Advertisement

సినీజోష్‌ రివ్యూ: 16

Sat 11th Mar 2017 12:16 AM
telugu movie 16 review,16 movie review in cinejosh,16 movie cinejosh review  సినీజోష్‌ రివ్యూ: 16
సినీజోష్‌ రివ్యూ: 16
Advertisement

శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వర ఫిలింస్‌ 

16 

తారాగణం: రెహమాన్‌, ప్రకాష్‌ విజయ రాఘవన్‌, వినోద్‌వర్మ, కునాల్‌ కౌశిక్‌, 

యాషిక ఆనంద్‌, అంజన జయప్రకాష్‌ తదితరులు 

సినిమాటోగ్రఫీ: సుజీత్‌ సారంగ్‌ 

సంగీతం: జేక్స్‌ బెజోయ్‌ 

ఎడిటింగ్‌: శ్రీజిత్‌ సారంగ్‌ 

మాటలు: శివరామ్‌ ప్రసాద్‌ గోగినేని 

సమర్పణ: చదలవాడ బ్రదర్స్‌ 

నిర్మాత: చదలవాడ పద్మావతి 

రచన, దర్శకత్వం: కార్తీక్‌ నరేన్‌ 

విడుదల తేదీ: 10.03.2017 

ప్రతి మనిషి జీవితంలో సంతోషపడే సంఘటనలు, బాధకు గురి చేసే సంఘటనలు జరగడం సహజం. అయితే బాధ కలిగించే సంఘటనలు జరిగినపుడు మాత్రం ఇలా కాకుండా మరోలా జరిగి వుండే ఈ బాధ వుండేది కాదు కదా అని మనకు మనమే ఊహించుకుంటాం. ఇది కూడా సహజమే. సాధారణ వ్యక్తి కంటే ఒక పోలీస్‌ ఆఫీసర్‌ జీవితంలో ఇలా అనుకునే సంఘటనలు చాలా వుంటాయి. వృత్తిపరంగా పోలీస్‌ ఆఫీసర్‌ ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటాడు. అలా ఓ మర్డర్‌ మిస్టరీ ఒక పోలీస్‌ ఆఫీసర్‌కి పెద్ద సవాల్‌గా మారింది. ఆ మిస్టరీ ఛేదించకుండానే ఆ ఆఫీసర్‌ రిటైర్‌ అయిపోయాడు. అతనే దీపక్‌(రెహమాన్‌). ఇది జరిగిన 5 సంవత్సరాల దీపక్‌ దగ్గర హెడ్‌ కానిస్టేబుల్‌గా పనిచేసిన రాజయ్య ద్వారా ఓ వ్యక్తి దీపక్‌ దగ్గరకు వస్తాడు. తనకు పోలీస్‌ ఆఫీసర్‌ అవ్వాలన్నది డ్రీమ్‌ అని చెప్తాడు. అయితే ఆ జాబ్‌ ఎంత కష్టమైనదో చెప్తూ తను సాల్వ్‌ చెయ్యలేకపోయిన కేసు గురించి వివరిస్తాడు. మర్డర్‌ అండ్‌ మిస్సింగ్‌ కేసుకి సంబంధించి 16 గంటల పాటు జరిగిన వివిధ సంఘటనలు ఆ వ్యక్తికి చెప్తాడు. ఆ మర్డర్‌ ఏమిటి? మిస్సింగ్‌ కేసు ఏమిటి? అనేది ఇక్కడ ప్రస్తావించడం కంటే సినిమా చూసి తెలుసుకుంటేనే ఆ థ్రిల్‌ని అనుభవించగలరు. 

రెహమాన్‌ ప్రధాన పాత్రలో దురువంగల్‌ పత్తినారు పేరుతో కార్తీక్‌ నరేన్‌ రూపొందించిన ఈ చిత్రాన్ని చదలవాడ బ్రదర్స్‌ 16 పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందించారు. తమిళ్‌లో విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం ఆద్యంతం మనకు ఓ మిస్టరీగానే అనిపిస్తుంది. కేవలం 22 సంవత్సరాల వయసులో దర్శకుడు కార్తీక్‌ నరేన్‌ ఎంతో మెచ్యూర్డ్‌గా ఈ చిత్రాన్ని మంచి టెక్నికల్‌ వేల్యూస్‌తో తెరకెక్కించాడు. సినిమా స్టార్ట్‌ అయిన తర్వాత మొదటి సీన్‌ నుంచే సస్పెన్స్‌ అనేది స్టార్ట్‌ అవుతుంది. ఒక మర్డర్‌కి సంబంధించి పోలీస్‌ ఇన్వెస్టిగేషన్‌ ఎన్ని కోణాల నుంచి చేస్తారు. ఏ చిన్న ఆధారం దొరికినా దానితో ఎంత దూరం వెళ్తారు అనేది డీటైల్డ్‌ చూపించాడు కార్తీక్‌. సినిమా స్టార్ట్‌ అయినపుడు మొదలైన సస్పెన్స్‌ చివరి ఐదు నిముషాల వరకు రన్‌ అవుతూనే వుంటుంది. ప్రేక్షకుల మెదడుకు పనిపెట్టే ఈ సినిమాలోని ఒక్క షాట్‌ మిస్‌ అయినా అది మనకు మిస్టరీలా మారుతుంది తప్ప అర్థం కాదు. ఈ విషయంలో డైరెక్టర్‌ కార్తీక్‌ ఎంతో తెలివిని ప్రదర్శించి నెక్స్‌ట్‌ ఏం జరగబోతోంది? హంతకుడు ఎవరై వుంటారు? అనేది అణుమాత్రమైనా ఊహించే అవకాశం లేకుండా చాలా గ్రిప్పింగ్‌గా సినిమాని నడిపించాడు. ఈ సినిమా చూసిన తర్వాత సినిమా తియ్యడమే కాదు, చూడడం కూడా కష్టమే అని ప్రేక్షకుల చేత అనిపించాడు కార్తీక్‌. 

పోలీస్‌ ఆఫీసర్‌ దీపక్‌ పాత్రలో రెహమాన్‌ ఎంతో అద్భుతంగా నటించాడు. రెహమాన్‌ తప్ప తెలుగు ప్రేక్షకులకు పరిచయం వున్న ఒక్క ఫేస్‌ కూడా సినిమాలో కనిపించదు. అయినప్పటికీ ఆ ఫీలింగ్‌ రాకుండా ఇంట్రెస్టింగ్‌గా కథ నడుస్తుంది. సినిమాకి సంబంధించిన ఒక్క షాట్‌ని కూడా ప్రేక్షకులు మిస్‌ చేసుకునే ప్రయత్నం చెయ్యరు. 

టెక్నికల్‌ డిపార్ట్‌మెంట్‌ గురించి చెప్పాల్సి వస్తే సుజిత్‌ సారంగ్‌ ఫోటోగ్రఫీ, జేక్స్‌ బెజోయ్‌ మ్యూజిక్‌, శ్రీజిత్‌ సారంగ్‌ ఎడిటింగ్‌ సినిమాకి పెద్ద ప్లస్‌ పాయింట్స్‌ అయ్యాయి. ప్రతి షాట్‌ని ఎంతో అందంగా చిత్రీకరించాడు సుజిత్‌. కార్తీక్‌ నరేన్‌ చేసిన స్క్రీన్‌ప్లే మాయకి అనుగుణంగా శ్రీజిత్‌ ఎడిటింగ్‌ కూడా ప్రేక్షకులను థ్రిల్‌ చేసింది. ఆడియన్స్‌ థ్రిల్‌ ఫీల్‌ అయ్యే ప్రతి మూమెంట్‌ని తన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌తో మరింత హై రేంజ్‌కి తీసుకెళ్ళాడు మ్యూజిక్‌ డైరెక్టర్‌ జేక్స్‌ బెజోయ్‌. శివరామ్‌ప్రసాద్‌ గోగినేని రాసిన మాటలు కూడా ఎంతో ఎఫెక్టివ్‌గా వున్నాయి. ఇక డైరెక్టర్‌ కార్తీక్‌ నరేన్‌ గురించి చెప్పాలంటే ఈ చిత్రం షూటింగ్‌ని కేవలం 28 రోజుల్లోనే పూర్తి చేసినా అంతకుముందు ఈ స్క్రిప్ట్‌ కోసం ఎంత హార్డ్‌ వర్క్‌ చేసి వుంటాడో సినిమా చూస్తే తెలుస్తుంది. ఎవ్రీ డీటైల్‌ కౌంట్స్‌ అని టైటిల్‌లో వున్నట్టుగానే ఏ డీటైల్‌ను మిస్‌ చేయకుండా ఒక పర్‌ఫెక్ట్‌ మూవీని ప్రేక్షకులకు అందించాడు. ఇలాంటి మర్డర్‌ మిస్టరీలు గతంలో ఎన్నో వచ్చాయి. ఒక్కో కథని ఒక్కోలా ప్రజెంట్‌ చేశారు. అయితే వాటన్నింటికీ భిన్నంగా ఒక కొత్త యాంగిల్‌లో ఈ థ్రిల్లర్‌ని రూపొందించాడు కార్తీక్‌. దానికి మంచి ఫోటోగ్రఫీ, మంచి సౌండ్‌ డిజైన్‌ చేసుకొని ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని కలిగిస్తున్నాడు. ఆర్టిస్టుల పెర్‌ఫార్మెన్స్‌, కథనం, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్‌, ఎవ్వరూ ఊహించని క్లైమాక్స్‌ ఈ సినిమాకి ప్లస్‌ పాయింట్స్‌గా నిలిచాయి. నేటివిటీ లేకపోవడం, సగటు ప్రేక్షకుడు కోరుకునే కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఒక శాతం కూడా లేకపోవడం, ఒక వర్గం ప్రేక్షకులకు మాత్రమే ఈ సినిమా నచ్చేలా వుండడం మైనస్‌ పాయింట్స్‌. ఫైనల్‌గా చెప్పాలంటే కథపరంగా, కథనం పరంగా, ఆర్టిస్టుల పెర్‌ఫార్మెన్స్‌ పరంగా మ్యూజిక్‌ పరంగా అందరికీ ఒక థ్రిల్లింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌నిచ్చే ఈ సినిమాకి బి, సి సెంటర్ల ఆడియన్స్‌ నుంచి ఎలాంటి రెస్పాన్స్‌ వస్తుందో చూడాలి. 

ఫినిషింగ్‌ టచ్‌: మస్ట్‌ వాచ్‌ మూవీ 

సినీజోష్‌ రేటింగ్‌: 3/5

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement