Advertisement

ఆ కల నెరవేరుతుందో.. లేదో: దిల్ రాజు

Fri 24th Jun 2016 09:30 PM
dil raju interview,rojulu marayi,maruthi,murali krishna  ఆ కల నెరవేరుతుందో.. లేదో: దిల్ రాజు
ఆ కల నెరవేరుతుందో.. లేదో: దిల్ రాజు
Advertisement

ఓ వైపు నిర్మాతగా భారీ చిత్రాలు నిర్మిస్తూనే... మరో వైపు డిస్ట్రిబ్యూషన్ రంగంలో మంచి తెలుగు చిత్రాల్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సమర్పకుడిగా... వరుస బ్లాక్ బస్టర్స్ కథలతో సూపర్ డూపర్ సక్సస్ లతో దూసుకుపోతున్న దర్శకుడు మారుతి కథ, స్క్రీన్ప్లే అందించగా.... మారుతి టాకీస్ బ్యానర్ లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సహనిర్మాణం లో రూపొందిస్తున్న చిత్రం రోజులు మారాయి. జి.శ్రీనివాసరావు నిర్మిస్తున్నఈ చిత్రంతో మురళీ కృష్ణ ముడిదాని దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జులై 1 న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా.. సమర్పకుడు దిల్ రాజుతో సినీజోష్ ఇంటర్వ్యూ..

మారుతి స్టయిల్ ఇష్టం..

మారుతి నన్ను కలిసి ఓ ఇదేనా చెప్పాడు. నాకు తన మీద చాలా నమ్మకం ఉంది. తన వర్కింగ్ స్టయిల్ నాకు నచ్చుతుంది. కాంపాక్ట్ బడ్జెట్ తీసుకొని హిట్ సినిమాలు తీస్తుంటాడు. ఈ సినిమా కథ చెప్పగానే నాకు బాగా నచ్చింది. అందుకే సమర్పకుడిగా వ్యవహరించాలనుకున్నాను. 

నలుగురి మధ్య జరిగే కథ..

ఓ నలుగురు మధ్య జరిగే కాన్సెప్ట్ ఈ సినిమా సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తరువాత ఏర్పడిన పరిస్థితులేంటి. ఇప్పటివరకు అబ్బాయిల కోణంలోనే సినిమాలు చేశారు. కానీ ఈ సినిమా అమ్మాయిల కోణంలో ఉంటుంది. అలా అని అమ్మాయిలను తప్పుగా చూపించలేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూపించాం. మారుతి డైలాగ్ వెర్షన్ తో ఫుల్ స్క్రిప్ట్ నా చేతిలో పెట్టిన తరువాత సినిమా మొదలుపెట్టాం. 

నాకు సమయం లేదు..

మంచి కాన్సెప్ట్ తో ఉండే చిన్న సినిమాలు చేయాలనుకున్నాను. కానీ నాకు అంత సమయం లేదు. ఇప్పుడు నా మ్యాన్ పవర్ పెరిగింది. అందుకే మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాలు చేస్తున్నాం. ఈ సినిమా అయితే బిజినెస్ యాంగిల్ లోనే చేశాం. నష్టమైనా, లాభమైనా మేమే భరించాలని నిర్ణయించుకున్నాం. అందుకే ప్రపంచవ్యాప్తంగా మేమే రిలీజ్ చేస్తున్నాం. 

మారుతిలానే డైరెక్ట్ చేశాడు..

భలే భలే మగాడివోయ్ సినిమా తరువాత మారుతి నెస్ట్ లెవెల్ కి వెళ్ళిపోయాడు. ఇలాంటి సినిమాలకు దర్శకత్వం వహించడానికి తనకు సమయం లేదు. అందుకే కథలు తనే రాసుకొని వేరే వ్యక్తులతో డైరెక్ట్ చేయిస్తున్నాడు. ఈ చిత్ర దర్శకుడు మురళి వంద శాతం కథకు న్యాయం చేశాడు. మారుతి ఎలా డైరెక్ట్ చేస్తాడో.. అలానే చేశాడు. 

అప్పుడప్పుడు రాంగ్ అవుతాయి..

నేను ప్రొడ్యూస్ చేసే సినిమాల మీద నాకు పూర్తి అవగాహన ఉంటుంది. ఆ సినిమా హిట్ అవుతుందో.. లేదో అనే విషయాలు నేను 90 శాతం జడ్జ్ చేయగలను. అయితే అప్పుడప్పుడు నా జడ్జిమెంట్ తప్పు అవుతుంది. కృష్ణాష్టమి సినిమాలా.. కానీ ఫ్లాప్ వచ్చిందని నేను ఎవరిని బ్లేమ్ చేయను. నా తప్పని ముందే ఒప్పేసుకుంటాను. 

ట్రెండ్ మారింది.. 

తెలుగు సినిమాల ట్రెండ్ మారింది. ప్రేక్షకులు అడ్వాన్స్ అయిపోయారు. చిన్న సినిమాల్లో మంచి సినిమాలొస్తే ఆదరిస్తున్నారు కానీ పెద్ద సినిమాలో కంటెంట్ లేకపోతే చూడట్లేదు. ప్రేక్షకుల దృష్టిలోనే సినిమాలు చేయాలి.

ఆ కోరిక మిగిలిపోతుందేమో..

పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేయాలనేది నా కోరిక. ఆ కోరిక అలానే మిగిలిపోతుందేమో అనిపిస్తుంది. నా ప్రయత్నాలు అయితే నేను చేస్తున్నాను. కానీ ఆయనతో సినిమా చేయొచ్చు.. చేయకపోవచ్చు. ఏ విషయమూ చెప్పలేను. 

స్క్రిప్ట్ రెడీ అవుతోంది..

దేవిశ్రీప్రసాద్ హీరోగా చేయాలనుకునే సినిమా స్క్రిప్ట్ రెడీ అవుతోంది. 

త్రివిక్రమ్ ఇష్టం..

త్రివిక్రమ్ తో సినిమా కూడా స్క్రిప్ట్ పనుల్లో ఉంది. ఆ సినిమాలో హీరో ఎవరనేది త్రివిక్రమ్ చాయిస్. ఆయన కథకు తగిన హీరోను సెలెక్ట్ చేసుకుంటారు. 

నాని సినిమా త్వరలోనే..

నాని హీరోగా త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో సినిమా ఆగస్టు లో ప్రారంభం కానుంది. డిశంబర్ నాటికి ఆ సినిమా రిలీజ్ చేయాలనుకుంటున్నాం.

పండగ సినిమా అది..

శతమానం భవతి సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 14 న రిలీజ్ చేయాలనుకుంటున్నాం. శర్వానంద్ హీరోగా కన్ఫర్మ్ అయ్యాడు. ఎట్టిపరిస్థితుల్లో సంక్రాంతికి విడుదల చేస్తాం. అదొక పండగ సినిమా అంటూ ఇంటర్వ్యూ ముగించారు. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement