Advertisement

హద్దులు దాటని గ్లామరైతే ఓకే: 'దర్శకుడు' ఈషా

Sat 29th Jul 2017 09:05 PM
darshakudu,eesha,eesha talks about darshakudu movie,darshakudu movie heroine,eesha actress interview  హద్దులు దాటని గ్లామరైతే ఓకే: 'దర్శకుడు' ఈషా
Darshakudu Movie Heroine Eesha interview హద్దులు దాటని గ్లామరైతే ఓకే: 'దర్శకుడు' ఈషా
Advertisement

దర్శకుడు చిత్రంలో నటించే అవకాశం రావడం నా అదృష్టం! 

అంతకు ముందు..ఆ తర్వాత, అమీతుమీ చిత్రాలతో నాయికగా గుర్తింపు తెచ్చుకున్న  ముద్దుగుమ్మ ఇషా. ఈమె కథానాయికగా నటిస్తున్న తాజా చిత్రం దర్శకుడు. హరిప్రసాద్ జక్కా దర్శకుడు. సుకుమార్ రైటింగ్స్ పతాకంపై సుకుమార్, బీఎన్‌సీఎస్‌పీ విజయ్‌కుమార్, థామస్‌రెడ్డి ఆదూరి, రవిచంద్ర సత్తి నిర్మిస్తున్నారు. ఆగస్ట్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఇటీవల కథానాయిక ఈషా పాత్రికేయులతో తన మనోభావాల్ని పంచుకుంది. ఆమె చెప్పిన సంగతులివి..

మనసుకు హత్తుకునే పాత్ర..

ఈ సినిమాలో నేను ఫ్యాషన్ డిజైనర్ నమ్రతా పాత్రలో కనిపిస్తాను. జీవితంలో తనకంటూ ప్రత్యేకతను చాటుకోవాలనే తపన వున్న యువతిగా నా పాత్ర చిత్రణ సాగుతుంది. ఓ ఔత్సాహిక సినీ దర్శకుడితో ఆమె పరిచయం ప్రేమకు ఎలా దారితీసింది? ప్రేమ ప్రయాణంలో వారిద్దరికి ఎదురైన అనుభవాలేమిటి? వృత్తిపరమైన లక్ష్యాలు,  ప్రేమ మధ్య వారు ఎటువంటి సంఘర్షణను ఎదుర్కొన్నారు? అనే అంశాల సమాహారంగా చిత్ర కథ నడుస్తుంది. నేటి యువతరంతో పాటు కుటుంబ ప్రేక్షకుల్ని సైతం మెప్పించే అందమైన ప్రేమకథగా ప్రతి ఒక్కరి హృదయాల్ని హత్తుకుంటుంది.

జానపద నృత్యం చేశాను...

నేను ఇప్పటివరకు చేసిన చిత్రాలకు పూర్తి భిన్నంగా నా పాత్ర వుంటుంది.  ప్రతి పనిలో ఉత్సాహం ప్రదర్శించే ఈతరం చలాకీ అమ్మాయిగా కనిపిస్తాను. ఒక మాస్ పాటలో జానపదనృత్యం చేయడం సరికొత్త అనుభూతినిచ్చింది. సుకుమార్‌గారి సంస్థలో పనిచేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమాలో నా నటన చాలా బాగుందని సుకుమార్‌గారు మెచ్చుకున్నారు. ఆయన మాటల్ని గొప్ప కాంప్లిమెంట్ గా అనుకుంటున్నాను.

హీరోని కొట్టాల్సి వచ్చింది...

కథానుగుణంగా రెండు సందర్భాల్లో హీరోని చెంపదెబ్బ కొట్టాల్సి వచ్చింది. అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో సినిమా చూస్తే అర్థమవుతుంది. నిజజీవితంలో ఇప్పటివరకు నేను ఏ అబ్బాయిని చెంపదెబ్బ కొట్టలేదు (నవ్వుతూ). సినిమా నేపథ్యంలో దర్శకుడు చిత్ర కథ సాగినప్పటికీ ఇందులో సినిమా కష్టాలు వుండవు. ఓ ఔత్సాహిక దర్శకుడి  ప్రేమాయణానికి దర్పణంలా వుంటుంది. ప్రస్తుతం తెలుగు అమ్మాయిలకు పరిశ్రమలో మంచి అవకాశాలొస్తున్నాయి. ఇదొక శుభపరిమాణంగా భావిస్తున్నాను.

గ్లామర్ పాత్రలకు ఓకే...

పూర్తిస్థాయి కమర్షియల్ సినిమాల్లో నటించాలని వుంది. హద్దులు దాటని గ్లామర్ పాత్రలు చేయడానికి అభ్యంతరం లేదు. నటిగా నా ప్రతిభను ప్రదర్శించే ఛాలెంజింగ్ పాత్రల కోసం ఎదురుచూస్తున్నాను. ఫిదా చిత్రంలో భానుమతి పాత్ర బాగా నచ్చింది. నాకు ఆ సినిమాలో భానుమతి పాత్ర పోషించే అవకాశం వస్తే తప్పుకుండా చేసేదాన్ని.  ప్రస్తుతం కెరీర్ ఆనందంగా సాగిపోతున్నది. చాలా చిత్రాలు చర్చల దశలో వున్నాయి.

Darshakudu Movie Heroine Eesha interview:

Heroine Eesha Talks about Darshakudu Movie

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement