Advertisement

సినీజోష్‌ రివ్యూ: 100 డేస్‌ ఆఫ్‌ లవ్‌

Sat 27th Aug 2016 07:55 AM
telugu movie 100 days of love,100 days of love movie review,100 days of love review in cinejosh,100 days of love cinejosh review,nitya menon in 100 days of love,dulqar salman in 100 days of love  సినీజోష్‌ రివ్యూ: 100 డేస్‌ ఆఫ్‌ లవ్‌
సినీజోష్‌ రివ్యూ: 100 డేస్‌ ఆఫ్‌ లవ్‌
Advertisement

ఎస్‌.ఎస్‌.సి. మూవీస్‌, అభిషేక్‌ పిక్చర్స్‌ 

100 డేస్‌ ఆఫ్‌ లవ్‌ 

తారాగణం: దుల్కర్‌ సల్మాన్‌, నిత్యా మీనన్‌, శేఖర్‌ మీనన్‌, 

వినీత్‌, రాహుల్‌ మాధవ్‌ తదితరులు 

సినిమాటోగ్రఫీ: ప్రతీష్‌ వర్మ 

సంగీతం: గోవింద్‌ మీనన్‌ 

బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌: బిజిబల్‌ 

ఎడిటింగ్‌: సందీప్‌ కుమార్‌ 

మాటలు: శశాంక్‌ వెన్నెలకంటి, రాకేందు మౌళి 

సమర్పణ: ఎస్‌.బబిత 

నిర్మాత: ఎస్‌.వెంకటరత్నం(వెంకట్‌) 

రచన, దర్శకత్వం: జీనస్‌ మహమ్మద్‌ 

విడుదల తేదీ: 26.08.2016 

ప్రేమకథా చిత్రాలు తియ్యడంలో ఒక్కో దర్శకుడిది ఒక్కో శైలి. ఎవరు ఎలా తీసినా అది ప్రేక్షకులకు కనెక్ట్‌ అయ్యేలా వుంటే అప్పుడది సక్సెస్‌ఫుల్‌ లవ్‌ స్టోరీ అవుతుంది. ఈ ఐదారేళ్ళ కాలంలో వచ్చిన ప్రేమకథా చిత్రాల్లో అందర్నీ అమితంగా ఆకట్టుకున్న సినిమా ఏమాయ చేసావె. ఈ చిత్రంలో నాగచైతన్య, సమంత పెర్‌ఫార్మెన్స్‌, గౌతమ్‌ మీనన్‌ కథ చెప్పిన విధానం, టేకింగ్‌ స్టైల్‌, మెస్మరైజ్‌ చేసిన ఎ.ఆర్‌.రెహమాన్‌ పాటలు.. ఇలా అన్నీ సమపాళ్ళలో వున్న 100 పర్సెంట్‌ లవ్‌స్టోరీ అది. మళ్ళీ అలాంటి సినిమా తియ్యాలని ఎంతో మంది డైరెక్టర్లు ట్రై చేసినప్పటికీ ఎవ్వరూ సక్సెస్‌ అవ్వలేకపోయారు. అయితే మలయాళంలో జీనస్‌ మహమ్మద్‌ అనే డైరెక్టర్‌ మళ్ళీ అలాంటి ప్రయత్నమే చేశాడు. అదే 100 డేస్‌ ఆఫ్‌ లవ్‌. దుల్కర్‌ సల్మాన్‌, నిత్యమీనన్‌ జంటగా మణిరత్నం డైరెక్షన్‌లో వచ్చిన ఓకే బంగారం కొన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఈ జంటతో 100 డేస్‌ ఆఫ్‌ లవ్‌ అంతకుముందే చేసిన సినిమాయే అయినా తెలుగులో మాత్రం ఓకే బంగారం తర్వాత రిలీజ్‌ అయింది. మలయాళంలో సూపర్‌హిట్‌ చిత్రంగా పేరు తెచ్చుకున్న ఈ సినిమా తెలుగులో కూడా అదే పేరుతో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మలయాళంలో సక్సెస్‌ అయిన ఈ సినిమా తెలుగు ఆడియన్స్‌కి ఎంతవరకు కనెక్ట్‌ అయింది? ఈ ప్రేమకథా చిత్రం ఏమేర ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది? అనేది సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. 

అతని పేరు రావుగోపాలరావు(దుల్కర్‌ సల్మాన్‌). ఆమె పేరు సావిత్రి(నిత్యా మీనన్‌). ఇద్దరివీ వేర్వేరు దారులు, వేర్వేరు మనస్తత్వాలు. స్వతంత్ర భావాలు కలిగిన రావుగోపాలరావు ఏదైనా ఒరిజనల్‌గానే వుండాలని, ఎదుటివారి కోసం మన అభిరుచుల్ని, మనస్తత్వాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదని నమ్మేవాడు. ఎలాంటి రిస్క్‌ వుండని సెక్యూర్డ్‌ లైఫ్‌ని కోరుకునే అమ్మాయి సావిత్రి. తనకి లవ్‌ అంటే ఏమిటో తెలియదని, ఆ అనుభూతిని తానెప్పుడూ పొందలేదని చెప్తూ వుంటుంది. మన హీరో, హీరోయిన్‌ మనస్తత్వాలు ఇలా వున్నాయి. ఇక కథలోకి వస్తే ఒక అమ్మాయితో బ్రేక్‌ అప్‌ అయిపోయి, ఉద్యోగం కూడా పోగొట్టుకొని తిరుగుతున్న రావుగోపాలరావుకి ఓరోజు సడెన్‌గా సావిత్రి కనిపిస్తుంది. అంతే సడన్‌గా వెళ్ళిపోతుంది. క్షణ కాలంలోనే ఆమెతో లవ్‌లో పడిపోతాడు రావుగోపాలరావు. ఆమె వెళ్ళిన తర్వాత ఆమెకు చెందిన బ్యాగ్‌ ఒకటి రావుగోపాలరావుకి దొరుకుతుంది. ఆ బ్యాగ్‌లో ఓ కెమెరా వుంటుంది. అందులోని ఫోటోలను ప్రింట్‌ వేయిస్తాడు. ఆ ఫోటోల ఆధారంగా తన ఫ్రెండ్‌ గుమ్మడి(శేఖర్‌ మీనన్‌)తో కలిసి ఊరంతా తిరిగేస్తాడు. ఓ ఫైన్‌ డే ఇద్దరూ కలుసుకొని తాము స్కూల్‌ డేస్‌లో ఫ్రెండ్స్‌గా వున్నట్టు గుర్తు చేసుకుంటారు. అలా వారి మధ్య ఫ్రెండ్‌షిప్‌ పెరుగుతుంది. అయితే తనకు రాహుల్‌(రాహుల్‌ మాధవ్‌) అనే బాయ్‌ ఫ్రెండ్‌ వున్నాడని, త్వరలోనే తామిద్దరూ పెళ్ళి చేసుకోబోతున్నామని చెప్తుంది సావిత్రి. అది విన్న రావుగోపాలరావు ఎలా రియాక్ట్‌ అయ్యాడు? రావుగోపాలరావు, సావిత్రిల మధ్య వున్నది నిజంగా ఫ్రెండ్‌ షిప్పేనా? మరి వీరిద్దరూ చివరి వరకు ఫ్రెండ్స్‌గానే మిగిలిపోయారా? లేక ప్రేమికులుగా కలుసుకున్నారా? అనేది మిగతా కథ. 

ఇది కొత్త కథ కాదు. ఎన్నో ఏళ్ళుగా మనం వింటున్న కథలే, చూస్తున్న సినిమాలే. ఈ సినిమా విషయానికి వస్తే ఏమాయ చేసావె లాంటి దృశ్యకావ్యం తియ్యాలనుకున్న డైరెక్టర్‌ ఆ సినిమాలోలాగే ఈ సినిమాలో కూడా హీరో పక్కన ఓ బోండాం ఫ్రెండ్‌ని పెట్టాడు. పైగా అతనికి కృష్ణుడితోనే డబ్బింగ్‌ చెప్పించాడు. తను ప్రేమించిన అమ్మాయిని సంతోష పెట్టడం కోసం ఎంత రిస్కయినా తీసుకునే అబ్బాయిగా దుల్కర్‌ సల్మాన్‌ ఫర్వాలేదు అనిపించింది. ముఖ్యంగా సెకండాఫ్‌లో అతని పెర్‌ఫార్మెన్స్‌కి మంచి మార్కులు ఇవ్వొచ్చు. ఇక నిత్యమీనన్‌ గురించి చెప్పాలంటే ఆమె ఫుల్‌ ప్లెడ్జ్‌డ్‌గా కనిపించేది సెకండాఫ్‌లోనే. తన క్యారెక్టర్‌ని ఎంతో సెటిల్డ్‌గా చేసింది. హీరో ఫ్రెండ్‌గా నటించిన శేఖర్‌ మీనన్‌ పెర్‌ఫార్మెన్స్‌ బాగుంది. అతనికి డబ్బింగ్‌ చెప్పింది కృష్ణుడు కావడంతో కొన్ని చోట్ల ఏమాయ చేసావె సినిమా చూస్తున్న ఫీల్‌ కలుగుతుంది. నిత్యకి బాయ్‌ఫ్రెండ్‌గా నటించిన రాహుల్‌ మాధవ్‌ పెర్‌ఫార్మెన్స్‌ కూడా ఆకట్టుకుంటుంది. 

టెక్నికల్‌ డిపార్ట్‌మెంట్స్‌కి వస్తే ప్రతీష్‌వర్మ ఫోటోగ్రఫీ ఎక్స్‌లెంట్‌గా వుంది. స్టార్టింగ్‌ నుంచి ఎండింగ్‌ వరకు ప్రతి సీన్‌ని డీసెంట్‌గా చూపించడంలో ప్రతీష్‌ సక్సెస్‌ అయ్యాడు. గోవింద్‌ మీనన్‌ చేసిన పాటలు ఓకే అనిపించాయి. బిజిబల్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ బాగుంది. శశాంక్‌ వెన్నెలకంటి, రాకేందుమౌళి రాసిన మాటలు కొంతవరకు ఆకట్టుకుంటాయి. ఇక డైరెక్టర్‌ జీనస్‌ మహమ్మద్‌ గురించి చెప్పాలంటే ఒక పాత కథని తీసుకొని కొత్తగా చెప్పే ప్రయత్నం చేశాడు. లవ్‌స్టోరీని డీసెంట్‌గా తియ్యాలన్న ప్రయత్నం ఫలించలేదు. ఫస్ట్‌ హాఫ్‌లోని ప్రతి సీన్‌ ఆడియన్స్‌కి బోర్‌ కొట్టేదిగానే వుంటుంది. ముఖ్యంగా హీరోయిన్‌ ఫోటోలు పట్టుకొని ఆమె కోసం సిటీ అంతా వెతకడం, దాని కోసం రకరకాల ప్లాన్స్‌ వేయడం చాలా సిల్లీగా అనిపిస్తుంది. ఫస్ట్‌ హాఫ్‌ కంప్లీట్‌ అయిపోతున్నా హీరోయిన్‌ కనిపించదు. 2 గంటల 35 నిముషాల సినిమాలో 35 నిముషాలు ఆడియన్స్‌కి బోర్‌ కొట్టించే సీన్సే వుంటాయి. ఫస్ట్‌ హాఫ్‌ కంప్లీట్‌ అయిపోగానే థియేటర్‌ నుంచి బయటికి వెళ్ళిపోయేవారు కూడా వుంటారు. అయితే సెకండాఫ్‌లో స్టార్ట్‌ అయ్యే అసలు కథతో ఆడియన్స్‌కి బోర్‌ కొట్టకుండా క్లైమాక్స్‌ వరకు తీసుకెళ్ళడంలో మాత్రం డైరెక్టర్‌ జీనస్‌ సక్సెస్‌ అయ్యాడు. అసలు సినిమా అంతా సెకండాఫ్‌లోనే వుండడంతో ఫస్ట్‌ హాఫ్‌ చూసి విసుగెత్తిన ఆడియన్స్‌కి సెకండాఫ్‌ మంచి రిలీఫ్‌నిస్తుంది. ఏది ఏమైనా ఏమాయ చేసావె లాంటి ప్రేమకథా చిత్రాన్ని తీసి తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించాలనుకున్న జీనస్‌ సక్సెస్‌ అవ్వలేకపోయాడు. ఫైనల్‌గా చెప్పాలంటే ఫస్ట్‌ హాఫ్‌లో స్టఫ్‌ లేకపోవడం, అనవసరమైన సీన్స్‌తో ఆడియన్స్‌ని విసిగించడం, సెకండాఫ్‌కి వచ్చే సరికి కథని సరైన దారిలో తీసుకెళ్ళి ఓ హ్యాపీ ఎండింగ్‌ ఇవ్వడంతో థియేటర్‌ నుంచి బయటికి వచ్చే ఆడియన్స్‌కి సినిమా ఫర్వాలేదు అనే ఫీలింగ్‌ కలుగుతుంది. అయితే సగటు ప్రేక్షకులు కోరుకునే ఎంటర్‌టైన్‌మెంట్‌, కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఇందులో లేకపోవడం ఒక మైనస్‌ అయితే, ఫస్ట్‌హాఫ్‌లో బోరింగ్‌ సీన్స్‌ విసిగించడం సినిమాకి మరింత మైనస్‌ అయింది. ఈ సినిమా మల్టీప్లెక్స్‌ ఆడియన్స్‌ చూసేందుకే తప్ప బి, సి సెంటర్స్‌ ఆడియన్స్‌ని ఆకట్టుకునే అవకాశం లేదు. 

ఫినిషింగ్‌ టచ్‌: ఫస్టాఫ్‌ బోరింగ్‌.. సెకండాఫ్‌ ఓకే. 

సినీజోష్‌ రేటింగ్‌: 2.25/5

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement