Advertisement

సినీజోష్ ఇంటర్వ్యూ- సందీప్ కిషన్

Tue 22nd Mar 2016 11:11 PM
sandeep kishan interview,run movie,ani kanneganti  సినీజోష్ ఇంటర్వ్యూ- సందీప్ కిషన్
సినీజోష్ ఇంటర్వ్యూ- సందీప్ కిషన్
Advertisement
'ప్రస్థానం' సినిమాతో తెలుగు తెరకు పరిచయమయిన నటుడు సందీప్ కిషన్. ఆ తరువాత రొటీన్ లవ్ స్టోరీ, వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. ప్రస్తుతం తను నటించిన 'రన్' సినిమా మార్చి 23న  విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా హీరో సందీప్ కిషన్ తో సినీజోష్ ఇంటర్వ్యూ..
టైం ఆధారంగా జరిగే కథ..
తమిళం, మలయాళంలో ఘన విజయం సాధించిన 'నేరమ్' సినిమాకు రీమేక్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. మరాఠిలో కూడా ఈ సినిమాను రీమేక్ చేశారు. అక్కడ కూడా పెద్ద హిట్ అయింది. తెలుగులో 'రన్' పేరు మీద రిలీజ్ అవుతున్న ఈ సినిమా హిట్ అవుతుందని ఆశిస్తున్నాను. గుడ్ టైం, బ్యాడ్ టైం అనే అంశాలతో సినిమా నడుస్తుంటుంది. టైం బావుంటే మనం ప్రపంచానికి పరిచయమవుతాం.. లేదంటే ప్రపంచం మనకి పరిచయమవుతుంది. సినిమాలో ఉండే అన్ని క్యారెక్టర్స్ కి గుడ్ టైం, బ్యాడ్ టైం ఉంటుంది. ఇదొక ఫాస్ట్ బేస్డ్ ఫిలిం. సినిమాలో ప్రతి క్యారెక్టర్ పరిగెడుతూనే ఉంటుంది. అందుకే సినిమాకు 'రన్' అనే టైటిల్ పెట్టాం. ఒక రోజులో జరిగే కథ.
ప్రస్థానం తరువాత కథ చెప్పారు..
ప్రస్థానం సినిమా తరువాత అని కన్నెగంటి గారు నాకు 'మిస్టర్ నూకయ్య' సినిమా కథ చెప్పారు. అప్పుడే ఇండస్ట్రీకు వచ్చిన నాతో సినిమా చేయడానికి ప్రొడ్యూసర్స్ ఎవరు ముందుకు రాలేదు. మనోజ్ కి కథ నచ్చడంతో తనే హీరోగా చేశాడు. అప్పటినుండి సినిమా చేయాలనుకున్నాం. ఇప్పటికి కుదిరింది. 
రియలిస్టిక్ గా ఉండే క్యారెక్టర్..
ఈ సినిమాలో రియలిస్టిక్ గా జెన్యూన్ గా ఉండే పాత్రలో నటించాను. మన చుట్టు పక్కల ఉండే అబ్బాయి పాత్రలో కనిపిస్తాను. సినిమాలో కమర్షియాలిటీ, హీరోయిజం ఏమి ఉండవు. బాలీవుడ్ లో చేసిన 'షోర్ ఇన్ ద సిటీ' లాంటి పాత్ర ఈ సినిమాలో కూడా చేశాను. ఇంజనీరింగ్ పూర్తి చేసి సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసుకునే అబ్బాయికి సడెన్ గా ఉద్యోగం పోతుంది. ఆ తరువాత తను ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడనేదే సినిమా.
మంచి సినిమా అని చేశాం..
తెలుగు ప్రేక్షకులు కోరుకునే కొత్తదనం ఈ సినిమాలో ఉంటుంది. ఫైట్స్, సాంగ్స్ ఉండే కమర్షియల్ సినిమానే కాని రియలిస్టిక్ గా ఉంటుంది. మంచి కామెడీ ఎంటర్టైనర్ ఈ సినిమా. మంచి సినిమా చేయాలనే ఉద్దేశ్యంతో చేశాం. ఎమోషన్స్, టెన్షన్, కామెడీ సినిమాలో హైలైట్.
దాసరి గారు చేయాలనుకున్నారు..
నిజానికి ఈ సినిమా దాసరి గారు చేయాలనుకున్నారు. కాని సడెన్ గా నాకు అనిల్ సుంకర గారు ఫోన్ చేసి నటించమని అడిగారు. నేను ఇండస్ట్రీలో ప్రేమించే వ్యక్తి అనిల్ సుంకర. నేను కష్టాల్లో ఉన్నప్పుడు నన్ను ఆదుకున్నారు. ఆయన నటించమని అడిగితే మరో ఆలోచన లేకుండా ఒప్పేసుకున్నాను.
సినిమా ఫ్లాప్ అయిందనే బాధ ఉండదు కానీ..
రారా కృష్ణయ్య, జోరు సినిమాలతో షేక్ అయ్యాను. కానీ బీరువా, టైగర్ చిత్రాలతో ఎనర్జీ వచ్చింది. బీరువా కూడా మొదట ఫ్లాప్ అనే అనుకున్నాం గానీ మెల్లమెల్లగా పుంజుకొని యాభై రోజులు పూర్తి చేసుకుంది. ఆ సినిమా హిట్ టాక్ నాకు సర్ప్రైజింగ్ గా అనిపించింది. సినిమా ఫ్లాప్ అయిందని వచ్చే బాధ కంటే మాకు నచ్చిన సినిమా ప్రేక్షకులకు నచ్చలేదనే బాధ ఎక్కువ ఉంటుంది.
అనీషా చక్కగా నటించింది..
అనీషా స్వీట్ గర్ల్. ఎన్ని సార్లు రిహార్సల్స్ చేయడానికైనా రెడీగా ఉండేది. తెలుగమ్మాయి చాలా చక్కగా నటించింది. డైలాగ్స్ కూడా బాగా చెప్పింది.
కథలతో పాటు దర్శకులను కూడా నమ్ముతా..
ఇప్పటివరకు కథలను నమ్ముకొని సినిమాలను చేశాను. కథతో పాటు డైరెక్టర్ ను కూడా నమ్మి సినిమా చేయాలని నిర్ణయించుకున్నాను. ఈ సినిమా కూడా అలానే చేశాను. డైరెక్టర్ చెప్పింది.. బ్లైండ్ గా ఫాలో అయిపోయాను. ఒక్కసారి కూడా మానిటర్ చూడలేదు.
ప్రొడక్షన్ చేయాలనుంది..
షార్ట్ ఫిల్మ్స్ అయితే ప్రొడ్యూస్ చేశాను గానీ ఫీచర్ ఫిలిం చేసే స్తోమత లేదు. ఏదొక సమయంలో ప్రొడ్యూస్ చేసే ఆలోచన అయితే ఉంది.
పెళ్లి ఆలోచన లేదు..
అప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. ఇంట్లో కూడా పెళ్లి చేసుకోమని అడిగే ప్రెషర్ లేదు.
నెక్స్ట్ ప్రాజెక్ట్స్..
తెలుగులో ఒక్క అమ్మాయి తప్ప సినిమాలో నటిస్తున్నాను. అలానే తమిళంలో మయవన్, మా నగరం చిత్రాల్లో నటిస్తున్నాను. ఆ చిత్రాలను తెలుగులో కూడా రిలీజ్ చేస్తారు అంటూ ఇంటర్వ్యూ ముగించారు. 
Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement