Advertisement

సినీజోష్‌ రివ్యూ: రాక్షసుడు

Fri 29th May 2015 01:42 PM
telugu movie rakshasudu review,surya,nayanatara,venkat prabhu,yuvan shankar raja  సినీజోష్‌ రివ్యూ: రాక్షసుడు
సినీజోష్‌ రివ్యూ: రాక్షసుడు
Advertisement

స్టూడియో గ్రీన్‌, మేధ క్రియేషన్స్‌

రాక్షసుడు

నటీనటులు: సూర్య, నయనతార, పార్తీబన్‌, సముద్రఖని,

ప్రేమ్‌జీ అమరన్‌, ప్రణీత, శ్రీమాన్‌, బ్రహ్మానందం తదితరులు

సినిమాటోగ్రఫీ: ఆర్‌.డి.రాజశేఖర్‌

సంగీతం: యువన్‌ శంకర్‌రాజా,

మాటలు: శశాంక్‌ వెన్నెలకంటి

ఎడిటింగ్‌: ప్రవీణ్‌ కె.ఎల్‌.

సమర్పణ: కె.ఇ.జ్ఞానవేల్‌రాజా

నిర్మాతలు: కృష్ణారెడ్డి, రవీందర్‌రెడ్డి

రచన, దర్శకత్వం: వెంకట్‌ ప్రభు

విడుదల తేదీ: 29.05.2015

గజిని, వీడొక్కడే, యముడు వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన హీరో సూర్యకి ఈమధ్యకాలంలో తెలుగులో హిట్‌ అనేది లేదనే చెప్పాలి. ఘటికుడు, బ్రదర్స్‌, సెవెన్త్‌ సెన్స్‌, సికిందర్‌ వంటి సినిమాలు వరసగా ఫ్లాప్‌ అవ్వడంతో తెలుగులో సూర్య క్రేజ్‌ బాగా తగ్గింది. అందుకే డిఫరెంట్‌ జోనర్‌ సినిమాలు తియ్యడంలో స్పెషలిస్ట్‌గా పేరు తెచ్చుకున్న వెంకట్‌ ప్రభు కాంబినేషన్‌లో రూపొందిన ‘రాక్షసుడు’ చిత్రంతో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి సూర్య, వెంకట్‌ ప్రభు ఫస్ట్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘రాక్షసుడు’ ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్‌ చెయ్యడంలో ఎంతవరకు సక్సెస్‌ అయ్యాడు? హిట్‌ కోసం ఎదురుచూస్తున్న సూర్యకి వెంకట్‌ ప్రభు హిట్‌ సినిమాని ఇవ్వగలిగాడా? మెగాస్టార్‌ చిరంజీవి చేసిన సూపర్‌హిట్‌ మూవీ ‘రాక్షసుడు’ టైటిల్‌తో వచ్చిన ఈ సినిమా ఏమేర ప్రేక్షకుల్ని ఆకట్టుకుందనేది సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం.

కథ: మాస్‌గా పిలవబడే మధుసూదన్‌(సూర్య), అతని స్నేహితుడు జెట్‌(ప్రేమ్‌జీ) చిన్న సైజు దొంగతనాలు, మోసాలు చేస్తూ లైఫ్‌ నెట్టుకొస్తుంటారు. బ్లాక్‌లో మందు అమ్మేవారి దగ్గరికి పోలీసుల్లా, బోట్‌ల ద్వారా స్మగ్లింగ్‌ చేసే వారికి నేవీ ఆఫీసర్లలా బిల్డప్‌ ఇచ్చి వారి దగ్గర నుంచి డబ్బు కొట్టేయడం వారిద్దరి వృత్తి. ఆ క్రమంలోనే నర్స్‌గా పనిచేసే మాలిని(నయనతార) తారసపడుతుంది. మాస్‌ ఆమెను ప్రేమిస్తాడు. ఓరోజు ఒక క్రైమ్‌ చేసి తప్పించుకునే ప్రయత్నంలో వారిద్దరూ వెళ్తున్న కారుకి యాక్సిడెంట్‌ అవుతుంది. ఆ యాక్సిడెంట్‌లో చావు చివరి అంచు వరకూ వెళ్ళి బ్రతికి బయటపడతాడు మాస్‌. ఇక అప్పటి నుంచి అతనికి చనిపోయిన వారి ఆత్మలు కనిపిస్తుంటాయి. అతన్ని వెంబడిస్తూ వుంటాయి. ఆ ఆత్మలు తమకి తీరని కోరికలు తీర్చమని అడుగుతాయి. అయితే మాస్‌ మాత్రం వారిని అడ్డం పెట్టుకొని డబ్బు సంపాదిస్తుంటాడు. ఆ టైమ్‌లో మాస్‌కి షాక్‌ ఇస్తూ శివ(సూర్య) ప్రత్యక్షమవుతాడు. అచ్చు గుద్దినట్టు మాస్‌లాగే అతనూ వుంటాడు. అయితే అతను ఆత్మ. ఇక అప్పటి నుంచి మాస్‌ జీవితంలో ఎన్నో మార్పులు జరుగుతాయి. శివ వల్ల మాస్‌ రెండు హత్యలు చేయాల్సి వస్తుంది. క్రిమినల్‌గా పోలీసు రికార్డుల్లోకి ఎక్కుతాడు. మాస్‌ రూపు రేఖల్లోనే వున్న శివ ఎవరు? అతనికి తీరని కోరిక ఏమిటి? మాస్‌తో ఎందుకు హత్యలు చేయిస్తున్నాడు? మాస్‌తో శివకి వున్న సంబంధం ఏమిటి? మాస్‌కి కనిపిస్తున్న ఆత్మల కోరికలు నెరవేర్చాడా? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

ఆర్టిస్టుల పెర్‌ఫార్మెన్స్‌: మాస్‌గా, శివగా రెండు డిఫరెంట్‌ క్యారెక్టర్లను సూర్య ఎక్స్‌లెంట్‌గా చేశాడు. దొంగగా, మాస్‌ లుక్‌ వున్న మాస్‌ క్యారెక్టర్‌లో, శివగా పోలీస్‌ ఆఫీసర్‌ క్యారెక్టర్‌లో సూర్య ఎంతో డిగ్నిఫైడ్‌గా నటించాడు. మాలినిగా చేసిన నయనతార క్యారెక్టర్‌లో ఎలాంటి కొత్తదనం లేదు. రొటీన్‌గా వచ్చే హీరోయిన్‌ క్యారెక్టర్‌ ఆమెది. సినిమా మొత్తం మీద ఆమె కనిపించే సీన్స్‌ కూడా తక్కువనే చెప్పాలి. వున్నంతలో తన క్యారెక్టర్‌కి న్యాయం చేయడానికి ట్రై చేసింది. మాస్‌ స్నేహితుడు జెట్‌ క్యారెక్టర్‌లో ప్రేమ్‌జీ సినిమా స్టార్టింగ్‌ నుంచి ఆల్‌మోస్ట్‌ ఎండిరగ్‌ వరకు కనిపించాడు. సాధారణంగా అన్ని సినిమాల్లో ఓవర్‌ యాక్షన్‌ చేసే ప్రేమ్‌జీ ఈ సినిమా అది కాస్త తగ్గించుకున్నట్టుగా అనిపించింది. విలన్‌గా సముద్రఖని తన క్యారెక్టర్‌కి హండ్రెడ్‌ పర్సెంట్‌ న్యాయం చేశాడు. తను కనిపించిన అన్ని సీన్స్‌లో ఆడియన్స్‌కి టెన్షన్‌ క్రియేట్‌ చేశాడు. హాస్పిటల్‌ డీన్‌గా బ్రహ్మానందం చేసిన క్యారెక్టర్‌ కామెడీ పండిరచడానికి ఏమాత్రం అవకాశం లేనిది. ఈ క్యారెక్టర్‌ కోసం బ్రహ్మానందంని ఎందుకు తీసుకున్నారో అర్థం కాదు. శివ ఫ్లాష్‌బ్యాక్‌లో అతని భార్యగా నటించిన ప్రణీత కనిపించిన కాసేపు ఓకే అనిపించేలా పెర్‌ఫార్మ్‌ చేసింది. పోలీస్‌ స్పెషల్‌ ఆఫీసర్‌గా కనిపించిన పార్తీబన్‌ తన క్యారెక్టర్‌ని డిగ్నిఫైడ్‌గా చేశాడు. 

టెక్నీషియన్స్‌: ఈ సినిమాకి ఫోటోగ్రఫీ మెయిన్‌ ఎస్సెట్‌గా నిలిచింది. స్టార్టింగ్‌ నుంచి ఎండిరగ్‌ వరకు ప్రతి సీన్‌లోనూ కొత్తదనం చూపించే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా ఇద్దరు సూర్యలు కనిపించినపుడు వారిద్దరినీ పర్‌ఫెక్ట్‌గా మ్యాచ్‌ చెయ్యగలిగాడు. అలాగే ఫారిన్‌ ఎపిసోడ్స్‌ని కూడా చాలా అందంగా చూపించాడు. యువన్‌ శంకర్‌రాజా మ్యూజిక్‌ విషయానికి వస్తే సినిమాలోని ఒక్క పాట కూడా ఆకట్టుకునేలా లేదు. విజువల్‌గా కూడా పాటలు అంత బాగా తియ్యలేకపోయారు. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ మాత్రం సినిమాని బాగా ఎలివేట్‌ చేసేలా వుంది. ప్రవీణ్‌ ఎడిటింగ్‌ సినిమాలో చాలాచోట్ల డిస్ట్రబెన్స్‌గా అనిపించింది. శశాంక్‌ వెన్నెలకంటి రాసిన మాటలు ఆకట్టుకున్నాయి. ఈ సినిమాకి అంతకుమించి మాటలు రాసే అవకాశం కూడా లేదు. డైరెక్టర్‌ వెంకట్‌ప్రభు విషయానికి వస్తే ఇంతకుముందు అతను చేసిన సినిమాల కంటే నాసిరకం సబ్జెక్ట్‌తో చేసిన సినిమా ఇది. ఇటీవల తెలుగులో ‘వారధి’ పేరుతో వచ్చిన సినిమా కూడా ఇదే కాన్సెప్ట్‌తో చేసిన సినిమా కావడంతో సినిమా స్టార్టింగ్‌లోనే ఆ సినిమా చూసినవారికి నీరసం వచ్చేస్తుంది. రొటీన్‌గా సీన్స్‌ ఒకదాని వెంట ఒకటి వెళ్తూ వుంటుంది తప్ప క్యూరియాసిటీ అనేది లోపిస్తుంది. ఈ రెండు సినిమాలకు మాతృక ఒకటే అనేది మనకి క్లియర్‌గా అర్థమవుతుంది. అయితే వెంకట్‌ప్రభు మాత్రం దానికి మన సౌత్‌ ఇండియన్‌ నేటివిటీని జోడిరచి కొంత కథను అల్లాడు. ఫస్ట్‌ హాఫ్‌ కంటే సెకండాఫ్‌ని బాగా చెయ్యగలిగాడు. ఓవరాల్‌గా సూర్యతో ఒక థ్రిల్లింగ్‌ మూవీని ఆడియన్స్‌కి అందించడంలో సక్సెస్‌ అయ్యాడు. 

ప్లస్‌ పాయింట్స్‌: 

సూర్య పెర్‌ఫార్మెన్స్‌

ఫోటోగ్రఫీ

బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ 

మైనస్‌ పాయింట్స్‌:

తెలుగులో వచ్చిన కాన్సెప్ట్‌

ఎంటర్‌టైన్‌మెంట్‌ లేకపోవడం

విశ్లేషణ: ఫస్ట్‌ హాఫ్‌లో కొన్ని చిన్న చిన్న దొంగతనాలు, కొంత కామెడీ, కొన్ని లవ్‌కి సంబంధించిన సీన్స్‌తో నెట్టుకొచ్చి అసలు కాన్సెప్ట్‌కి వచ్చే సరికి కొత్తగా చూసేవారికి థ్రిల్‌ అనిపిస్తుంది. ఆల్రెడీ ‘వారధి’ చిత్రాన్ని చూసినవారికి మాత్రం ఇదేనా కథ అనిపిస్తుంది. అలా అక్కడక్కడ కొన్ని బోరింగ్‌ సీన్స్‌తో ఫస్ట్‌ హాఫ్‌ ఓకే అనిపించిన వెంకట్‌ప్రభు సెకండాఫ్‌ మీద ఇంట్రెస్ట్‌ క్రియేట్‌ అయ్యేలా ఒక ట్విస్ట్‌తో ఫస్ట్‌ హాఫ్‌ని ఎండ్‌ చేసాడు. ఇక సెకండాఫ్‌లో మాస్‌కి సంబంధించిన కథ ఒక వైపు, మరో వైపు శివకి సంబంధించిన కథ తీసుకొని వాటిని లింక్‌ చేస్తూ క్లైమాక్స్‌ వరకు చాలా స్పీడ్‌గా, ఎక్కడా బోర్‌ లేకుండా తీసుకురాగలిగాడు. క్లైమాక్స్‌ని కూడా అంతే కన్విన్సింగ్‌గా చెప్పడంలో సక్సెస్‌ అయ్యాడు. సూర్య కెరీర్‌లోగానీ, వెంకట్‌ ప్రభు కెరీర్‌లోగానీ ఇది చెప్పుకోదగిన సినిమా కాకపోయినప్పటికీ ఒక ఇంట్రెస్టింగ్‌ ఎలిమెంట్‌తో, ఫ్యామిలీ సెంటిమెంట్‌తో ఆడియన్స్‌ని సీట్లలో కూర్చోబెట్టగలిగాడు. అయితే ఈ సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్‌ లేకపోవడం సినిమాకి కొంత మైనస్‌ అయింది. ఫైనల్‌గా చెప్పాలంటే ఇది డైరెక్టర్స్‌ సినిమా. సేమ్‌ టైమ్‌ సూర్య వన్‌ మ్యాన్‌ షోగా తన పెర్‌ఫార్మెన్స్‌తో నడిపించిన సినిమాగా చెప్పొచ్చు. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో వచ్చే సినిమాలను ఎంజాయ్‌ చేసే ఆడియన్స్‌కి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది.

ఫినిషింగ్‌ టచ్‌: ఈ ‘రాక్షసుడు’ ఫర్వాలేదనిపించాడు

సినీజోష్‌ రేటింగ్‌: 3/5

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement