Advertisement

జోష్ స్పెషల్: పూరి ఆన్సర్స్ ఇవిగో 2!

Sun 27th Dec 2015 05:02 PM
puri jagannadh,director puri jagannadh interview,puri jagannadh director,puri jagan,prabhu pen counter,prabhu pen counter with puri jagannadh,loafer movie director,chiranjeevi,dasari narayana rao  జోష్ స్పెషల్: పూరి ఆన్సర్స్ ఇవిగో 2!
జోష్ స్పెషల్: పూరి ఆన్సర్స్ ఇవిగో 2!
Advertisement

సంఖ్యాపరంగా..సక్సెస్‌పరంగా..టాలీవుడ్‌ దర్శకులలో టాప్‌ లైన్‌లో దర్శనమిచ్చే పూరి జగన్నాధ్‌ తన ఆలోచనలు, అభిప్రాయాల విషయంలో మాత్రం మిగతావారికంటే చాలా భిన్నంగా అనిపిస్తాడు..కనిపిస్తాడు. తాను వలచిందే రంభ, తను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు వంటి మొండి వాదన చేయడు కానీ.. అతని మాటలు, రాతలు, చేతలు ట్రెడిషనల్‌ ట్రెండ్‌కి భిన్నంగా ఉంటాయి. బేసికల్‌గా రైటర్‌ కమ్‌ డైరెక్టర్‌ అయిన పూరి డైలాగుల్లో నిగూఢార్ధాలు, గొప్ప పద ప్రయోగాలు కనిపించవు. కానీ సూటిగా, సుత్తిలేకుండా మంచి పవర్‌ఫుల్‌ పంచ్‌లు రాస్తాడు, తీస్తాడు. అతని మాటల్లో నీతులు కనిపించవు..కానీ నిజాలు గర్జిస్తాయి. అతని టైటిల్స్‌, డైలాగులు, తన హీరోల బాడీ లాంగ్వేజ్‌, కేర్‌లెస్‌ యాటిట్యూడ్‌ల ప్రభావం యూత్‌ మీద బాగానే పనిచేస్తుంది. 

మీ పాత్రలు, డైలాగులు, వాటి బాడీ లాంగ్వేజ్‌ యూత్‌ని చెడగొడుతున్నాయనే విమర్శలు వినిపిస్తుంటాయ్‌..ఈ విమర్శలకు మీ సమాధానం ఏమిటి అని అడిగితే..నేను చెడగొట్టలేనంతగా చెడిపోయారు ఈ జనం..నేను వాళ్ళని కొత్తగా చెడగొట్టేదేమిటి.. అంటూ ఎదురొస్తాడు పూరి. ఇంతకి ఎవరు ఎవర్ని చెడగొడుతున్నారన్నది ప్రక్కన పెడితే..పూరీ ప్రభావం మాత్రం..మన యూత్‌మీద చాలానే ఉంది. 

సినిమాలు, పాత్రల విషయంలోనే కాదు..వ్యక్తిగతంగా కూడా పూరిలో ఒక విలక్షణ వ్యక్తిత్వం గోచరిస్తుంది. మ్యాన్ ఈజ్ బోర్న్ ఫ్రీ.. బట్ ఈజ్ ఎవ్రీవేర్ హీజ్ ఇన్ చైన్స్.. అంటారు. పూరి ప్రతి కదిలికలోనూ..ఆ ఛైన్స్‌ తెంచుకోవాలనే స్వేచ్ఛా ప్రియత్వం కనిపిస్తుంది. జనజీవన స్రవంతిలో ఉంటూనే జనాభిప్రాయానికి దూరంగా జరిగే డిటాచ్‌డ్‌ థింకింగ్‌ వైపు సాగుతుంటాయి పూరి ఆలోచనలు. ఇట్లు శ్రావణి సుబ్రహ్మాణ్యం నాటి పూరి ఇప్పుడు లేడు. అందాలు-ఆనందాలు, అనుభవాలు-అనుభూతులు, అన్యాయాలు-అబద్ధాలు, విజయాలు-అపజయాలు, డిప్లమసీ-హిపోక్రసీల మధ్య నలిగి, కలగి, దొర్లి పొర్లిన..రాటుదేలిన తనంతో పాటు వీటికి దూరంగా పారిపోవాలని, ఏదో తెలియని ఆవలి తీరానికి చేరుకోవాలి అనే ప్రయత్నమూ కనిపిస్తుంటుంది పూరిలో. ఇలా ఎటాచ్‌డ్‌ ప్లస్‌ డిటాచ్‌డ్‌ క్యారక్లరైజేషన్‌తో తనకంటూ ఓ ప్రత్యేకమైన ప్లేస్‌మెంట్‌ను సాధించుకున్న పూరినీ...ఓ ఇంటర్య్వూ కావాలని అడిగింది సినీజోష్‌

దానికి సారీ భయ్యా.., లోఫర్‌ ప్రమోషన్ బిజీలో ఉన్నాను. ఇప్పుడు టైమ్‌ లేదు..ఏం అనుకోకుండా...క్వశ్చన్స్‌ రాసి ఆఫీస్‌లో ఇస్తే.. రాత్రికి ఆన్సర్స్‌ రాసి పంపిస్తానంటూ.. హడావుడిగా కారెక్కాడు పూరి. ఫేస్‌ టు ఫేస్‌ కాకుండా..ఇలా ఇంటర్య్వూ చేయడం కూడా ఓ వెరైటీయే. అందుకే తన ప్రశ్నలను నీటుగా కంపోజ్‌ చేసి..పూరి ఆఫీస్‌లో అందించింది సినీజోష్‌. మరుసటి రోజు ఉదయానికల్లా పూరి నుండి వచ్చిన సమాధానాలు ఇవి..!! గో త్రూ అండ్ ఎంజాయ్..!! 

                                                                                              Interviewed by Prabhu

>పూరి Answers Part 1- Click Here

>పూరి Answers Part 2
21. రాజకీయాల్లోకి వెళ్లక ముందు చిరంజీవిగారు చేసిన శంకర్‌దాదా ఎంబిబిఎస్‌, శంకర్‌దాదా జిందాబాద్‌, ఠాగూర్‌, స్టాలిన్‌ చిత్రాలు మెసేజ్‌ ఓరియంటెడ్‌గా సాగాయి. ఆయన చిరుకాల రాజకీయ ప్రస్థానం తర్వాత ఇప్పుడు ఆయన మీద ఏ కథాంశాన్ని తీసుకున్నా అందులో సందేశాలుండడం అవసరం. మరి మీకేమో సినిమాల ద్వారా సందేశాలవ్వడం అంటేనే చిరాకు. మరి మెసేజ్‌లు ఇవ్వాలనుకునే హీరోకు వద్దనుకునే దర్శకుడికి మధ్య పొంతన ఎలా కుదురుతుంది?
పూరి: అక్కడే పొంతన కుదరట్లేదు.. మెగాస్టార్ కి కావాల్సిన మెసేజ్ ఉంటూ, నేను కోరుకునే కమర్షియల్ సినిమా చేయడం కోసం ట్రై చేస్తున్నాను.
22. బ్రూస్‌లీ యే చిరంజీవిగారి 150వ సినిమా అని మీ గురువు రాంగోపాల్‌వర్మ కుండబద్దలు కొట్టారు. 150వ సినిమా అనే ప్రెస్టీజియస్‌ నెంబర్‌ మిస్‌ అయ్యాక కూడా మీరు చిరంజీవిగారితో సినిమా చేయాలనుకోవడానికి కారణం ఏమిటి? 
పూరి:  సినిమా నెంబర్ నాకెందుకు.. నాకు మెగాస్టార్ కావాలి.
23. లోఫర్‌ లో వరుణ్‌తేజ్‌ పర్ఫామెన్స్‌తో పాటు సెట్స్‌మీద తన బిహేవియర్‌ను కూడా మీరు చాలా మెచ్చుకున్నారు. మీ దృష్టిలో హీరో బిహేవియర్‌ అంటే దర్శకుడికి అనుకూలంగా ఉంటూ దేంట్లోనూ ఇంటర్‌ఫియర్‌ అవ్వకుండా ఉండటమా? ఈ కోణంలో యాజ్‌ ఏ డైరెక్టర్‌ గా మీరు బాగా కంఫర్ట్‌బుల్‌గా ఫీలైన హీరో ఎవరు? 
పూరి: ఒక దర్శకుడ్ని, ఒక కథని నమ్మిన తర్వాత హీరో మిగతా విషయాలు పట్టించుకోకూడదు.. నేను అన్నీ దగ్గర ఉండి చూసుకోవాలన్న యాటిట్యూడ్ హీరోల్లో ఉంటే.. అతడు ఆ సినిమా చేయకపోవడం బెటర్.. దీనికి ఆదర్శం అమితాబ్ బచ్చన్ గారే.
24. ఇక వీడి పని అయిపోయింది అనుకునే టైమ్‌కు ఎవరైనా ఆర్ధికంగా బ్రహ్మాండంగా సెటిల్‌ అయి ఉంటారు. కానీ డైరెక్టర్‌గా ఫుల్‌ ఫామ్‌లో ఉండగానే మీరు ఆర్ధికంగా చావుదెబ్బ తిన్నారు. ఆల్‌మోస్ట్‌ ఆల్‌ రోడ్డున పడే పరిస్ధితికి వెళ్లారు. మరలా సంవత్సరం తిరక్కుండానే పోయింది మొత్తం సంపాదించుకున్నారు. సినిమా వాళ్లలో ఇంకెవరికీ లేదు అనేంత గొప్పగా ఆఫీసు కట్టుకున్నారు. ఫైనాన్షియల్‌గా బాగా సౌండ్‌ అయ్యారు. ఎలా? అప్పటి మీ మానసిక స్ధితి ఏంటి?
పూరి: సాంతం సంకనాకిపోవడం ఇట్స్ ఏ వండర్ఫుల్ ఆపర్చ్యునిటి ఇన్ లైఫ్. ఆలాంటి అధ్బుతమైన అవకాశం నాకు వచ్చింది.. ప్రపంచం అర్ధం అయింది. లైఫ్ ఈజ్ వార్.. ఐ యాం ఇన్ ఏ వార్ జోన్ అని తెలుసుకున్నాను.. మళ్ళీ వార్ మొదలుపెట్టా విన్ అయ్యా అంతే. ఎందుకంటే ఫెయిల్యూర్ వలన స్ట్రాంగ్ అవుతాం.. ఎంత ఫెయిల్యూర్ ఉంటే అంత స్ట్రాంగ్ అవుతాం.. ఆ బలమే మనకు రింగ్ లో ఉపయోగపడుతుంది.
25. మీరు ఇడియట్‌, పోకిరి అనే తిట్లను టైటిల్స్‌గా పెట్టి ఆడుతూ పాడుతూ సినిమాలు తీస్తే అవి హిట్‌ అయ్యాయి. 143, నేనింతే అనే టైటిల్స్‌తో మంచి ఎమోషనల్‌ సబ్జెక్ట్స్‌తో, ఒక కమిట్‌మెంట్‌తో తీసిన సినిమాలు ఫ్లాప్‌ అయ్యాయి. దీనికి మీరిచ్చే ఇంటర్‌ప్రటేషన్‌ ఏమిటి? 
పూరి: నాకో విషయం అర్ధం అయింది. జనానికి కావాల్సింది మంచి సినిమా కాదు, జనానికి నచ్చే సినిమా.. అందుకే ఎక్కువ మందికి నచ్చే సినిమాలు ట్రై చేస్తున్నాను.
26. తెలుగు సినిమా ఇండస్ట్రీలో మీరు ఒక టాప్‌ డైరెక్టర్‌. మీతోపాటు రాజమౌళి, త్రివిక్రమ్‌, వినాయక్‌, శ్రీను వైట్ల, గుణశేఖర్‌, క్రిష్‌లాంటి మంచి పేరున్న దర్శకులు చాలామంది ఉన్నారు. కానీ ఇండస్ట్రీ సవాలక్ష సమస్యలతో సతమతమవుతుంటే మీరెవరూ పట్టించుకోరెందుకు? ఎప్పుడు, ఎక్కడా, ఏ సమస్యలోనూ మీ వాయిస్‌ వినిపించదెందుకు? ఇండస్ట్రీ సమస్యల పట్ల మీకెవరికీ బాధ్యత లేదా? 
పూరి: ఇండస్ట్రీలో ఏ సమస్య వచ్చిన చూసుకోవడానికి మా ముఠామేస్త్రి దాసరి నారాయణరావు గారు ఉండగా మాకు ఎందుకు చింత.
27. వరుణ్ తేజ్ పెర్ఫార్మన్స్, రేవతి అమ్మ సెంటిమెంట్, పోసాని లోఫరిజం.. ఇలా రిలీజ్ కు ముందు మీరు చెప్పిన ఎలిమెంట్స్ అన్నీ బాగా ఉన్నాయి. బాగున్నాయి. ఒక్క మరో ఇలియానా అన్న స్టేట్మెంట్ తప్ప. హీరోయిన్ సెలక్షన్ విషయంలో ఎప్పుడు గురి తప్పని మీరు ఈ సారి ఎందుకిలా?
పూరి: దిశా పటాని మీకు నచ్చలేదేమో.. నాకు అయితే నచ్చింది. అందుకే సినిమాలో పెట్టా.. ఇంకో సినిమా కోసం అడిగితే ఆ అమ్మాయి డేట్ లు దొరకలేదు.. అందుకే ఇలియానా అవుతుందని చెప్పా.
28. లోఫర్ చూసాక అనిపించింది.. మంచి సినిమాలు తీసి రాంగ్ టైటిల్స్ పెట్టడంలో మీకు మీరే సాటి అని.. అప్పుడు ఇడియట్, పోకిరి, ఇప్పుడు లోఫర్ తో నిరూపించుకున్నారు. ఆ సినిమాల సక్సెస్ కు కారణం మీ కథ. ట్రీట్ మెంటే తప్ప మీ మిస్ గైడింగ్ టైటిల్స్ కాదు. ఎందుకిలాంటి టైటిల్స్ పెట్టి జనాన్ని మీరే చెడగొడుతున్నారనే అపవాదు మోయడం?
పూరి: వాళ్ళని చెడగొట్టడానికి నేనెవర్ని.. నా కంటే జనం చెడిపోయారని నా ఫీలింగ్.
29. ఏ జూనియర్ ను.. ఏ సీనియర్ నూ ఓన్ చేసుకోనంతగా దాసరి నారాయణరావు గారు మిమ్మల్ని ఓన్ చేసుకున్నారు. ఏకంగా మిమ్మల్ని తన వారసుడు అని ప్రకటించారు.. ఎందుకు ఆ పెద్దాయనకు మీరంటే అంత లవ్వు.. ఇంతకీ ఆ వారసత్వాన్ని స్వీకరించారా..?
పూరి: దాసరి నారాయణరావు గారి పేరు చిన్నప్పుడు మేఘాలలో చూశా. దర్శకుల స్థాయిని పెంచింది ఆయన, ఈరోజు మేము తీసుకునే రెమ్యునరేషన్స్ కి కారణం దాసరి నారాయణరావు గారు. అలాంటి మనిషి నన్ను తన వారసుడని ప్రకటించినప్పుడు ఉబ్బితబ్బిబ్బు అయిపోయాను.. కళ్ళంబడి నీళ్ళు వచ్చాయి. నేనే కాదు.. ఆయనకీ పని చేసేవాడంటే ఇష్టం, కష్టపడేవాడంటే ఇష్టం, ఆత్మాభిమానంతో ధైర్యంగా బ్రతికేవారు అంటే ఇష్టం. మా దర్శకులందరికి ధైర్యాన్ని ఇచ్చింది దాసరి నారాయణరావుగారు. ఆయనకీ చేతులు ఎత్తి మొక్కుతున్నాను.   
30. టెంపర్ లో హే భగవాన్ సాంగ్ లో ప్రతి మనిషికి అప్లై అయ్యే గొప్ప ఫిలాసఫీ ఉంది. దేవుడు ప్రత్యక్షమై మీ జీవితాన్ని మీకు తిరిగి ఇస్తానంటే ఎక్కడి నుంచి రిపీట్ అడుగుతారు..?
పూరి: అలాంటి ఫెసిలిటీ కాని వుంటే.. నేను అడిగింది దేవుడు ఇస్తే.. మళ్ళీ మనిషిగా పుట్టను.
31. రీల్ లైఫ్ లో రెండు సార్లు అమ్మ సెంటిమెంట్ మీద హిట్ కొట్టారు.. మరి రియల్ లైఫ్ లో మీ అమ్మ సెంటిమెంట్ గురించి చెప్పండి..?
పూరి: .అమ్మ నుండి చాలా నేర్చుకున్నాను. కష్టపడి పని చేయడం, ఖాళీగా ఉండకపోవడం, ఎంత కష్టం వచ్చిన ఏడవకుండా నిలబడడం.. మా అమ్మ నాకు గురువు.
32. సంఖ్య విషయంలో కానీ.. సబ్జెక్ట్స్ విషయంలో కానీ.. మీకు ఏమైనా టార్గెట్స్ ఉన్నాయా..?
పూరి: .అలాంటివి ఏం లేవు .. ఎప్పుడు ఏం అనిపిస్తే అది చేయడం.. వీలైనంత ఎక్కువ చేయడం.
33. చివరిగా...ఈ జనరేషన్ దర్శకులలో సక్సెస్ పరంగా కాకుండా, సంఖ్య పరంగా కూడా మీరే టాప్. పెనం మీద దోస వేసినంత ఈజీగా భారీ సినిమాలు తీసి పడేస్తుంటారు. స్పీడ్ మేకర్ అనే కాంప్లిమెంట్ కొట్టేయడానికి మీకు దోహదపడిన మీ క్వాలిఫికేషన్స్ ఏంటి..?
పూరి: నాకు ఉన్న ఒకే ఒక్క క్వాలిఫికేషన్ డెసిషన్ మేకింగ్.. మంచో, చెడో వెంటనే నిర్ణయం తీసుకుంటా...!
Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement