Advertisement

సినీజోష్‌ రివ్యూ: బుడుగు

Fri 17th Apr 2015 03:43 PM
telugu movie budugu,budugu review,machu laxmi,sai karthik,manmohan  సినీజోష్‌ రివ్యూ: బుడుగు
సినీజోష్‌ రివ్యూ: బుడుగు
Advertisement

హైదరాబాద్‌ ఫిలిం ఇన్నోవేటివ్స్‌

బుడుగు

నటీనటులు: మంచు లక్ష్మీ, శ్రీధర్‌రావు, ఇంద్రజ, 

మాస్టర్‌ ప్రేమ్‌బాబు, బేబీ డాలీ తదితరులు 

సినిమాటోగ్రఫీ: సురేష్‌ రఘుతు

సంగీతం: సాయికార్తీక్‌

ఎడిటింగ్‌: శ్యామ్‌ మెంగ

నిర్మాతలు: భాస్కర్‌, సారిక శ్రీనివాస్‌

రచన, దర్శకత్వం: మన్‌మోహన్‌

విడుదల తేదీ: 17.04.2015

ఈమధ్యకాలంలో హార్రర్‌, థ్రిల్లర్‌ చిత్రాలకు ఆదరణ ఎక్కువ వున్న మాట వాస్తవం. దర్శకనిర్మాతలు కూడా అలాంటి సబ్జెక్ట్స్‌తోనే సినిమాలు తియ్యడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ఆ కోవకు చెందిన సినిమాయే ‘బుడుగు’. ఈ చిత్రం మాత్రం సైకలాజికల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు. మంచు లక్ష్మీ, మాస్టర్‌ ప్రేమ్‌బాబు, శ్రీధర్‌రావు ప్రధాన పాత్రల్లో మన్‌మోహన్‌ దర్శకత్వంలో భాస్కర్‌, సారిక శ్రీనివాస్‌ నిర్మించిన ఈ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సైకలాజికల్‌ థ్రిల్లర్‌ అంటూ ఓ కొత్త ఎలిమెంట్‌తో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏమేరకు థ్రిల్‌ చేసిందనే విషయాలు తెలుసుకోవడానికి సమీక్షలోకి వెళ్దాం.

కథ: రాకేష్‌(శ్రీధర్‌రావు), అతని భార్య పూజ(మంచు లక్ష్మీ), వారి పిల్లలు బన్ని(మాస్టర్‌ ప్రేమ్‌బాబు), ఆపిల్‌(బేబీ డాలీ). ఇది ఆ కుటుంబం. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తుంటారు. వారికి వున్న జాబ్‌ టెన్షన్స్‌ వల్ల పిల్లల బాగోగులు పట్టించుకునే తీరిక వారికి వుండదు. పిల్లల్ని చూసుకోవడానికి ఒక ఆయా వుంటుంది. బన్ని మానసిక స్థితి మాత్రం తల్లిదండ్రుల్ని ప్రతిరోజూ టెన్షన్‌కి గురి చేస్తుంది. పూజ అవన్నీ సర్దుకుపోతున్నా, రాకేష్‌ మాత్రం బన్ని విషయంలో చాలా కోపంగా వుంటాడు. రోజూ స్కూల్‌కి లేట్‌గా వెళ్ళడం, స్కూల్‌లో బన్ని వల్ల కొన్ని ప్రాబ్లమ్స్‌ వస్తాయి. దాంతో అతన్ని వేరే సిటీలోని ఓ బోర్డింగ్‌ స్కూల్‌లో చేర్పిస్తారు. తన విచిత్ర చేష్టలతో అక్కడి పిల్లల్ని భయానికి గురి చేస్తాడు బన్ని. మళ్ళీ బన్నిని ఇంటికి తీసుకొస్తారు. పొరుగింటిలో చనిపోయిన దియా తనకు రోజూ కనిపిస్తోందని, తనతో మాట్లాడుతోందని చెప్తాడు బన్ని. తమ పిల్లాడి మానసిక విషయంలో ఆందోళన చెందిన రాకేష్‌, పూజ సైకియాట్రిస్ట్‌ గీతారెడ్డి(ఇంద్రజ)ను కలుస్తారు. అన్నీ స్టడీ చేసిన గీతారెడ్డి ట్రీట్‌మెంట్‌ స్టార్ట్‌ చేస్తుంది. బన్ని ఎందుకలా ప్రవర్తిస్తున్నాడు? దియా  బన్నికి మాత్రమే ఎందుకు కనిపిస్తోంది? బన్నిని మామూలు కుర్రాడిలా మార్చడంలో డా॥ గీతారెడ్డి సక్సెస్‌ అయ్యిందా? అనేది మిగతా కథ. 

ప్లస్‌ పాయింట్స్‌: ఈ సినిమాకి మేజర్‌ ప్లస్‌ పాయింట్‌ కాన్సెప్ట్‌. తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో ఎంత అజాగ్రత్తగా వుంటున్నారు, వారి ఆలనా పాలనా చూసుకోవడంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు అనేది చూపించాడు దర్శకుడు. తల్లిదండ్రుల ఆదరణ నోచుకోని పిల్లలు ఎలాంటి మానసిక రుగ్మతల బారిన పడతారు అనేది చెప్పే ప్రయత్నం చేశాడు. తల్లి పాత్రలో లక్ష్మీ మంచు ఎంతో ఇన్‌వాల్వ్‌ అయి నటించిందని చెప్పాలి. భయం కలిగించే కొన్ని సీన్స్‌లో తన పెర్‌ఫార్మెన్స్‌ అందర్నీ ఆకట్టుకుంటుంది. తండ్రిగా శ్రీధర్‌రావు తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. పిల్లల అతి ప్రవర్తన తండ్రికి కలిగించే విసుగును, చిరాకును పర్‌ఫెక్ట్‌గా పెర్‌ఫార్మ్‌ చేశాడు. అందర్నీ తన చేష్టలతో భయభ్రాంతుల్ని చేసే బన్ని పాత్రలో మాస్టర్‌ ప్రేమ్‌బాబు ప్రదర్శించిన నటన బాగుంది. ఆపిల్‌గా మూగ పాత్రలో నటించిన బేబీ డాలి సైగలు చేస్తూ చేసిన నటన ఆకట్టుకుంది. అన్నింటినీ మించి ఈ చిత్రానికి పెద్ద ప్లస్‌ పాయింట్స్‌గా చెప్పుకోదగినవి సినిమాటోగ్రఫీ, సంగీతం. సురేష్‌ రఘుతు అద్భుతమైన ఫోటోగ్రఫీని అందించాడు. ప్రతి ఫ్రేమ్‌ని రిచ్‌గా చూపించడంలో హండ్రెడ్‌ పర్సెంట్‌ సక్సెస్‌ అయ్యాడు. సాయికార్తీక్‌ అందించిన బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ సినిమాకి చాలా గ్రాండియర్‌ తెచ్చింది. 

మైనస్‌ పాయింట్స్‌: తల్లిదండ్రులు ప్లిలలపై చూపించాల్సిన ప్రేమ, శ్రద్ధల గురించి చెప్పే ప్రయత్నం వరకు బాగానే వుంది. కానీ, ఆ తర్వాత బన్ని విచిత్ర ప్రవర్తనకు కారణాలు, దానికి ఎలాంటి సొల్యూషన్‌ వుంటుందనే విషయాలు చెప్పడంలో దర్శకుడు ఆడియన్స్‌ని చాలా కన్‌ఫ్యూజ్‌ చేశాడు. కేవలం ఆడియన్స్‌ని భయపెట్టడానికే కొన్ని సీన్లు క్రియేట్‌ చేసినట్టుగా అనిపిస్తుంది తప్ప చెప్పాలనుకున్న పాయింట్‌కి సంబంధించిందిగా అనిపించదు. ఫస్ట్‌ హాఫ్‌ చాలా బోరింగ్‌ వుండడమే కాకుండా ఫ్యామిలీ మెంబర్స్‌తో తీసిన సీన్స్‌ రిపీటెడ్‌గా అనిపిస్తాయి. అలాగే సైకియాట్రిస్ట్‌ బన్నికి ఇచ్చే ట్రీట్‌మెంట్‌ కూడా ఆడియన్స్‌కి ఏమాత్రం అర్థం కాదు. ట్రీట్‌మెంట్‌కి సంబంధించి సైకియాట్రిస్ట్‌ బన్ని తల్లిదండ్రులకు చెప్పే సీన్స్‌ ఒక డాక్యుమెంటరీలా వుంది తప్ప సినిమాలా లేదు. ఇక సినిమా స్టార్ట్‌ అవ్వగానే ఫ్రెండ్స్‌ పార్టీ, ఒకరినొకరు భయపెట్టుకోవడం వంటి సీన్స్‌ దాదాపు 10 నిముషాలకుపైగానే వున్నాయి. 

విశ్లేషణ: ఫస్ట్‌ హాఫ్‌ స్టార్ట్‌ అవడమే ఒక బోరింగ్‌ సీన్‌తో స్టార్ట్‌ అవుతుంది. అక్కడి నుంచి ఆ ఫ్యామిలీలోని అందర్నీ పరిచయం చేయడానికి మరికొంత సమయం తీసుకోవడంతో కథలోకి వెళ్ళడానికి కొంత టైమ్‌ పట్టింది. అలా ఫస్ట్‌ హాఫ్‌ అంతా స్లో నేరేషన్‌తో, రిపీటెడ్‌ సీన్స్‌తో కంప్లీట్‌ అవుతుంది. ఇక సెకండాఫ్‌ స్టార్ట్‌ అయినప్పటి నుంచి కథ కాస్త స్పీడ్‌గా వెళ్ళినట్టు అనిపిస్తుంది. కానీ, చూసిన సీన్సే మళ్ళీ మళ్ళీ చూస్తున్నామా అనిపిస్తుంది. ఈ సినిమాలో ప్రేక్షకుల్ని ఆకట్టుకునే అంశాలు ఏమైనా వుంటే అది చక్కని ఫోటోగ్రఫీ, మంచి బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌. ఇక తను చెప్పదలుచుకున్న విషయంలో డైరెక్టర్‌కే కొంత కన్‌ఫ్యూజన్‌ వున్నట్టుగా అనిపిస్తుంది. సెకండాఫ్‌లో కొన్ని థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌ ఆడియన్స్‌ని బాగానే థ్రిల్‌ చేశాయి. కథ, కథనం ఎలా వున్నా కొంత మేర ఆడియన్స్‌ని భయపెట్టడంలో డైరెక్టర్‌ సక్సెస్‌ అయ్యాడు. ఫైనల్‌గా చెప్పాలంటే హార్రర్‌ సినిమాలంటే ఇష్టపడేవారు, థ్రిల్‌ కోరుకునేవారు ఈ సినిమా చూడొచ్చు. అయితే కమర్షియల్‌గా ఈ సినిమా ఎలాంటి సక్సెస్‌ సాధిస్తుందనే దానిపైనే సినిమా భవిష్యత్తు ఆధారపడి వుంది. 

ఫినిషింగ్‌ టచ్‌: అందరికీ అర్థం కాని ‘బుడుగు’

సినీజోష్‌ రేటింగ్‌: 2/5

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement