ప్రేమను యాడ్‌ చేసి కొత్తగా చూపించాలని ట్రై చేసాడు. సినిమా స్టార్టింగ్ లో హీరో - హీరోయిన్ ఇంట్రడక్షన్ సీన్స్ తో మొదలు పెట్టి స్టోరీలో ప్రేక్షకుడిని ఇన్వాల్వ్ చెయ్యడానికి చాలా టైం తీసుకున్నాడు దర్శకుడు. హీరో ఫెయిల్యూర్ లవ్ స్టోరీలో కామెడీ జొప్పించాడు. అయినా కథలో వేగం పెరగదు. కానీ సిటీలో వరస హత్యలతో కథలో వేగం పెరుగుతుంది. ఇంటర్వెల్ లో అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చి.. సెకండ్ హాఫ్ లో అసలు కథ మొదలు పెట్టారు. సెకండాఫ్‌లో కథంతా 2 వేల కోట్ల హవాలా మనీ చుట్టే తిరుగుతుంది. ఆ డబ్బుతో హీరోకి ఉన్న సంబంధం, అది ఎక్కడ దాచారు.. ఇలా కథ ఆసక్తికరంగా సాగుతుంది. అయితే కథలో కావాల్సినన్ని ట్విస్టులు, ఉత్కంఠ రేకెత్తించే సీన్స్‌ ఉన్నప్పటికీ.. కామెడీ, లవ్‌ ట్రాక్‌ కారణంగా అది గాడి తప్పింది. క్లైమాక్స్‌ కొత్తగా ఉన్నప్పటికీ.. అందులో ప్రేక్షకుడు అంతగా ఇన్వాల్వ్ కాలేడు. ఇక సినిమాని అక్కడితో ఎండ్ చెయ్యకుండా.. అసలు హీరో ఎవరు, అతని ఫ్లాష్ బ్యాగ్ ఏమిటి, అసలు ఆ 2వేల కోట్ల హవాలా మని ఎక్కడ దాచారు.. తెలియాలంటే భళా తందనాన సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేయమంటూ బిగ్ ట్విస్ట్ ఇచ్చారు.

సాంకేతికంగా: 

ఈ సినిమాకి మెయిన్ హైలెట్స్ లో ఒకటి మణిశర్మ నేపధ్య సంగీతం. మ్యూజిక్ పర్వాలేదనిపించినా.. నేపధ్య సంగీతంతో సినిమాని లేపారు. సురేశ్‌ రగుతు సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్‌ మార్తాండ్‌ కె. వెంకటేశ్‌ కత్తెరకు కాస్త పనిచెప్పాల్సింది. ఫస్టాఫ్‌లో కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్‌ చేయాల్సింది. నిర్మాణ విలువలు కథానుసారం ఉన్నాయి. 

రేటింగ్:2.25/5 

Cinejosh Review: Bhala Thandhanana:

Bhala Thandhanana Movie Telugu Review
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement