Advertisement

సినీజోష్‌ రివ్యూ: బెంగాల్‌ టైగర్‌

Fri 11th Dec 2015 02:35 PM
telugu movie bengal tiger,raviteja new movie bengal tiger,bengal tiger cinejosh review,bengal tiger movie review,tamanna and rashi khanna in bengal tiger,bengal tiger director sampath nandi  సినీజోష్‌ రివ్యూ: బెంగాల్‌ టైగర్‌
సినీజోష్‌ రివ్యూ: బెంగాల్‌ టైగర్‌
Advertisement

శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ 

బెంగాల్‌ టైగర్‌ 

తారాగణం: రవితేజ, తమన్నా, రాశి ఖన్నా, 

బొమన్‌ ఇరాని, పృథ్వీ, బ్రహ్మానందం, షాయాజీ షిండే, 

రావు రమేష్‌, పోసాని, తనికెళ్ళ భరణి తదితరులు 

సినిమాటోగ్రఫీ: సౌందరరాజన్‌ 

ఎడిటింగ్‌: గౌతంరాజు 

సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో 

సమర్పణ: లక్ష్మీ రాధామోహన్‌ 

నిర్మాత: కె.కె.రాధామోహన్‌ 

రచన, దర్శకత్వం: సంపత్‌ నంది 

విడుదల తేదీ: 10.12.2015 

తెలుగు సినిమా ఎంటర్‌టైన్‌మెంట్‌కి ఒక కొత్త దారిని వేసింది రవితేజ మార్క్‌ కామెడీ. రవితేజ అంటేనే కామెడీకి కేరాఫ్‌ అడ్రస్‌గా చెప్పుకోవచ్చు. దానికి తగ్గట్టుగానే అతనితో సినిమాలు చేసిన డైరెక్టర్లు కూడా యాక్షన్‌తోపాటు ఎంటర్‌టైన్‌మెంట్‌కి ఎక్కువ ప్రిఫరెన్స్‌ ఇస్తూ సూపర్‌హిట్‌ సినిమాలు తీశారు. అయితే ఈమధ్యకాలంలో రవితేజ మార్క్‌ కామెడీని ఎఫెక్టివ్‌గా ప్రజెంట్‌ చెయ్యడంలో డైరెక్టర్లు ఫెయిల్‌ అవుతున్నారో, అతని కామెడీని ఆడియన్స్‌ మొనాటనీ ఫీల్‌ అవుతున్నారో తెలీదు గానీ రవితేజకు రీసెంట్‌గా హిట్స్‌ అనేవి లేవు. అయితే మరోసారి రవితేజ కామెడీకి యాక్షన్‌ని కూడా మిక్స్‌ చేసి బెంగాల్‌ టైగర్‌ అనే మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ని తెరకెక్కించాడు డైరెక్టర్‌ సంపత్‌ నంది. ఏమైంది ఈవేళ, రచ్చ వంటి సూపర్‌హిట్‌ చిత్రాలను రూపొందించి డైరెక్టర్‌గా తనకంటూ ఓ స్పెషాలిటీని క్రియేట్‌ చేసుకున్న సంపత్‌ నంది బెంగాల్‌ టైగర్‌ చిత్రాన్ని రవితేజ మార్క్‌ సినిమాగా రూపొందించడానికి తన శాయశక్తులా కృషి చేశాడు. అతని ప్రయత్నానికి కె.కె.రాధామోహన్‌ వంటి అన్‌కాంప్రమైజ్డ్‌ ప్రొడ్యూసర్‌ కూడా తోడవడంతో ఒక రిచ్‌ ప్రొడక్ట్‌గా బెంగాల్‌ టైగర్‌ రూపొందింది. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆడియన్స్‌ని ఎంతవరకు ఎంటర్‌టైన్‌ చేసింది? ఈమధ్యకాలంలో సరైన హిట్‌ లేని రవితేజకు బెంగాల్‌ టైగర్‌ ఎలాంటి రిజల్ట్‌నిచ్చింది? రవితేజ నుంచి ప్రేక్షకులు ఆశించే ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందించడంలో సంపత్‌ నంది ఎంతవరకు సక్సెస్‌ అయ్యాడు? నిర్మాత రాధామోహన్‌కి ఈ సినిమా కమర్షియల్‌గా ఎంతవరకు వర్కవుట్‌ అవుతుంది? అనే విషయాలు సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. 

రవితేజ ఇప్పటివరకు చేసిన సినిమాల్లో ఎక్కువ శాతం అతని క్యారెక్టరైజేషన్‌ యారగెంట్‌గా, కాస్త వెటకారంగా, మరికాస్త మిస్టీరియస్‌గా వుండడం మనం చూశాం. కిక్‌, డాన్‌శీను వంటి సినిమాలు దానికి ఉదాహరణ. ఈ సినిమా విషయానికి వస్తే ఆ రెండు సినిమాల్లో అతని క్యారెక్టరైజేషన్‌ ఎలా వుంటుందో ఈ సినిమాలో కూడా అలాంటి క్యారెక్టర్‌ని క్రియేట్‌ చేశాడు సంపత్‌ నంది. కంప్యూటర్‌ సైన్స్‌ చేసినా ఆవారాగా ఫ్రెండ్స్‌తో తిరిగే ఆకాష్‌ నారాయణ్‌(రవితేజ)కి పెళ్ళి చెయ్యాలని అతని ఫ్యామిలీ మెంబర్స్‌ భావిస్తారు. అనుకున్నదే తడవుగా పెళ్ళిచూపులకు వెళ్తారు. అయితే అక్కడ పెళ్ళికూతురు మన హీరోకి ఒక షాక్‌ ఇస్తుంది. తను పెళ్ళి చేసుకోబోయేవాడు సెలబ్రిటీ అయి వుండాలని, అతని ఆటోగ్రాఫ్‌ల కోసం అందరూ ఎగబడాలని, అలాంటి వాడిని పెళ్ళిచేసుకుంటానని చెప్తుంది. ఆ మాటలు విన్న ఆకాష్‌ వెంటనే ఫేమస్‌ అయిపోవాలని డిసైడ్‌ అవుతాడు. అగ్రికల్చరల్‌ మినిస్టర్‌ షాయాజీ షిండే ఒక పబ్లిక్‌ మీటింగ్‌లో మాట్లాడుతూ వుండగా అతన్ని రాయితో కొట్టి వార్తల్లోకి ఎక్కుతాడు. ఆ వెంటనే తన చాకచక్యంతో అతని దగ్గర ఉద్యోగంలో చేరతాడు. మినిస్టర్‌కి సంబంధించిన కొన్ని సెటిల్‌మెంట్స్‌ చాలా ఈజీగా చేసేసి అతని దగ్గర మంచి మార్కులు కొట్టేస్తాడు. ఇది చూసిన హోం మినిస్టర్‌ నాగప్ప(రావు రమేష్‌) ఆకాష్‌ని పిలిపించుకొని తన కూతురు శ్రద్ధ(రాశి ఖన్నా)కి సెక్యూరిటీగా అప్పాయింట్‌ చేస్తాడు. ఆకాష్‌ హీరోయిజాన్ని చూసిన శ్రద్ధ అతని ప్రేమలో పడుతుంది. శ్రద్ధ బర్త్‌డే పార్టీలో ఆకాష్‌కి తన కూతుర్ని ఇచ్చి పెళ్ళి చేయబోతున్నానని ఎనౌన్స్‌ చేస్తాడు నాగప్ప. కానీ, దాన్ని ఆకాష్‌ యాక్సెప్ట్‌ చెయ్యడు. అదే ఫంక్షన్‌కి వచ్చిన ముఖ్యమంత్రి కూతురు మీరా(తమన్నా)ను తను లవ్‌ చేస్తున్నట్టు చెప్తాడు. దానికి సి.ఎం.తో సహా అందరూ షాక్‌ అవుతారు. శ్రద్ధని పెళ్ళి చేసుకోవడానికి ఆకాష్‌ ఎందుకు ఒప్పుకోలేదు? సి.ఎం. కూతుర్ని లవ్‌ చేస్తున్నానని చెప్పడం వెనుక రీజన్‌ ఏమిటి? సొసైటీలో ఫేమస్‌ అయిపోవడంలో భాగంగానే సి.ఎం. కూతుర్ని లవ్‌ చేస్తున్నానని చెప్పాడా? ఆకాష్‌ని ప్రేమిస్తున్న శ్రద్ధ దానికి ఎలా రియాక్ట్‌ అయింది? చివరికి కథ ఎన్ని మలుపులు తిరిగింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. 

ఆకాష్‌ నారాయణ్‌గా రవితేజ పెర్‌ఫార్మెన్స్‌ బాగుంది. డైలాగ్‌ డెలివరీలో, యాక్షన్‌ సీక్వెన్స్‌లలో, డాన్సుల్లో, కామెడీ టైమింగ్‌లో మునుపటి స్పీడ్‌ రవితేజలో కనిపించాయి. హీరోయిన్లుగా రాశిఖన్నా, తమన్నా నటనతోపాటు తమ అందచందాలను కూడా వీలైనంత ఎక్కువగా ప్రదర్శించడం వల్ల సినిమాకి మంచి గ్లామర్‌ వచ్చింది. సి.ఎం.గా బొమన్‌ ఇరాని పెర్‌పార్మెన్స్‌ చాలా సెటిల్డ్‌గా వుంది. హోమ్‌ మినిస్టర్‌ నాగప్పగా రావు రమేష్‌ ఓకే అనిపించాడు. అతనికి రెగ్యులర్‌గా పెట్టే కోనసీమ స్లాంగ్‌ కాకుండా రాయలసీమ స్లాంగ్‌తో ఈ సినిమాలో డైలాగ్స్‌ చెప్పాడు. ఆ డైలాగ్స్‌ అతనికి అంత బాగా నప్పలేదని చెప్పాలి. ఇక షాయాజీ షిండే, తనికెళ్ళ భరణి, షకలక శంకర్‌, సత్యం రాజేష్‌, బ్రహ్మానందం తమ తమ క్యారెక్టర్లను ఫర్వాలేదనిపించేలా చేశారు. ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పృథ్వీ గురించి. మరోసారి తన మార్క్‌ కామెడీతో ఆడిటోరియమ్‌ని నవ్వుల్తో ముంచెత్తాడు. అతను చేసిన ప్రతి సీన్‌నీ ఆడియన్స్‌ బాగా ఎంజాయ్‌ చేస్తారు. 

పక్కా మాస్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాకి సౌందరరాజన్‌ ఫోటోగ్రఫీ చాలా ప్లస్‌ అయింది. ప్రతి సీన్‌ని రిచ్‌గా చూపించడంలో సౌందరరాజన్‌ సక్సెస్‌ అయ్యాడు. ముఖ్యంగా పాటల్ని చాలా కలర్‌ఫుల్‌గా పిక్చరైజ్‌ చేశాడు. మ్యూజిక్‌ విషయానికి వస్తే భీమ్స్‌ చేసిన పాటల్లో మూడు పాటలు బాగున్నాయి. చాలా సందర్భాల్లో రీరికార్డింగ్‌ సినిమాకి హైప్‌ తీసుకొచ్చింది. గౌతంరాజుకి సెకండాఫ్‌లో ఎక్కువ పని చెప్తే కాస్త రన్‌ టైమ్‌ తగ్గి సినిమా స్పీడ్‌ అయి వుండేది. డైరెక్టర్‌ సంపత్‌నంది విషయానికి వస్తే రవితేజకు ఎలాంటి కథ అయితే బాగుంటుందో అలాంటి కథని సెలక్ట్‌ చేసుకోవడంలో, రవితేజ క్యారెక్టరైజేషన్‌ని అతని ఇమేజ్‌కి తగ్గట్టు డిజైన్‌ చెయ్యడంలో, ఈ సినిమాని రవితేజ మార్క్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందించడంలో చాలా వరకు సక్సెస్‌ అయ్యాడు. ఫస్ట్‌ హాఫ్‌ని కామెడీతో రన్‌ చేసి ఒక ట్విస్ట్‌తో ఫస్ట్‌హాఫ్‌ని ఎండ్‌ చేసి సెకండాఫ్‌లో కథ మీదే సినిమా మొత్తాన్ని తీసుకెళ్ళాలనుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. సెకండాఫ్‌లో ఎంటర్‌టైన్‌మెంట్‌ చాలా తగ్గిపోవడం, సీరియస్‌గా సినిమా రన్‌ అవడం, ఆ ప్రాసెస్‌లో కొన్ని అనవసరమైన సీన్స్‌ వల్ల ల్యాగ్‌ రావడంతో సినిమా స్లో అయిపోయింది. ఫస్ట్‌ హాఫ్‌లో పెట్టిన శ్రద్ధ సెకండాఫ్‌లో కూడా పెట్టి వుంటే సినిమా రేంజ్‌ మరింత పెరిగేది. పృథ్వి కామెడీని సెకండాఫ్‌లో కూడా కంటిన్యూ చేసి వుంటే ఆడియన్స్‌ బోర్‌ ఫీల్‌ అయ్యేవారు కాదు. ఈ సినిమాకి సంపత్‌ రాసిన మాటలు కూడా చాలా బాగున్నాయి. అక్కడక్కడా ప్రాస కోసం ప్రాకులాడినట్టుగా అనిపించినా డైలాగులు కొత్తగా వున్నాయి. టోటల్‌గా ప్రతి ఆర్టిస్టు నుంచి తనకు కావాల్సిన ఔట్‌పుట్‌ని తీసుకోవడంలో సంపత్‌ నంది హండ్రెడ్‌ పర్సెంట్‌ సక్సెస్‌ అయ్యాడు. ఇక నిర్మాత రాధామోహన్‌ సినిమాని లావిష్‌ తియ్యడంలో ఎక్కడా కాంప్రమైజ్‌ అవ్వలేదని సినిమా చూస్తే అర్థమవుతుంది. 

కమర్షియల్‌ ఫార్ములాతో రూపొందిన సినిమాలో కథ ఎలా వుందనేది పాయింట్‌ కాదు. ప్రేక్షకులు ఎంజాయ్‌ చేసే కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఎంత పాళ్ళలో వున్నాయి, వాటిని ఆడియన్స్‌కి కనెక్ట్‌ అయ్యేలా డైరెక్టర్‌ చెయ్యగలిగాడు అనేది ముఖ్యం. ఆడియన్స్‌ సినిమాని ఎంజాయ్‌ చేస్తున్నారంటే ఆ కథలో లాజిక్‌ వుందా? సహజత్వానికి దగ్గరగా కథగానీ, సీన్స్‌గానీ వున్నాయా? అనేది పట్టించుకోరు. రవితేజ సినిమా అంటే ఎంటర్‌టైన్‌మెంట్‌ వుండాలని ప్రతి ఆడియన్‌ కోరుకుంటాడు. బెంగాల్‌ టైగర్‌ ఈ విషయంలో ఆడియన్స్‌ని డిజప్పాయింట్‌ చెయ్యదు. సినిమా స్టార్టింగ్‌లోనే ఫైట్‌తోపాటే ఎంటర్‌టైన్‌మెంట్‌ కూడా స్టార్ట్‌ అవుతుంది. ఆ తర్వాత హీరో ఫేమస్‌ అవ్వడం కోసం ప్లే చేసే ట్రిక్కులు, మధ్యలో ఫ్యూచర్‌స్టార్‌గా పృథ్వి, సెలబ్రిటీ శాస్త్రిగా పోసాని కృష్ణమురళి కామెడీ ఆడియన్స్‌ని విపరీతం ఆకట్టుకుంటుంది. ఫస్ట్‌ హాఫ్‌ అంతా ఎలాంటి బ్రేకులు లేకుండా స్పీడ్‌గా వెళ్ళిపోతుంది. సెకండాఫ్‌కి వచ్చే సరికి ఎంటర్‌టైన్‌మెంట్‌ లోపించడం, కథలో ల్యాగ్‌ ఎక్కువగా వుండడం, నెక్స్‌ట్‌ సీన్‌లో ఏం జరుగుతుందో ఆడియన్స్‌ ఊహించేలా వుండడంతో ఒక్కసారిగా స్పీడ్‌ తగ్గినట్టుగా అనిపిస్తుంది. అయితే రాశి ఖన్నా, తమన్నాల గ్లామర్‌ సెకండాఫ్‌లో కొంత హెల్ప్‌ అయిందని చెప్పాలి. ఫైనల్‌గా చెప్పాలంటే బెంగాల్‌ టైగర్‌ రవితేజ మార్క్‌ ఎంటర్‌టైనర్‌గా ఆడియన్స్‌ని ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా బి, సి సెంటర్స్‌ ఆడియన్స్‌కి ఈ సినిమా బాగా నచ్చే అవకాశం వుంది. కమర్షియల్‌గా కూడా ఈ సినిమా వర్కవుట్‌ అయ్యే అవకాశాలు ఎక్కువగా వున్నాయి. 

ఫినిషింగ్‌ టచ్‌: పక్కా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ 

సినీ:జోష్‌ రేటింగ్‌: 3.25/5

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement