Advertisement

సినీజోష్ రివ్యూ: పుష్పక‌ విమానం


న‌టీన‌టులు: ఆనంద్ దేవ‌ర‌కొండ‌, గీత్ సైనీ, శాన్వి మేఘ‌న‌, హ‌ర్షవ‌ర్ధన్‌, న‌రేష్‌, త‌దిత‌రులు

Advertisement

మ్యూజిక్ డైరెక్టర్: రామ్ మిరియాల, సిద్దార్థ్ సదాశివుని, అమిత్ దాసాని; 

సినిమాటోగ్రఫీ: హెస్టిన్ జోస్ జోసె

ఎడిటింగ్: రవితేజ గిరిజాల

నిర్మాతలు: గోవర్ధన్ రావు దేవరకొండ, విజయ్ మట్టపల్లి , ప్రదీప్ ఎర్రబెల్లి

దర్శకత్వం: దామోదర

పాన్ ఇండియా స్టార్ విజయ్ దేవరకొండ తమ్ముడు, దొరసాని, మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాలతో హీరోగా ప్రూవ్ చేసుకున్న ఆనంద్ దేవరకొండ నుండి సినిమా వస్తుంది అంటే రౌడీ హీరో ఫాన్స్ కి క్రేజ్.. అందులోనూ రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడి ఆనంద్ దేవరకొండ సినిమాకి ప్రమోషన్ చేసాడు అంటే.. ఆ సినిమాపై ప్రేక్షకుల్లో ఎన్ని అంచనాలు ఉంటాయో.. ఆనంద్ దేవరకొండ పుష్పక విమానం సినిమా చూస్తే అర్ధమవుతుంది. కొత్త దర్శకుడు దామోదర దర్శకత్వంలో విజయ్ దేవరకొండ సమర్పణలో ఆనంద్ హీరోగా తెరకెక్కిన పుష్పక విమానం సినిమా భారీ ప్రమోషన్స్ తో.. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. మరి అన్న సహకారంతో ఆనంద్ దేవరకొండ పుష్పక విమానంతో హిట్ కొట్టాడా.. లేదా.. అనేది సమీక్షలో చూసేద్దాం. 

కథ:

చిట్టిలంక సుంద‌ర్ (ఆనంద్ దేవ‌ర‌కొండ‌) ప్రభుత్వ స్కూల్‌లో టీచ‌ర్‌. సుందర్ కి పెళ్లి పై ఎన్నో ఆశలు పెట్టుకుని క‌ల‌లు కంటూ ఉంటాడు. పెద్దలు కుదిర్చిన సంబంధం తో మీనాక్షి (గీత్ సైనీ) మెడలో సుందర్ తాళి కడతాడు. మీనాక్షికి పెళ్లంటే ఇష్టం ఉండదు. పెళ్లైన వారానికే మీనాక్షి ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది. పెళ్ళైన కొన్నాళ్లకే పెళ్లాం లేచిపోయిందంటే ప‌రువు పోతుంద‌ని..  భార్య లేక‌పోయినా ఉన్నట్టు న‌టిస్తూ సుందర్ స్కూల్ కి వెళుతుంటాడు. కానీ అనుకోని ప‌రిస్థితుల్లోషార్ట్ ఫిలిమ్స్ లో న‌టించే రేఖ (శాన్వి మేఘ‌న‌)ని త‌న భార్యగా నటించమని ఇంటికి తీసుకొస్తాడు. అసలు సుందర్ భార్య ఎందుకు లేచిపోయింది? అసలు మీనాక్షి ఎక్కడికి వెళ్లింది? భార్య ని వెతకడానికి సుందర్ చేసిన ప్రయత్నాలు ఏమిటి? భార్య లేకపోయినా ఉన్నట్టు మ్యానేజ్ చెయ్యడానికి సుందర్ పడిన కష్టాలు తెలియాలంటే.. పుష్పక విమానం చూసెయ్యాల్సిందే.

పెరఫార్మెన్స్:

దొరసాని సినిమాతో హీరో గా ఎంటర్ అయిన ఆనంద్ దేవరకొండ ఆ సినిమాతో నటనలో విమర్శలు ఎదుర్కొన్నా.. మిడిల్ క్లాస్ మెలోడీస్ తో హీరోగా ప్రూవ్ చేసుకున్నాడు. ఈ సినిమాలో చిట్టిలంక సుందర్ గా ఆనంద్ దేవరకొండ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. పెళ్ళాం లేచిపోతే ఆ భర్త పడే వేదన, ఎవరికీ తెలియకుండా దాచడానికి పడే ఇబ్బందులు.. ఇలా ఫేస్ ఎక్సప్రెషన్స్ లోను ఆనంద్ సహజంగా అనిపించాడు. కాకపోతే కామెడీ పరంగా తేలిపోయాడు. అలాగే చాలా సన్నివేశాల్లో సేమ్ ఎక్సప్రెషన్స్ తో ఇబ్బంది పెట్టాడు. హీరోయిన్ శాన్వి మేఘ‌న చేసే అల్లరి, న‌ట‌న‌పై ప్యాష‌న్ ఉన్న అమ్మాయిగా ఆమె క‌నిపించిన విధానం ఆక‌ట్టుకుంటుంది. శాన్వి పాత్రే సినిమాకి మెయిన్ హైలెట్ అనేలా ఉంది. సునీల్-శాన్విల మధ్య వచ్చే స‌న్నివేశాలు ఆకట్టుకునేలా ఉంది. మరో హీరోయిన్ గీత్ సైనీ అమాయకంగా మెప్పిస్తుంది. సునీల్‌, న‌రేష్‌ మిగిలిన నటులు పరిధిమేర ఆకట్టుకున్నారు.

విశ్లేషణ:

పెళ్లి కుదిరింది అని తెలిసాక పారిపోయే అమ్మాయిలు ఉంటారు.. పెళ్లి పీటల మీద నుండి లేచిపోయే అమ్మాయిలు ఉంటారు.. పెళ్లి అయ్యాక లేచిపోయే అమ్మాయిలు చాలా అరుదుగా ఉంటారు. దర్శకుడు దామోదర పెళ్లి తర్వాత భార్య లేచిపోతే.. భర్త పడే కష్టాలను పుష్పక విమానం కథతో సినిమాగా చూపించాలనుకున్నాడు. పెళ్లి తోనే పుష్పక విమానం సినిమా మొదలైంది.. ఓ ప్రభుత్వ టీచర్.. పెళ్లిపై కలలు కంటూ పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుని.. ఎంతో ఎగ్జైట్ అయ్యేలోపే భార్య లేచిపోవడం.. దానిని కప్పి పుచ్చడానికి అతను పడే ఇబ్బందులని కామెడీ టచ్ తో చూపించాడు దర్శకుడు. ఫస్ట్ హాఫ్ అంతా ఆహ్లాదంగానే సాగుతుంది. సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి కథ సీరియస్ మోడ్ లోకి వెళ్ళింది. ఎస్సై రంగంగా సునీల్‌, హెడ్ మాస్టర్ న‌రేష్ మధ్య వచ్చే సీన్స్ కామెడీగా అనిపించినా.. సాగ‌దీత‌గా అనిపిస్తాయి. క‌థ‌నం అంత‌గా ఆస‌క్తి రేకెత్తించదు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసిన ఓ కొలిక్కి రాని మీనాక్షి కేసుని హీరో త‌న‌కి దొరికిన క్లూస్‌తో ప‌రిశోధించ‌డం వంటివి కథకి అంతగా అత‌క‌లేదనిపిస్తోంది. అసలు హంతుకుడెవరు అనే విషయంలో ఉత్కంఠ రేకెత్తించేలా స్క్రీన్ ప్లే రాసుకోవడంలో చేసుకోవడంలో దర్శకుడు విఫలమయ్యాడు. ఫస్ట్ హాఫ్ కామెడీ పరంగా ఆకట్టుకుంది.. సెకండ్ హాఫ్ లో ఆ కామెడీ మిస్ అయ్యి.. కథ పక్కకి పోయింది.. లేదంటే పుష్పక విమానం ఫలితం వేరేలా ఉండేది.

సాంకేతికంగా..

ఈ సినిమాకి మ్యూజిక్ ఓకె ఓకె గా అనిపిస్తుంది. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బావుంది. జోసెఫ్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ విభాగం ద్వితీయార్థంపై ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. నిర్మాణ విలువలు నిరాశపరిచాయనే చెప్పాలి.

రేటింగ్: 2.25/5

Pushpaka Vimanam Movie Telugu Review :

Pushpaka Vimanam Movie Review 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement