Advertisement

సినీజోష్‌ రివ్యూ: పడి పడి లేచె మనసు


శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌

Advertisement

 

పడి పడి లేచె మనసు

 

తారాగణం: శర్వానంద్‌, సాయిపల్లవి, సునీల్‌, మురళీశర్మ, సంపత్‌ రాజ్‌, వెన్నెల కిశోర్‌, ప్రియదర్శి, ప్రియారామాన్‌, రవి కాలె, శత్రు తదితరులు

 

సినిమాటోగ్రఫీ: జయకృష్ణ గుమ్మడి

 

ఎడిటింగ్‌: ఎ.శ్రీకర్‌ప్రసాద్‌

 

సంగీతం: విశాల్‌ చంద్రశేఖర్‌ 

 

నిర్మాత: సుధాకర్‌ చెరుకూరి 

 

రచన, దర్శకత్వం: హను రాఘవపూడి 

 

విడుదల తేదీ: 21.12.2018

 

అందాల రాక్షసి, కృష్ణగాడి వీరప్రేమ గాధ, వంటి సూపర్‌హిట్‌ సినిమాలు రూపొందించిన హను రాఘవపూడి దర్శకత్వంలో, వైవిధ్యమైన సినిమాలు చేస్తూ హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ను ఏర్పరుచుకున్న శర్వానంద్‌ హీరోగా, సాయిపల్లవి హీరోయిన్‌గా రూపొందిన ప్రేమకథా చిత్రం పడి పడి లేచె మనసు. ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి కొత్త కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా ఏమేరకు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది? అనేది సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. 

 

అతని పేరు సూర్య (శర్వానంద్‌). ఫుట్‌బాల్‌ ప్లేయర్‌గా మంచి పేరు తెచ్చుకున్న సూర్య మెడికల్‌ స్టూడెంట్‌ అయిన వైశాలి(సాయిపల్లవి)ని తొలి చూపులోనే ప్రేమించేస్తాడు. ఆమె ప్రేమను పొందేందుకు రకరకాల ఎత్తులు వేసి చివరికి ఆమె ప్రేమను గెలుచుకుంటాడు. ఓ మెడికల్‌ క్యాంప్‌ కోసం వైశాలి నేపాల్‌ వెళుతుంది. అక్కడ ప్రత్యక్షమై వైశాలిని ఆశ్చర్యపరుస్తాడు సూర్య. ఆ సందర్భంలోనే పెళ్లి ప్రస్తావన తెస్తుంది వైశాలి. పెళ్లి మీద సదభిప్రాయం లేని సూర్య దానికి ఒప్పుకోడు. పెళ్లి చేసుకొని రాజీపడి బ్రతకలేనని, ఎన్నాళ్లయినా ఇలా ప్రేమికుల్లాగే ఉందామని చెప్పుకొస్తాడు. కలిసి ఉండకపోతే చనిపోతాం అనిపించినప్పుడే పెళ్లి చేసుకుందామంటాడు. అయితే సంవత్సరం తర్వాత మళ్ళీ నేపాల్‌ వస్తానని, అప్పటివరకు తమ మధ్య మాటలు ఉండకూడదని, మనం కలిసినపుడు పెళ్లి చేసుకోవాలని అనిపిస్తే వెంటనే చేసుకుందామని చెప్తుంది వైశాలి. సూర్య వివాహ బంధాన్ని ఇష్టపడకపోవడానికి కారణం ఏమిటి? ఆ క్షణం విడిపోయిన సూర్య, వైశాలి సంవత్సరం తర్వాత కలిశారా? ఆ సమయంలో ఇద్దరికీ ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? ఇద్దరూ పెళ్లి చేసుకున్నారా? అనేది మిగతా కథ. 

 

సూర్య, వైశాలి పాత్రల తీరుతెన్నులు ఎలా ఉన్నా ఆ క్యారెక్టర్స్‌లో శర్వానంద్‌, సాయిపల్లవి నటన అందర్నీ ఆకట్టుకుంటుంది. అంతేకాదు వీరిద్దరి కెమిస్ట్రీ కూడా బాగా కుదిరింది. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు స్క్రీన్‌పై వీరిద్దరే ఎక్కువగా కనిపిస్తారు. లవ్‌స్టోరీతోపాటు ఆడియన్స్‌ని నవ్వించేందుకు కొంత కామెడీ పార్ట్‌ని కూడా జోడించారు. సునీల్‌, వెన్నెల కిశోర్‌, ప్రియదర్శి అక్కడక్కడా నవ్వించేందుకు ప్రయత్నించారు. వైశాలి తండ్రిగా మురళీశర్మ నటన కూడా ఆకట్టుకుంటుంది. సూర్య తల్లిగా ప్రియా రామన్‌ పెర్‌ఫార్మెన్స్‌ సెంటిమెంటల్‌గా బాగానే వర్కవుట్‌ అయింది. 

 

సాంకేతిక నిపుణుల గురించి చెప్పాలంటే గుమ్మడి జయకృష్ణ ఫోటోగ్రఫీ ఆకట్టుకుంది. కోల్‌కత్తా, నేపాల్‌లోని సహజమైన వాతావరణాన్ని అందంగా చూపించే ప్రయత్నం చేశాడు. అలాగే హీరో, హీరోయిన్‌ని కూడా అందంగా చూపించాడు. విశాల్‌ చంద్రశేఖర్‌ చేసిన పాటల్లో టైటిల్‌ సాంగ్‌తోపాటు మరో పాట ఆకట్టుకుంది. కథనానికి తగ్గట్టుగా బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కూడా బాగానే కుదిరింది. శ్రీకర్‌ప్రసాద్‌ ఎడిటింగ్‌ బాగానే ఉన్నా ఫస్ట్‌హాఫ్‌లో, సెకండాఫ్‌లో రిపీటెడ్‌ సీన్స్‌ చాలా ఉన్నాయి. వాటిని తగ్గించినట్టయితే సినిమా ఇంకా స్పీడ్‌గా ఉండేది. ఇక దర్శకుడు హను రాఘవపూడి గురించి చెప్పాలంటే ఒక టిపికల్‌ లవ్‌ స్టోరీని అందంగా చూపించే ప్రయత్నం చేశాడు. ఏ సినిమాలోనైనా ఒకసారి ప్రేమించుకోవడం సర్వసాధారణం. ఈ సినిమాలో కొన్ని కారణాల వల్ల హీరో... హీరోయిన్‌ని రెండు సార్లు ప్రేమిస్తాడు. అలా ఎందుకు అనేది సినిమా చూస్తే తెలుస్తుంది. అయితే ఈ కాన్సెప్ట్‌ అందరికీ బోర్‌ కొట్టిస్తుంది. కొన్ని సన్నివేశాలు నేచురాలిటీకి చాలా దూరంగా ఉంటాయి. అప్పటివరకు ప్రేమించు.. ప్రేమించు అంటూ హీరోయిన్‌ వెంట పడ్డ హీరో ఒన్‌ ఫైన్‌ మార్నింగ్‌ తనకి పెళ్ళంటే ఇష్టం లేదని, ఇలా ప్రేమించుకుంటూనే ఉందామని చెప్తాడు. అది ఆడియన్స్‌కి రుచించదు. పైగా సెకండాఫ్‌లో కథను నడిపించేందుకు రకరకాల ట్విస్టులు పెట్టినప్పటికీ అది కూడా ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. ఉదాహరణకి హీరోయిన్‌కి మెమరీ లాస్‌ అయిందని చెప్పడం. ఆ కారణంతో అరగంట సినిమాని నడిపించడం బోర్‌ కొట్టిస్తుంది. సెకండాఫ్‌ మొత్తం ఆడియన్స్‌ని సీట్లలో కూర్చోబెట్టే స్టఫ్‌ కథలో లేకపోవడంతో ఈ తరహా కాన్సెప్ట్‌ని ఎంచుకున్నట్టు అనిపిస్తుంది. సినిమాలోని చాలా సీన్స్‌ అందాల రాక్షసిని గుర్తు తెస్తాయి. ఈ సినిమాకి ప్లస్‌ పాయింట్‌గా చెప్పుకోదగింది లొకేషన్స్‌. కోల్‌కతా, నేపాల్‌లోని లొకేషన్స్‌ మాత్రం నేచురల్‌గా అనిపించాయి. అలాగే శర్వానంద్‌, సాయిపల్లవి నటన, ఫోటోగ్రఫీ, మ్యూజిక్‌ ఈ సినిమాకి ప్లస్‌ పాయింట్స్‌గా చెప్పుకోవచ్చు. హీరో రెండు సార్లు ప్రేమించాల్సి రావడం అనే కాన్సెప్ట్‌ కొత్తగానే అనిపించినా దాని చుట్టూ అల్లిన కథ మాత్రం చాలా రొటీన్‌గా అనిపిస్తుంది. ఒక్కో సీన్‌లో అలా ఎలా జరుగుతుంది వంటి ప్రశ్నలు కూడా మనలో మెదులుతాయి. పడి పడి లేచె మనసు అనే పొయెటిక్‌ టైటిల్‌ పెట్టినప్పటికీ ఇది ఓ సాదా సీదా సినిమాగానే రన్‌ అవుతుంది. ప్రేమకోసం హీరో చేసే ప్రయత్నాలుగానీ, హీరోయిన్‌ కూడా ప్రేమించడం గానీ, రొటీన్‌గానే అనిపిస్తుంది. ఫైనల్‌గా చెప్పాలంటే కాన్సెప్ట్‌లో ఉన్న కొత్తదనం... కథ, కథనాల్లో లేకపోవడం వల్ల ఈ సినిమాని ప్రేక్షులు ఏమేర ఆదరిస్తారనేది సందేహమే. 


ఫినిషింగ్‌ టచ్‌: పడి పడి లేచేనా?

padi padi leche manasu review:

telugu movie padi padi leche manasu review
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement