Advertisement

ఇంటర్వ్యూ: యంగ్‌టైగర్ ఎన్టీఆర్

Sun 07th Oct 2018 12:31 PM
young tiger ntr,aravinda sametha veera raghava,latest,updates  ఇంటర్వ్యూ: యంగ్‌టైగర్ ఎన్టీఆర్
Aravinda Sametha Interview- Young Tiger NTR ఇంటర్వ్యూ: యంగ్‌టైగర్ ఎన్టీఆర్
Advertisement

ఎన్టీఆర్, పూజ హెగ్డే జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో అరవింద సమేత వీర రాఘవ లో నటిస్తున్నాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 11న విడుదల కానుంది. ఈ సందర్బంగా ఎన్టీఆర్ చెప్పిన విశేషాలు . 

అన్ని రోజుల కల..   

అవును .. త్రివిక్రమ్ దర్శకుడు కాకముందు నుండి నాకు మంచి స్నేహితుడు. ఎన్నాళ్ళ నుండో మా మధ్య స్నేహబంధం ఉంది .. చాలా రోజుల నుండి సినిమా చేయాలనీ అనుకుంటున్నాం కానీ ఇప్పటిదాకా కుదరలేదు. అంటే మేమిద్దరం కలిసి ఇన్నాళ్లకు ఈ సినిమా చేయాలనీ రాసుందేమో. త్రివిక్రమ్ తో సినిమా అంటే కథ తప్పకుండ బాగుంటుంది. నిజంగా మా ఇద్దరి కాంబినేషన్ లో ఎలాంటి సినిమా రావాలో ఇది అలాంటి సినిమా.  ఇక టైటిల్ గురించి అంటారా.. అద్భుతమైన టైటిల్ . అరవింద సమేత వీర రాఘవ .. ప్రతి మగాడి ఆయుధం ఆడదే. అంతెందుకు దేవుళ్లను కూడా లక్ష్మి సమేత నరసింహ స్వామి, సీతా సమేత శ్రీరాముడు అంటూ పిలుస్తుంటాం కాబట్టి టైటిల్ విషయంలో నో టెన్షన్ పైగా చాలా యూనిక్ గా ఉంది. 

హీరోయిజం ఉండదు ..  

ఇందులో హీరోయిజం ఉండదు .. మంచి హ్యూమన్ ఎమోషన్ ఉంటుంది. రాయలసీమ ఫ్యాక్షన్ అంటే కేవలం వయొలెన్స్ మాత్రమే కాదు. మనకున్న నవరసాల్లో కోపం కూడా ఒకటి. అంతే తప్ప ఇందులో హీరోయిజం కోసం పెద్ద పెద్ద డైలాగ్స్, భారీ ఫైట్స్ లాంటి అంశాలు ఉండవు. ఇందులో యుద్ధం చేయని వాడికి శాంతిని కోరుకునే హక్కులేదు.  ఫ్యాన్స్ కు నా సినిమా అనగానే హీరోయిజం ఉండాలని భావిస్తారు. కానీ మనం ఓ కథను చెబుతున్నాం .. ఆ కథను బట్టి నడవాలి తప్ప .. హీరోయిజం కోసం కథను కిల్ చేయకూడదు. ఇంతకు ముందు అలాంటి హీరోయిజం చేసి తప్పుచేశానేమో. జనతా గ్యారేజ్ తరువాత నాలో చాలా మార్పొచ్చిందని చెప్పారు. ఇక ఈ సినిమా పక్కా త్రివిక్రమ్ స్టైల్ లోనే ఉంటుంది. ఇది పూర్తిగా త్రివిక్రమ్ సినిమా.. అందులో నేను నటించాను తప్ప. ఇది నా సినిమా కాదు. నిజానికి దర్శకుడు , హీరో అంటే భార్యాభర్తల్లాంటివారు. దర్శకుడి ఎమోషన్స్ ని బయటపెట్టేది హీరోనే. అలాగే హీరో ఎలా చేశాడో చెప్పే మొదటి ప్రేక్షకుడు దర్శకుడే . 

హిట్ .. ఫ్లాప్ ...  

ఒక సినిమా ప్లాప్ అయినంతమాత్రాన ఆ దర్శకుడిని తక్కువగా అంచనా వేయకూడదు. అతని ప్రయత్నం మాత్రమే ఫెయిల్ అయింది.. అతను కాదు. ఇక్కడ ఎవరికీ ఫెయిల్యూర్స్ లేవు చెప్పండి .. అంతెందుకు నా విషయమే తీసుకుంటే నాకు ప్లాప్స్ ఉన్నాయి.  ఇక్కడ ఎవరు ఆకాశం నుండి ఊడిపడలేదు. మనం ఓ ప్రయత్నం చేస్తున్నాం అంతే. నిజంగా అది అలా జరుగుతుందని అనుకోలేదు .. నేను నటించిన 27 సినిమాల్లో ఎప్పుడు తండ్రి చితికి నిప్పటించే సన్నివేశం చేయలేదు. అంతెందుకు నాన్నకు ప్రేమతో సినిమాలో కూడా అలాంటి సన్నివేశం కూడా లేదు .. కానీ ఈ సినిమాలో యాదృచ్చికంగా ఆ సంగతి జరిగి నాన్నను కోల్పోవడం బాధాకరం. నిజంగా అయన గోల్డ్ లాంటి వ్యక్తి. ఆయనను కోల్పోవడం మాకు తీరని లోటు. 

ఎమోషన్ గా కనెక్ట్ .. 

నిజమే .. నా జీవితంలో ఓ గొప్ప పాట అది. దానికి తోడు ఎమోషనల్ గా మేము బాగా కనెక్ట్ అయ్యాము .. ఆ పాట మేల్ అండ్ ఫీమేల్ వాయిస్ లో ఉంటుంది .. నాన్న మిస్ అవ్వడం ఆయన కోసమే ఈ పాట వచ్చిందా అన్న ఫీలింగ్ కలిగింది. మొత్తానికి అరవింద సమేత నా ఎమోషన్స్ ని టచ్ చేసింది. నిజమే .. మన జీవితం క్షణికం .. ఎప్పుడు ఏమవుతుందో చెప్పలేం .. నాన్న విషయం చూస్తే .. క్షణాల్లో మొత్తం జరిగిపోయింది. మనం కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాం .. జీవితం ఎప్పుడు ముగుస్తుందో చెప్పలేం. అందుకే ఉన్నంతలో హాయిగా బ్రతకాలి, మంచి తండ్రిగా, మంచి కొడుకుగా, మంచి అన్నగా, మంచి తమ్ముడిగా, మంచి నటుడిగా అదే నా ఆలోచన. ఇది వైరాగ్యం కాదు నిజం. ఇక్కడ ఏది మనకు శాశ్వతం కాదు .. అందుకే ఉన్నంతలో సంతృప్తిగా బతకాలి. సిక్స్ ప్యాక్ కోసం లేదు, మామూలుగానే చేశాను .. ప్రత్యేకంగా ఓ ట్రైనర్ ను పెట్టుకున్నాను. నిజానికి జై లవకుశ తరువాత మళ్ళీ బరువు పెరిగాను, ఓసారి బరువు చూసుకుంటే 80 కిలోలు పెరిగాను బాబోయ్ .. ఇంత వెయిట్ పెరిగానా అని జిమ్ లో కుస్తీలు పట్టాను .. పైగా ఈ సినిమా కోసం ఫిజిక్ ఫిట్ గా ఉండాలని త్రివిక్రమ్ చెప్పడంతో దానికోసం కష్టపడ్డా. 

రామ్ చరణ్ తో ... 

చరణ్ నేను బెస్ట్ ఫ్రెండ్స్ .. ఇద్దరం కలిసి సినిమా నచ్చే చేస్తున్నాం . ముఖ్యంగా ఇక్కడ హీరోల మధ్య  అంతరాలను తగ్గించాలన్నది నా ప్రయత్నం. దాని గురించి రాజమౌళిని అడగండి, ఎప్పుడు ప్రారంభమో ఆయననే అడగండి .. ఇక మహేష్, చరణ్ లతో మంచి అనుబంధం ఉంది. మంచి కథ , దాన్ని డీల్ చేసే దర్శకుడు దొరికితే సినిమా తప్పకుండా చేస్తాం. 

తదుపరి సినిమాలు .. 

అశ్వినీదత్ తో అయితే సినిమా ఉంది .. కానీ దానికి అట్లీ దర్శకుడా, కాదా అన్నది తెలియదు. నేను ముందుగా ఏది ప్లాన్ చేసుకోను, ఎందుకంటే ఒక సినిమా విడుదల తరువాత ఈక్వేషన్స్ మారిపోతాయి. ప్రస్తుతానికైతే రాజమౌళి సినిమా ఉంటుంది. 

Aravinda Sametha Interview- Young Tiger NTR:

NTR about Aravinda Sametha Veera Raghava Movie

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement