డేటింగ్ పుకార్లను ఖండించిన హీరో టీమ్

Fri 14th Nov 2025 03:20 PM
ahan shetty  డేటింగ్ పుకార్లను ఖండించిన హీరో టీమ్
Ahan Shetty Team on dating Rumours డేటింగ్ పుకార్లను ఖండించిన హీరో టీమ్
Advertisement
Ads by CJ

సునీల్ శెట్టి న‌ట‌వార‌సుడు అహన్ శెట్టి ప్ర‌ముఖ‌ మరాఠీ నటి జియా శంకర్ తో డేటింగ్ చేస్తున్నట్లు ఇటీవ‌ల‌ పుకార్లు షికార్ చేస్తున్నాయి. ఒకానొక సమయంలో ఈ జంట పెళ్లి బాజాలు మోగుతాయని కూడా గుసగుసలు వినిపించాయి. అయితే అహన్ శెట్టి బృందం ఇప్పుడు అన్ని డేటింగ్ ఊహాగానాలను కొట్టి పారేసింది.

టైమ్స్ క‌థ‌నం ప్ర‌కారం.. అహాన్ బృందం ఒక నోట్ విడుద‌ల చేసింది. దాని సారంశం ఇలా ఉంది. ``ఈ డేటింగ్ పుకార్లు పూర్తిగా నిరాధారమైనవి. అహన్ ప్రస్తుతం ఎవరినీ కలవడం లేదు. అతడు పూర్తిగా తన పనిపై దృష్టి పెట్టాడు. అహాన్ వ‌రుస‌గా ప‌లు చిత్రాల్లో న‌టిస్తున్నాడు. బోర్డర్ 2 త్వరలో వస్తుంది`` అని రాసారు.

2021లో సాజిద్ నదియాద్వాలా తెర‌కెక్కించిన `తడప్‌`తో అహన్ శెట్టి బాలీవుడ్ అరంగేట్రం చేశాడు. కానీ మొద‌టి చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. ఇప్పుడు అతడు స‌న్నీడియోల్ లాంటి సీనియ‌ర్ హీరోతో `బోర్డర్ 2`లో న‌టిస్తున్నాడు.  

అహాన్ ప్రియురాలు అంటూ ప్ర‌చారం సాగుతున్న‌ జియా శంకర్ మ‌రాఠా న‌టి. చివరిసారిగా జెనీలియా -రితేష్ దేశ్‌ముఖ్‌లతో కలిసి మరాఠీ చిత్రం -వేద్‌లో కనిపించింది. పాపుల‌ర్ టీవీ షోలు పిషాచిని, కాటేలాల్ & సన్స్ లోను క‌నిపించింది. మ‌రాఠా  బిగ్ బాస్ OTT 2లో కూడా ఇంటి స‌భ్యురాలిగా కొన‌సాగింది. మొత్తానికి అహాన్ బృందం డేటింగ్ పుకార్ల‌కు పూర్తిగా చెక్ పెట్టిన‌ట్టే. అయితే పుకార్ల‌ను ఎదుర్కొంటున్న‌ తార‌లు ఎవ‌రూ దీనిని అధికారికంగా ధృవీక‌రించ‌లేదు.

Ahan Shetty Team on dating Rumours :

  Ahan Shetty Team clarification on the dating buzz  

Tags:   AHAN SHETTY
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ