Advertisement

సినీజోష్‌ రివ్యూ: గడ్డం గ్యాంగ్‌

Sat 07th Feb 2015 01:39 AM
gaddam gang,dr.rajasekhar,sheena,achu,jeevitha rajasekhar,soodu kavvum  సినీజోష్‌ రివ్యూ: గడ్డం గ్యాంగ్‌
సినీజోష్‌ రివ్యూ: గడ్డం గ్యాంగ్‌
Advertisement

శివాని శివాత్మిక మూవీస్‌

గడ్డం గ్యాంగ్‌

నటీనటులు: డా॥ రాజశేఖర్‌, షీనా, నరేష్‌, సత్యం రాజేష్‌, 

అచ్చు, నాగబాబు, గిరిబాబు, నోయెల్‌ తదితరులు

కెమెరా: డెమెల్‌ ఎక్స్‌ ఎడ్వర్డ్స్‌

ఎడిటింగ్‌: రిచరర్డ్‌ కెవిన్‌ ఎ.

సంగీతం: అచ్చు

సమర్పణ: జీవిత రాజశేఖర్‌

నిర్మాతలు: శివాని, శివాత్మిక

దర్శకత్వం: సంతోష్‌ పీటర్‌ జయకుమార్‌

విడుదల తేదీ: 6.2.2015

గతంలో ఎన్నో పవర్‌ఫుల్‌ క్యారెక్టర్స్‌ చేసి ఆడియన్స్‌లో ఒక స్పెషల్‌ ఇమేజ్‌ని సంపాదించుకున్న డా॥ రాజశేఖర్‌కి ఈమధ్యకాలంలో హిట్‌ అనేది కరువైపోయింది. తమిళ్‌లో సూపర్‌హిట్‌ అయిన ‘సూదుకవ్వమ్‌’ చిత్రాన్ని ‘గడ్డం గ్యాంగ్‌’ పేరుతో రీమేక్‌ చేసి కొంత గ్యాప్‌ తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సంతోష్‌ పీటర్‌ జయకుమార్‌ దర్శకుడుగా పరిచయం కాగా, శివాని శివాత్మిక ఈ చిత్రాన్ని నిర్మించారు. శుక్రవారం రిలీజ్‌ అయిన ‘గడ్డంగ్యాంగ్‌’ చిత్రానికి ఎలాంటి రెస్పాన్స్‌ వస్తోంది? ఓ కొత్త జోనర్‌తో వచ్చిన  ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకున్నారు? అనే విషయాలు తెలుసుకోవడానికి సమీక్షలోకి వెళ్దాం.

కథ: సురేష్‌(అచ్చు), రమేష్‌(సత్యం రాజేష్‌) ఇద్దరూ స్నేహితులు. తన ఉద్యోగం పోవడంతో సురేష్‌ సంపాదనతోనే మందు తాగుతూ విందు చేసుకుంటూ వుంటాడు రమేష్‌. వీళ్ళిద్దరికీ తోడుగా పండు అనే కొత్త క్యారెక్టర్‌ ఎంటర్‌ అవుతుంది. ఆ తర్వాత సురేష్‌ ఉద్యోగం కూడా పోయి ముగ్గురూ ఖాళీ అయిపోతారు. ఈ ముగ్గురికీ గడ్డందాస్‌(డా॥ రాజశేఖర్‌) పరిచయమవుతాడు. చిన్న చిన్న కిడ్నాపులు చేసి ఈజీగా డబ్బులు సంపాదించడానికి గడ్డం దాస్‌ దగ్గర ఐదు సూత్రాల పథకం వుంటుంది. దాని ప్రకారం కిడ్నాపులు చేస్తుంటారు. వారికి అనుకోకుండా ఒక పెద్ద డీల్‌ వస్తుంది. మినిస్టర్‌ ధర్మరాజు(నరేష్‌) కొడుకు సత్యహరిశ్చంద్ర(నోయెల్‌)ని కిడ్నాప్‌ చెయ్యాలన్నది ఆ డీల్‌. ఒక ప్లాన్‌ ప్రకారం సత్యహరిశ్చంద్రని కిడ్నాప్‌ చేస్తారు. అప్పటి నుంచి వారికి సమస్యలు మొదలవుతాయి. ఆ కిడ్నాప్‌ వల్ల నలుగురు కిడ్నాపర్స్‌ ఎలాంటి ప్రాబ్లమ్స్‌ ఫేస్‌ చేశారు? వాటి నుంచి ఎలా బయటపడ్డారు అనేది మిగతా కథ. 

ప్లస్‌ పాయింట్స్‌: తెలుగు ప్రేక్షకులకు ఇది కొత్త తరహా సినిమా. ఓ పక్క హీరో గ్యాంగ్‌ క్రైమ్‌ చేస్తూనే ఆడియన్స్‌ నవ్వించే కథ. ఒక కొత్త జోనర్‌లో సినిమా చెయ్యాలని, ప్రేక్షకులకు తనను తాను కొత్తగా పరిచయం చేసుకోవాలన్న రాజశేఖర్‌ ప్రయత్నం మెచ్చుకోవాల్సిందే. స్క్రిప్ట్‌లోనే కావాల్సినంత కామెడీ వుండడం వల్ల అది ఆర్టిస్టులకు ప్లస్‌ అయింది. సినిమాలోని ముఖ్యపాత్రల పరిచయం, రాజశేఖర్‌ ఇంట్రడక్షన్‌ చాలా ఫన్నీగా వుంటుంది. గడ్డం గ్యాంగ్‌  చేసే కొత్త తరహా కిడ్నాపులు నవ్వు తెప్పిస్తాయి. ఆర్టిస్టుల పెర్‌ఫార్మెన్స్‌ విషయానికి వస్తే గడ్డం దాస్‌గా రాజశేఖర్‌ ఫర్వాలేదనిపించాడు. మిగతా క్యారెక్టర్స్‌లో రాజేష్‌, అచ్చు, పండు అక్కడ పేల్చిన కామెడీ డైలాగ్స్‌ థియేటర్‌లో నవ్వులు పండిరచాయి. అచ్చు పెర్‌ఫార్మెన్స్‌ కూడా బాగుంది. పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ గబ్బర్‌సింగ్‌గా నటించి యోగ్‌ జప్పీ తన క్యారెక్టర్‌కి హండ్రెడ్‌ పర్సెంట్‌ న్యాయం చేశాడు. తమిళ్‌లో కూడా ఈ క్యారెక్టర్‌ అతనే చెయ్యడం వల్ల తమిళ్‌ చూసిన వారికి కొత్తగా అనిపించకపోవచ్చు. టెక్నికల్‌గా చెప్పాలంటే డెమెల్‌ ఎక్స్‌ ఎడ్వర్డ్స్‌ సినిమాటోగ్రఫీ సినిమాకి చాలా వరకు ప్లస్‌ అయిందని చెప్పాలి. పాటలు పెద్దగా ఆకట్టుకోకపోయినా, రీరికార్డింగ్‌ ఫర్వాలేదనిపించాడు అచ్చు. 

మైనస్‌ పాయింట్స్‌: ఈ సినిమాకి ఎన్ని ప్లస్‌లు వున్నాయో అంతకుమించిన మైనస్‌లు వున్నాయి. తమిళ్‌లో హిట్‌ అయిన సినిమా అయినప్పటికీ దాన్ని తెలుగు నేటివిటీకి తీసుకురావడంలో డైరెక్టర్‌ సక్సెస్‌ కాలేకపోయాడు. ఒక డబ్బింగ్‌ సినిమా చూస్తున్న ఫీలింగ్‌ కలిగింది తప్ప స్ట్రెయిట్‌ మూవీ చూస్తున్నామన్న భావన కలగదు. మెయిన్‌ లీడ్స్‌లో రాజశేఖర్‌, సత్యంరాజేష్‌ తప్ప సినిమా కామన్‌ ఆడియన్‌కి తెలిసిన ఫేస్‌లు లేవు. ఫస్ట్‌ హాఫ్‌ కాస్త స్పీడ్‌గా వెళ్ళినప్పటికీ సెకండాఫ్‌కి వచ్చేసరికి సినిమా ఎక్కువ సేపు చూస్తున్నామన్న ఫీలింగ్‌ కలిగించారు. డా॥ రాజశేఖర్‌ చెప్పినట్టు చిన్న చిన్న మార్పులు తప్ప యాజ్‌ ఇటీజ్‌గా తీశారు. కాన్సెప్ట్‌ మాత్రమే తమిళ్‌ నుంచి తీసుకొని కొన్ని సీన్స్‌, డైలాగ్స్‌ తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్చి వుంటే బాగుండేది. అన్నింటికంటే పెద్ద మైనస్‌ ఏమిటంటే ప్రతి సినిమాకి స్టార్టింగ్‌లో, సెకండాఫ్‌ స్టార్టింగ్‌లో మద్యపానం, ధూమపానం గురించి యాడ్స్‌ వేసెయ్యడం, సినిమాలో మద్యం తాగినా, సిగరెట్‌ తాగినా స్క్రీన్‌మీద దానికి సంబంధించి కాషన్‌ ఇవ్వడం చాలా మామూలు అయిపోయింది. సాధారణంగా సినిమాలో అక్కడక్కడా మనం ఆ కాషన్‌ చూస్తాం. కానీ, 2 గంటల 22 నిముషాల ‘గడ్డంగ్యాంగ్‌’లో దాదాపు 2 గంటలు మనం ఆ కాషన్‌ని చూస్తాం. ఈమధ్యకాలంలో ఈ సినిమాలో చూపించినన్ని మందు సీన్స్‌, సిగరెట్‌ సీన్స్‌ ఏ సినిమాలోనూ లేవు అనేది హండ్రెడ్‌ పర్సెంట్‌ నిజం. కథలో అవసరం వున్నా, లేకపోయినా ప్రతి ఒక్కరూ సిగరెట్లు మీద సిగరెట్లు పీల్చేస్తూ కనిపిస్తారు. మోతాదు ఎక్కువ కావడంవల్ల ఒక కామెడీ సినిమా చూస్తున్న ఫీలింగ్‌ ఆడియన్స్‌కి కలగలేదు. 

విశ్లేషణ: డా॥ రాజశేఖర్‌ కెరీర్‌లో ‘గడ్డంగ్యాంగ్‌’ ఓ డిఫరెంట్‌ సినిమా. అతనికి వున్న ఇమేజ్‌ దృష్ట్యా చెయ్యకూడని సినిమా కూడా. పవర్‌ఫుల్‌ క్యారెక్టర్స్‌తో ఆడియన్స్‌కి బాగా దగ్గరైన రాజశేఖర్‌ నుంచి ఇలాంటి క్రైమ్‌ కామెడీని యాక్సెప్ట్‌ చెయ్యకపోవచ్చు. తమిళ ఫ్లేవర్‌ ఎక్కువగా వుండడంవల్ల తెలుగు సినిమా చూస్తున్నామన్న ఫీలింగ్‌కి ఆడియన్స్‌ దూరమవుతున్నారు. సినిమాలో చాలా విషయాల్లో క్లారిటీ లేదు. షీనా క్యారెక్టర్‌ ఏమిటి, రాజశేఖర్‌కి మాత్రమే కనిపించే ఆ అమ్మాయి ఫ్లాష్‌బ్యాక్‌ ఏమిటి అనేది చెప్పకుండానే ఆమె క్యారెక్టర్‌ని ముగించారు. కొంత గ్యాప్‌ తర్వాత డా॥ రాజశేఖర్‌ చేసిన ఈ సినిమా ఆడియన్స్‌ మెప్పించకపోవచ్చు. నిర్మాణపరంగా జీవిత రాజశేఖర్‌ ఎఫర్ట్‌ సినిమాలో కనిపిస్తుంది. ప్రతి సీన్‌ని రిచ్‌గా చూపించే ప్రయత్నం చేశారు. కమర్షియల్‌గా చెప్పాలంటే బి, సి సెంటర్స్‌లో ఇలాంటి సినిమాలకు ఆదరణ ఎక్కువగానే వుంటుంది కాబట్టి వర్కవుట్‌ అయ్యే అవకాశాలు వున్నాయి. 

సినీజోష్‌ రేటింగ్‌: 2.5/5

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement