Advertisement

సినీజోష్‌ రివ్యూ: రుద్రమదేవి

Fri 09th Oct 2015 08:51 AM
telugu movie rudrama devi,rudrama devi movie review,rudrama devi cinejosh review,anushka new movie rudrama devi,gunasekhar new movie rudrama devi  సినీజోష్‌ రివ్యూ: రుద్రమదేవి
సినీజోష్‌ రివ్యూ: రుద్రమదేవి
Advertisement

గుణా టీమ్‌ వర్క్స్‌ 

రుద్రమదేవి 

తారాగణం: అనుష్క, రానా, అల్లు అర్జున్‌, కృష్ణంరాజు, 

ప్రకాష్‌రాజ్‌, నిత్యామీనన్‌, కేథరిన్‌ త్రిస, సుమన్‌, 

హంసానందిని, ఆదిత్య మీనన్‌, బాబా సెహగల్‌లతోపాటు 

లెక్కకు మించిన నటీనటులు 

సంగీతం: ఇళయరాజా 

పాటలు: సీతారామశాస్త్రి 

సినిమాటోగ్రఫీ: అజయ్‌ విన్సెంట్‌ 

ఎడిటింగ్‌: ఎ.శ్రీకరప్రసాద్‌ 

ఆర్ట్‌: తోట తరణి 

కాస్ట్యూమ్స్‌: నీతా లుల్లా 

మాటలు: పరుచూరి బ్రదర్స్‌ 

సమర్పణ: రాగిణి గుణ 

రచన, నిర్మాత, దర్శకత్వం: గుణశేఖర్‌ 

విడుదల తేదీ: 09.10.2015 

కాకతీయ సామ్రాజ్యాన్ని 1261 నుండి 1289 వరకు పాలించి కాకతీయ వంశానికి పేరు ప్రఖ్యాతులు తెచ్చిన వీరనారి రాణి రుద్రమదేవి చరిత్రను తెరకెక్కించే ఒక మహా యజ్ఞాన్ని మూడు సంవత్సరాల క్రితం చేపట్టాడు దర్శకుడు గుణశేఖర్‌. స్టీరియో స్కోపిక్‌ 3డి అనే అధునాతన టెక్నాలజీతో భారీ వ్యయంతో ఈ చిత్రం తెరకెక్కింది. రుద్రమదేవిగా అగ్ర కథానాయిక అనుష్క నటించింది. చాళుక్య వీరభద్రుడిగా రానా, గోన గన్నారెడ్డిగా అల్లు అర్జున్‌ నటించారు. రుద్రమదేవి చరిత్రను తెరకెక్కించాలన్న సాహసోపేత నిర్ణయం తీసుకున్న గుణశేఖర్‌ ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఎన్నో అడ్డంకులను అధిగమించి అక్టోబర్‌ 9న రుద్రమదేవి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాకతీయ సామ్రాజ్యాన్ని పాలించిన మహిళ అందరికీ ఆదర్శంగా నిలిచిన రుద్రమదేవి చరిత్రను తెరకెక్కించడంలో గుణశేఖర్‌ ఎంతవరకు విజయం సాధించాడు? రుద్రమదేవిగా నటించిన అనుష్క ఆ క్యారెక్టర్‌కు ఎంతవరకు న్యాయం చెయ్యగలిగింది? చాళుక్య వీరభద్రుడిగా తన నటనను ప్రదర్శించేందుకు రానాకు ఎంతవరకు వీలు కలిగింది? గోన గన్నారెడ్డి అనే ఒక ఫెరోషియస్‌ క్యారెక్టర్‌కు అల్లు అర్జున్‌ ఎంతవరకు న్యాయం చెయ్యగలిగాడు? అనేది సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. 

కథ: కాకతీయ సామ్రాజ్యాన్ని గణపతిదేవుడు(కృష్ణంరాజు) పాలిస్తుంటాడు. అతని భార్య సోమాంబ(ప్రభ). గణపతిదేవుడికి పుత్ర సంతాన యోగం లేదని ఓ బ్రాహ్మణుడి ద్వారా తెలుసుకుంటారు దాయాదులైన హరిహర దేవుడు(సుమన్‌), మురారి దేవుడు(ఆదిత్య మీనన్‌). నిండు గర్భిణిగా వున్న సోమాంబకు పుట్టబోయేది ఖచ్ఛితంగా ఆడపిల్లే అయితే గణపతిదేవుడి తర్వాత కాకతీయ సామ్రాజ్యం తమ గుప్పెట్లోకి వస్తుందని ఆశపడతారు. అనుకున్నట్టుగానే సోమాంబ ఆడపిల్లను ప్రసవిస్తుంది. ఆమెకు రుద్రాంబ అని పేరు పెడతారు. పుట్టింది ఆడపిల్ల అని తెలిస్తే దాయాదులకు, సామంతరాజులకు తెలిస్తే రాజ్యాన్ని అల్లకల్లోలం చేస్తారు, శత్రువులు దాడి చేస్తారని భయపడిన గణపతిదేవుడు, మంత్రి శివదేవయ్య(ప్రకాష్‌రాజ్‌) పుట్టింది ఆడపిల్ల అనే విషయాన్ని దాచేస్తారు. గణపతిదేవుడు దంపతులకు మగబిడ్డ పుట్టాడని అందర్నీ నమ్మిస్తారు. దానికి తగ్గట్టుగానే రుద్రాంబకు రుద్రదేవుడని పేరు పెట్టి మగపిల్లాడిలా పెంచుతారు. వేష, భాషల్లో, యుద్ధవిద్యల్లో మగపిల్లలతో సమానంగా పెరుగుతుంది రుద్రాంబ. తను ఆడపిల్ల అనే విషయం తను కూడా మర్చిపోతుంది. అలా 25 సంవత్సరాలు గడిచిపోతాయి. యుద్ధ విద్యల్లో, శత్రువులతో పోరాడడంలో తనకు తిరుగులేదనిపించుకుంటుంది రుద్రాంబ. రుద్రదేవుడిగా వున్న రుద్రాంబను చూసి ఆడపిల్లలు కూడా మనసు పడతారు. తన చిన్ననాటి స్నేహితుడైన చాళుక్య వీరభద్రుడు(రానా) కూడా ఆమెను మగవాడనే అనుకుంటాడు. పెళ్ళీడుకొచ్చిన కొడుక్కి పెళ్ళి చేయాలని సామంతరాజులు కోరడంతో రుద్రాంబకు ముమ్మిడమ్మ(నిత్య మీనన్‌)ని ఇచ్చి పెళ్ళి కూడా చేస్తారు. ఇదిలా వుండగా అంత:పురం నుంచి వున్న సొరంగ మార్గం ద్వారా అప్పుడప్పుడు తన నిజ స్వరూపంతో బయటికి వస్తుంటుంది రుద్రాంబ. అలా వచ్చినపుడు చాళుక్య వీరభద్రుడు ఆమెను చూసి ప్రేమిస్తాడు. ఆమె కూడా అతన్ని ప్రేమిస్తుంది. ఆ తర్వాత తన మిత్రుడు రుద్రదేవుడు అబ్బాయి కాదని, అమ్మాయని తెలుసుకుంటాడు చాళుక్యవీరభద్రుడు. తన ప్రేమ కంటే ప్రజల శ్రేయస్సే తనకు ముఖ్యమని, అందుకని మగవాడిగానే వుండిపోతానని చెప్తుంది రుద్రాంబ. ఒక పక్క గోన గన్నారెడ్డి(అల్లు అర్జున్‌) అనే బందిపోటు వల్ల కాకతీయ సామ్రాజ్యానికి, రుద్రమదేవికి ఎన్నో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. మరో పక్క మహదేవనాయకుడు(విక్రమ్‌జీత్‌) కాకతీయ సామ్రాజ్యంపై దాడి చేసి రాజ్యాన్ని ఆక్రమించాలని చూస్తుంటాడు. వీటన్నింటినీ రుద్రాంబ ఎలా ఎదుర్కొంది? చివరికి రుద్రాంబ చాళుక్య వీరభద్రుడి ప్రేమను అంగీకరించిందా? రుద్రదేవుడు మగవాడు కాదని, ఆడపిల్ల అనే విషయం రాజ్య ప్రజలకు తెలిసిందా? తెలిసిన తర్వాత రుద్రాంబను యువరాణిగా అంగీకరించారా? ఆ తర్వాత ఏం జరిగింది? అనేది మిగతా కథ. 

ఆర్టిస్టుల పెర్‌ఫార్మెన్స్‌: రుద్రదేవుడిగా, రుద్రమదేవిగా అనుష్క ఎక్స్‌ట్రార్డినరీ పెర్‌ఫార్మెన్స్‌ ఇచ్చింది. చిన్నప్పటి నుంచి రుద్రదేవుడిగా పెరిగిన రుద్రాంబ క్యారెక్టర్‌ అద్భుతంగా పోషించింది. ఆ తర్వాత కాకతీయ సామ్రాజ్య యువరాణి రుద్రమదేవిగా, వీరోచితంగా పోరాడే వీరనారిగా తన పెర్‌ఫార్మెన్స్‌తో అందర్నీ ఆకట్టుకుంది. చాళుక్య వీరభద్రుడుగా నటించిన రానా కూడా తన క్యారెక్టర్‌లో ఒదిగిపోయాడు. రుద్రమదేవికి అన్నివిధాలుగా సహాయపడే క్యారెక్టర్‌లో తనదైన నటన ప్రదర్శించాడు. గోన గన్నారెడ్డిగా నటించిన అల్లు అర్జున్‌ ఆపాత్రని అవలీలగా పోషించాడు. తెలంగాణ యాసతో తను చెప్పే ప్రతి డైలాగ్‌ ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్‌ చేస్తుంది. గోన గన్నారెడ్డి క్యారెక్టర్‌కు అల్లు అర్జున్‌ పెర్‌ఫెక్ట్‌గా సూట్‌ అయ్యాడు. అతను చెప్పే డైలాగ్స్‌కి ఆడియన్స్‌ నుంచి అద్భుతమైన రెస్పాన్స్‌ వస్తోంది. ఆ తర్వాత చెప్పుకోదగిన క్యారెక్టర్‌ ప్రకాష్‌రాజ్‌ది. మంత్రి శివదేవయ్యగా రాజుకి సలహాలు ఇచ్చి నడిపించే క్యారెక్టర్‌లో తన మార్క్‌ చూపించాడు. చాలా సన్నివేశాల్లో అతను చెప్పిన డైలాగ్స్‌, క్లైమాక్స్‌లో అతని పెర్‌ఫార్మెన్స్‌ అందర్నీ ఆకట్టుకుంటుంది. గణపతిదేవుడుగా కృష్ణంరాజు చాలా హుందాగా, ఒక రాజులా కనిపించాడు. ఈ కథలో లెక్కకు మించిన పాత్రలు, వాటిని పోషించిన పాత్రధారులు వున్నారు. వారంతా తమ తమ క్యారెక్టర్లకు పూర్తి న్యాయం చేశారు. 

టెక్నీషియన్స్‌: ఈ సినిమాకి చెప్పుకోదగ్గ టెక్నీషియన్స్‌ అంటే ఇళయరాజా, అజయ్‌ విన్సెంట్‌, తోట తరణి, పరుచూరి బ్రదర్స్‌. ఇళయరాజా చేసిన పాటల్లో మూడు పాటలు బాగున్నాయి. ఆ పాటల పిక్చరైజేషన్‌ కూడా చాలా రిచ్‌గా అందర్నీ ఆకట్టుకునేలా వున్నాయి. ఒక హిస్టారికల్‌ మూవీ అనగానే బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌కి ఎంత ఇంపార్టెన్స్‌ వుంటుందో అందరికీ తెలిసిందే. ఇళయరాజా బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌కి పెట్టింది పేరు. ఈ సినిమాలో మరోసారి తన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ మార్క్‌ని చూపించారు. ఇలాంటి కథలో సెట్స్‌కి ఎంత ప్రాధాన్యముంటుందో మనకు తెలుసు. సినిమా స్టార్టింగ్‌ నుంచి ఎండింగ్‌ వరకు తన అద్భుతమైన సెట్స్‌తో కనువిందు చేశారు తోట తరణి. అతను వేసిన సెట్స్‌ వల్ల ప్రతి సన్నివేశం ఎంతో రిచ్‌గా కనిపించింది. కాకతీయ సామ్రాజ్యాన్ని, అప్పటి స్థితి గతుల్ని స్క్రీన్‌మీద ఆవిష్కరించారు. వీటికి అద్భుతమైన గ్రాఫిక్స్‌ కూడా తోడై సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళాయి. గ్రాఫిక్స్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్‌ ఇచ్చి ప్రతి ఫ్రేమ్‌ని అద్భుతంగా చూపించారు. గుణశేఖర్‌ విషయానికి వస్తే రుద్రమదేవి చరిత్రను తను ఎలా చెప్పాలనుకున్నాడో, స్క్రీన్‌ మీద ఎలా ఆవిష్కరించాలని అనుకున్నాడో దాన్ని హండ్రెడ్‌ పర్సెంట్‌ చేసి చూపించాడు. కథలోని పాత్రలకు తగ్గ నటీనటులను ఎంపిక చేసుకోవడంలోనే చాలా వరకు సక్సెస్‌ అయ్యాడు. అలాగే వారినుంచి తనకు కావాల్సిన పెర్‌ఫార్మెన్స్‌ని రాబట్టుకోవడంలో పూర్తిగా సక్సెస్‌ అయ్యాడు. సుదీర్ఘంగా వుండే రుద్రమదేవి చరిత్రను 2 గంటల 38 నిముషాల్లో చెప్పడం చాలా కష్టమని గుణశేఖర్‌ చెప్పిన మాటలు నిజమే అనిపిస్తాయి. ఆమె జీవితంలోని ముఖ్య ఘట్టాలను తీసుకొని ఆకట్టుకునేలా తియ్యడం అనేది మామూలు విషయం కాదు. ఈ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్‌ అవకుండా అతను పెట్టిన ఎఫర్ట్‌ను ఖచ్చితంగా అభినందించాల్సిందే. అన్నింటినీ మించి క్లైమాక్స్‌లో వచ్చే యుద్ధ సన్నివేశాలు చాలా అద్భుతంగా తీశారు. అనుష్క కత్తి యుద్ధం చేసే సీన్స్‌ టెర్రిఫిక్‌గా అనిపిస్తాయి. 

విశ్లేషణ: రుద్రమదేవి పుట్టుక దగ్గర్నుంచి కథను మొదలు పెట్టి ఆమె పెరిగి పెద్దదై రాజ్యాన్ని ఏవిధంగా పాలించింది, ఎలాంటి సాహసాలు చేసింది, శత్రు దేశాల నుంచి ప్రజల్ని ఎలా కాపాడింది అనే విషయాల్ని ఒక క్రమ పద్ధతిలో చెప్పడంలో గుణశేఖర్‌ సక్సెస్‌ అయ్యాడు. మొదటి నుంచీ రుద్రమదేవిని అమ్మాయిగా ఎస్టాబ్లిష్‌ చెయ్యకపోవడం, అందరూ ఆమెను అబ్బాయిగానే ట్రీట్‌ చెయ్యడం, ఆమె అమ్మాయిగా వున్నప్పుడు చాళుక్య వీరభద్రుడు ఆమెను ఇష్టపడడం వంటి సన్నిశాలతో ఫస్ట్‌ హాఫ్‌ అంతా చాలా ఇంట్రెస్టింగ్‌గా సాగుతుంది. మధ్య మధ్య గోన గన్నారెడ్డి క్యారెక్టర్‌ వచ్చి తెలంగాణ యాసలో చెప్పే డైలాగ్స్‌కి ఆడియన్స్‌ నుంచి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. ఇక సెకండాఫ్‌కి వచ్చిన తర్వాత కూడా అబ్బాయిగానే చూపించడం సెకండాఫ్‌లో సగం సినిమా నడిచిన తర్వాత రుద్రమదేవిగా ప్రజలకి పరిచయం చెయ్యడం, ఆ తర్వాత చెలికత్తెలతో ఆమెకు ఓ పాట పాడుకోవడం, ఒక ఆడపిల్లకు రాణిగా పట్టాభిషేకం చెయ్యడం ప్రజలకు నచ్చక రాజ్య బహిష్కారం చెయ్యడం వంటి సీన్స్‌ ఆడియన్స్‌కి కాస్త బోర్‌ కొట్టిస్తాయి. క్లైమాక్స్‌లో వచ్చే యుద్ధ సన్నివేశాలు బాగున్నప్పటికీ దానికి ఎక్కువ టైమ్‌ కేటాయించడంతో సినిమా ఎప్పుడు కంప్లీట్‌ అవుతుందా అని ఆడియన్స్‌ ఎదురుచూసేలా చేస్తుంది. చరిత్రను చరిత్రలాగే చెప్పాలి కాబట్టి ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్‌ చేసే సన్నివేశాల్ని జోడించడం ఇలాంటి కథలో కుదరదు. కాబట్టి ఆడియన్స్‌ అక్కడక్కడ అసహనానికి లోనయ్యే అవకాశం వుంది. ఫైనల్‌గా చెప్పాలంటే గుణశేఖర్‌ రుద్రమదేవి కథను ఎంతో ఇష్టపడి, దానికోసం ఎంతో ఎంతో కష్టపడి తీసిన ఈ సినిమాని ఆడియన్స్‌ ఎలా రిసీవ్‌ చేసుకుంటారు? కమర్షియల్‌గా ఎంతవరకు వర్కవుట్‌ అవుతుంది? కలెక్షన్లపరంగా ఎలాంటి రికార్డులు క్రియేట్‌ చేస్తుందనేది కాలమే నిర్ణయిస్తుంది. 

ఫినిషింగ్‌ టచ్‌: మెస్మరైజ్‌ చేసే హిస్టారికల్‌ మూవీ 

సినీజోష్‌ రేటింగ్‌: 3/5

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement