Advertisement

సినీజోష్‌ రివ్యూ: లచ్చిందేవికి ఓ లెక్కుంది

Sat 30th Jan 2016 01:20 PM
telugu movie lachimdeviki o lekkundi review,lachimdeviki o lekkundi movie cinejosh review,lavanya tripathi in lachimdeviki o lekkundi,lachimdeviki o lekkundi released  సినీజోష్‌ రివ్యూ: లచ్చిందేవికి ఓ లెక్కుంది
సినీజోష్‌ రివ్యూ: లచ్చిందేవికి ఓ లెక్కుంది
Advertisement

మయూఖ క్రియేషన్స్‌ 

లచ్చిందేవికి ఓ లెక్కుంది 

తారాగణం: నవీన్‌చంద్ర, లావణ్య త్రిపాఠి, జె.పి., 

అజయ్‌, బ్రహ్మాజీ తదితరులు 

సినిమాటోగ్రఫీ: ఈశ్వర్‌ 

సంగీతం: యం.యం.కీరవాణి 

ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు 

నిర్మాత: సాయిప్రసాద్‌ కామినేని 

రచన, దర్శకత్వం: జగదీష్‌ తలశిల 

విడుదల తేదీ: 29.01.2016 

నవీన్‌చంద్ర, లావణ్య త్రిపాఠి జంటగా రూపొందిన అందాల రాక్షసి తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో క్రైమ్‌ థ్రిల్లర్‌గా రూపొందిన సినిమా లచ్చిందేవికి ఓ లెక్కుంది. రాజమౌళి దగ్గర అసిస్టెంట్‌గా వర్క్‌ చేసిన జగదీష్‌ తలశిల ఈ చిత్రం ద్వారా దర్శకుడుగా పరిచయమయ్యాడు. మరి ఈ లచ్చిందేవికి ఓ లెక్కుంది చిత్రం ఎవరి లెక్కల్ని ఎలా సెటిల్‌ చేసింది? డైరెక్టర్‌ జగదీష్‌ తన ఫస్ట్‌ మూవీతో ఎంత వరకు సక్సెస్‌ అయ్యాడు? గోల్డెన్‌ లెగ్‌గా పేరు తెచ్చుకున్న లావణ్య త్రిపాఠికి ఈ సినిమా ఎలాంటి రిజల్ట్‌నిచ్చింది? అనేది సమీక్షలో చూద్దాం. 

దేశంలోని అన్ని బ్యాంకుల్లో అన్‌క్లైయిమ్డ్‌ ఎకౌంట్స్‌ చాలా వున్నాయని, అవన్నీ కొన్ని వేల కోట్లు వుంటాయనే ఒక కొత్త కాన్సెప్ట్‌తో టైటిల్స్‌తోపాటు కథ ఎత్తుకోవడంతో ఇదేదో డిఫరెంట్‌ మూవీలా వుందే అని ఆడియన్స్‌ ఆనంద పడేలోపు టైటిల్స్‌ కంప్లీట్‌ అవుతాయి. చాలా నార్మల్‌గా, చాలా స్లో..గా సినిమా స్టార్ట్‌ అవుతుంది. అతని పేరు నవీన్‌(నవీన్‌చంద్ర), ఆమె పేరు దేవి(లావణ్య త్రిపాఠి). ఇద్దరూ ఒకే అపార్ట్‌మెంట్‌లో వేర్వేరు ఫ్లాట్లలో వుంటారు. కానీ, ఇద్దరూ పనిచేసేది జనతా బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో. ఇద్దరూ పనిచేసేది ఒకేచోట అయినా నవీన్‌ బిహేవియర్‌ వల్ల అతన్ని దేవి ఇష్టపడదు. డబ్బు అంటే విపరీతమైన ఆశ వున్న నవీన్‌కి ఒకరోజు అతని ఎకౌంట్‌లో లక్ష రూపాయలు డిపాజిట్‌ అయ్యాయని మెసేజ్‌ వస్తుంది. క్షణం ఆలస్యం చెయ్యకుండా ఆ డబ్బుతో తాగి, పేకాడి ఖతం చేస్తాడు. నవీన్‌ ఎకౌంట్‌లో డబ్బు డిపాజిట్‌ చేసింది మహేష్‌(అజయ్‌). నవీన్‌ని తన దగ్గరకు పిలిపించుకుంటాడు మహేష్‌. తనకు జనతా బ్యాంక్‌లోని అన్‌క్లైయిమ్డ్‌ ఎకౌంట్స్‌ డేటా కావాలని, అందుకే లక్ష రూపాయలు డిపాజిట్‌ చేశానని చెప్తాడు. ఆ డేటా తెచ్చిస్తే వచ్చిన అమౌంట్‌లో 10 పర్సెంట్‌ ఇస్తానంటాడు మహేష్‌. ఆ డేటా సంపాదించాలంటే దేవి అవసరం వుండడంతో ఆమెను లైన్‌లో పెట్టి మొత్తానికి డేటా సంపాదిస్తాడు. ఆ డేటాలోని రెండు ఎకౌంట్లను సెలెక్ట్‌ చేసుకొని కోట్ల రూపాయలు డ్రా చెయ్యాలని ప్లాన్‌ వేస్తారు మహేష్‌, అతని లవర్‌. నవీన్‌ హెల్ప్‌తో అన్ని ఫార్మాలిటీస్‌ పూర్తి చేసుకొని డబ్బు చేతికి వస్తుందనుకుంటున్న టైమ్‌లో బ్యాంక్‌ మేనేజర్‌ వల్ల ఒక ఇబ్బంది ఎదురవుతుంది. ఏమిటా ఇబ్బంది? లచ్చిందేవికి ఓ లెక్కుంది.. మరి ఈ డబ్బుతో దేవికి ఏదైనా లెక్కలు వున్నాయా? మహేష్‌కి ఈ విషయంలో హెల్ప్‌ చేసిన నవీన్‌ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? మహేష్‌ డ్రా చెయ్యాలనుకున్న ఆ డబ్బు ఎవరిది? అనేది తెరపై చూడాల్సిందే. 

ఈ కథలో మనకు కనిపించే క్యారెక్టర్లు చాలా తక్కువ. ప్రతి సీన్‌లోనూ హీరో, హీరోయిన్‌ లేదా బ్యాంక్‌ మేనేజర్‌ కనిపిస్తారు. నవీన్‌చంద్ర ఈ సినిమాలో చేసిన క్యారెక్టర్‌కి అంత ప్రాధాన్యత లేదు. అతని క్యారెక్టరైజేషన్‌ కూడా స్ట్రాంగ్‌గా వున్నట్టు కనిపించదు. పెర్‌ఫార్మెన్స్‌ పరంగా చెప్పుకోవాల్సి వస్తే లావణ్య త్రిపాఠి గురించే చెప్పాలి. దేవిగా, ఉమాదేవిగా, అంకాళమ్మగా మూడు డిఫరెంట్‌ క్యారెక్టర్స్‌ కథ ప్రకారం చేసింది. మూడు క్యారెక్టర్స్‌లో తన పెర్‌ఫార్మెన్స్‌తో మెప్పించింది. సినిమాలో మరో ఇంపార్టెంట్‌ క్యారెక్టర్‌ బ్యాంక్‌ మేనేజర్‌ సోమయాజులు. ఈ క్యారెక్టర్‌లో జె.పి. కొంత బాగానే చేసినట్టు అనిపిస్తాడు. కొన్ని చోట్ల బాగా విసిగిస్తాడు. మహేష్‌గా అజయ్‌ పెర్‌ఫార్మెన్స్‌ గురించి కొత్తగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. సినిమా స్టార్ట్‌ అయినప్పటి నుంచి ఎండ్‌ అయ్యే వరకు మధ్య మధ్య భూమి లోపల ఒక సొరంగాన్ని తవ్వుతున్న వ్యక్తిని చూపిస్తుంటారు. క్లైమాక్స్‌లో బ్యాంక్‌ ఫ్లోరింగ్‌ బద్దలు కొట్టుకొని పైకి వస్తాడు బర్నింగ్‌ స్టార్‌ సంపూర్ణేష్‌బాబు. ఈ క్యారెక్టర్‌తో బ్రహ్మాండమైన కామెడీ చేయిద్దామని అనుకొని వుంటాడు డైరెక్టర్‌. కానీ, అది 1 పర్సెంట్‌ కూడా వర్కవుట్‌ అవ్వలేదు. అలాంటి ఎందుకూ పనికి రాని క్యారెక్టర్‌ సంపూ ఈ సినిమాలో చేశాడు. 

టెక్నికల్‌ ఎస్సెట్స్‌గా చెప్పుకోదగ్గవి ఈ సినిమాలో ఏమీ లేవు. ఫోటోగ్రఫీలోగానీ, ఎఫెక్ట్స్‌లోగానీ ఎక్కడా మనని థ్రిల్‌ చేసేవి లేవు. ఎడిటింగ్‌ విషయానికి వస్తే రెండు గంటలలోపు సినిమా మొదటి నుంచీ చాలా స్లోగా వుండడంతో రెండున్నర గంటలకుపైగా సినిమా చూసిన ఫీల్‌ కలుగుతుంది. ఈమధ్యకాలంలో కీరవాణి చేసిన నాసిరకం మ్యూజిక్‌ ఇదే. ఇందులోని ఒక్క పాట కూడా ఆకట్టుకునేలా లేదు. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కూడా సోసోగా వుంది. డైరెక్టర్‌ విషయానికి వస్తే సినిమా స్టార్ట్‌ అవ్వగానే అతను చెప్పిన కాన్సెప్ట్‌ విని ఒక కొత్త తరహా సినిమా చూడబోతున్నామని అందరూ అనుకునేలోపే సినిమా ఎలా వుండబోతోంది అనేది తెలిసిపోతుంది. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌లో ఇచ్చిన ట్విస్ట్‌తో సెకండాఫ్‌ చాలా ట్విస్ట్‌లతో థ్రిల్లింగ్‌గా వుంటుందని ఎక్స్‌పెక్ట్‌ చేసే ఆడియన్స్‌ని డిజప్పాయింట్‌ చేస్తాడు డైరెక్టర్‌. సెకండాఫ్‌ స్టార్ట్‌ అవ్వడం కూడా చాలా స్లోగానే స్టార్ట్‌ అవుతుంది. మనకి స్క్రీన్‌ మీద కనిపించే ఆర్టిస్టులు ఒక్కొక్కరు ఒక్కో ట్విస్ట్‌ ఇస్తుంటారు. ఏది నమ్మాలో ఏది నమ్మ కూడదో ఆయా క్యారెక్టర్లకు అర్థం కాదు, మనం ఏం సినిమా చూస్తున్నామో మనకీ అర్థం కాదు. 

లచ్చిందేవికి ఓ లెక్కుంది అనే ఒక డిఫరెంట్‌ టైటిల్‌తో సినిమా వస్తోంది, అది కూడా రాజమౌళి శిష్యుడు డైరెక్ట్‌ చేస్తున్నాడనగానే ఆడియన్స్‌లో సినిమా మీద కొంత క్యూరియాసిటీ వుండడం సహజం. అయితే సినిమా స్టార్ట్‌ అవ్వగానే ఆడియన్స్‌లో కూడా డిజప్పాయింట్‌మెంట్‌ స్టార్ట్‌ అవుతుంది. ఫస్ట్‌హాఫ్‌ స్టార్టింగ్‌ నుంచి 45 నిముషాల పాటు కథలో ఎలాంటి కదలిక లేకుండా వుంటుంది. చివరి 15 నిముషాలు జె.పి. ఇచ్చే ట్విస్ట్‌తో కథ మంచి టర్న్‌ తీసుకుంటోందనిపిస్తుంది. సెకండాఫ్‌కి వచ్చే సరికి కోట్ల స్కామ్‌లో హీరోయిన్‌ని కూడా ఇన్‌వాల్వ్‌ చేసి ఆమెతో మిగతా క్యారెక్టర్లను భయపెట్టి, అవన్నీ లాజిక్‌ ప్రకారమే జరిగాయని రివీల్‌ చేస్తూ కథ నడిపించాడు. చివరికి ఒక సాదా సీదా క్లైమాక్స్‌తో సినిమాని ఎండ్‌ చేసి దీంతో లెక్క కరెక్ట్‌ సరిపోయిందనుకున్నాడు డైరెక్టర్‌. ఫైనల్‌గా చెప్పాలంటే కాన్సెప్ట్‌ కొత్తదే అయినా దాన్ని ఎగ్జిక్యూట్‌ చెయ్యడంలో, ఆడియన్స్‌ కట్టి పడేసే కథ రాసుకోవడంలో డైరెక్టర్‌ ఫెయిల్‌ అయ్యాడు. అందుకే ఇలాంటి నాసిరకం సినిమా మన ముందుకు వచ్చింది. 

ఫినిషింగ్‌ టచ్‌: ఈ సినిమాలో చాలా తిక్కుంది 

సినీజోష్‌ రేటింగ్‌: 2/5

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement