Advertisement

రాజధానిని సింగపూర్‌కు తాకట్టుపెట్టాల్సిందేనా..?

Sun 04th Oct 2015 02:02 PM
ap capital,japan,singapur,investments  రాజధానిని సింగపూర్‌కు తాకట్టుపెట్టాల్సిందేనా..?
రాజధానిని సింగపూర్‌కు తాకట్టుపెట్టాల్సిందేనా..?
Advertisement

ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధి గురించి చంద్రబాబు తీవ్రంగా శ్రమిస్తున్నారు. లోటు బడ్జెట్‌లో ఉన్న రాష్ట్రంలో నూతన రాజధాని నిర్మాణానికి పెట్టుబడులు అంత సులభంగా రావన్న సంగతి తెలిసిందే. అందుకే ఆర్థికంగా పరిపుష్టిగా ఉన్న సింగపూర్‌, జపాన్‌ దేశాలను ప్రసన్నం చేసుకోవడానికి బాబు కృషి చేస్తున్నారు. అయితే లాభాపేక్ష లేకుండా ఏ దేశమూ మరో దేశంలో పెట్టుబడులు పెట్టదు. అందుకే క్యాపిటల్‌ సీడ్‌ ప్రాంతంలో 3 వేల ఎకరాలను తమకు కేటాయించాలని సింగపూర్‌ ఇప్పుడు డిమాండ్‌ చేస్తోంది. ఈ డిమాండ్‌కు ఏపీ తలొగ్గుతుందా..? లేదా..? అనే దానిపై ఇప్పుడు రాజధాని భవిష్యత్తు ఆధారపడి ఉంది.

క్యాపిటల్‌ సీడ్‌ ప్రాంతంలో 3 వేల ఎకరాలను సింగపూర్‌కు అప్పజెప్పడానికి ఏపీ ఒప్పుకోవడం లేదు. అలాకాకుండా రాజధాని నిర్మాణంలో పాలుపంచుకొని లాభాల్లో వాటాలు పొందాలని జపాన్‌, సింగపూర్‌లకు ఏపీ సర్కారు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. అయితే ఏపీలో నాలుగేళ్ల తర్వాత ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందో తెలియదని, అప్పుడు ఆ ప్రభుత్వం ఇప్పుడు చేసుకున్న ఒప్పందాలను పాటించకుంటే పరిస్థితి ఏంటన్నది ఇప్పుడు సమస్య. అలా కాకుంటే ఏపీలో పెట్టిన పెట్టుబడులకు కేంద్రం నుంచి గ్యారెంటీ ఇప్పించాలన్నది వారి డిమాండ్‌. కాని దీనికి కేంద్రం అంత సులువుగా ఒప్పుకోదన్నది కూడా వాస్తవమే. ఇప్పటికే రాజధాని నిర్మాణానికి భూముల సమీకరణ పెద్ద సమస్యగా మారింది. ఇప్పుడు పెట్టుబడులు కూడా అంత సులభంగా వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో బాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement