Advertisement

సినీజోష్ ఇంటర్వ్యూ-లావణ్య త్రిపాఠి!

Sat 29th Aug 2015 11:42 AM
lavanya tripathi,bhale bhale magadivoy,nani,maruthi  సినీజోష్ ఇంటర్వ్యూ-లావణ్య త్రిపాఠి!
సినీజోష్ ఇంటర్వ్యూ-లావణ్య త్రిపాఠి!
Advertisement

నాని, లావణ్య త్రిపాఠి జంటగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ సమర్పణలో జి.ఎ2, యు.వి.క్రియేషన్స్‌ బ్యానర్స్‌పై మారుతి దర్శకత్వంలో బన్నివాసు నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం 'భలే భలే మగాడివోయ్‌'.  ఈ చిత్రం సెప్టెంబర్‌ 4న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా హీరోయిన్‌ లావణ్య త్రిపాఠితో సినీజోష్  ఇంటర్వ్యూ... 

సినిమాలో క్యారెక్టర్.. 

ఈ సినిమాలో అమాయకమైన ఆడపిల్ల పాత్రలో కనిపించనున్నాను. కూచిపూడి డ్యాన్సర్‌ పాత్ర. చిన్నప్పుడు కథక్‌ డ్యాన్స్‌ను నేర్చుకున్నాను. కూచిపూడి డ్యాన్స్‌ కోసం సెట్‌లో ప్రతిరోజు అరగంట పాటు ప్రాక్టీస్ చేసేదాన్ని. చాలా ఎంజాయ్ చేస్తూ నటించిన సినిమా. అవుటండ్‌ అవుట్‌ ఎంటర్‌టైనింగ్‌ మూవీ ఇది.

అవకాశాలు వదులుకున్నా.. 

'అందాల రాక్షసి' సినిమా తరువాత  'దూసుకెళ్తా' సినిమా చేశా. ఆ తర్వాత కొంత గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ లో చాలా కథలు విన్నాను. అన్ని కథలు 'అందాల రాక్షసి' తరహా పాత్రలే. చేసిన పాత్రలే మళ్ళీ చేయడం ఇష్టం లేక ఆ అవకాశాలు వదులుకున్నా. ఏదో సినిమాలు చేసేయాలి కదా అనుకోను. మంచి రోల్స్‌ కోసం వెయిట్‌ చేశాను. ఇప్పుడు నాలుగు సినిమాలు చేస్తున్నాను. ప్రతి క్యారెక్టర్‌ దేనికదే డిఫరెంట్‌గా ఉంటుంది. ఈ నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నాను. ఈ సినిమాల తర్వాత కుదిరితే ఒకవారం పాటు గ్యాప్‌ తీసుకోవాలనుకుంటున్నాను. 

నాకు నచ్చితే చిన్న క్యారెక్టర్ లో అయినా నటిస్తా... 

నాకు నచ్చితే చిన్న క్యారెక్టర్స్‌ అయినా చేయడానికి సిద్ధం. ఛైల్డ్‌ ఎడ్యుకేషన్‌పై చేసిన ఓ షార్ట్‌ ఫిలింలో కూడా నటించాను. మనంలో గెస్ట్‌ అప్పియరెన్స్‌ చేశాను. నేను చేసే పాత్ర నాకు నచ్చాలి. అవకాశాలు లేవని ఎప్పుడూ బాధపడలేదు.

సెట్ లో నన్ను తమ్ముడు అనేవారు.. 

మారుతి గారు సెట్‌లో నన్ను తమ్ముడు అని పిలిచేవారు. సెట్‌ లో వాతావరణం అంతా చాలా సందడిగా ఉంచుతారు. అలాగే సినిమాలో నటీనటుల నుండి ఎలాంటి అవుట్‌ పుట్‌ కావాలో దాన్ని రాబట్టుకుంటారు.

ఆయనతో కలిసి నటించాలనుకున్నాను.. 

నాని మంచి నటుడు. తను నటించిన 'ఈగ' సినిమా చూశాను. తను ఉన్నది కాసేపే అయినా చాలా పెద్ద ఇంపాక్ట్‌ చూపించాడు. ఆ సినిమా చూసినప్పుడే ఆయనతో కలిసి ఓ సినిమాలో నటించాలనుకున్నాను. ఆ అవకాశం చాలా తొందరగా వచ్చింది. కొత్త హీరోలా ప్రతి సీన్‌ను ఎలా చేశానో చూసుకుంటుంటాడు.

ఆయన చాలా సపోర్ట్‌ చేశారు.. 

నాగార్జునగారు ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వంగల వ్యక్తి. చాలా కూల్‌గా ఉంటారు. అలాగే నేను రమ్యకృష్ణగారికి పెద్ద అభిమానిని. ఆమెతో కూడా కలిసి నటించడం చాలా సంతోషంగా ఉంది. షూటింగ్‌ టైమ్‌లో డైలాగ్స్‌ విషయంలో ఆవిడ నాకు బాగా హెల్ప్‌ చేశారు. 

వారి మనస్సులో ఇంకా మిథునగానే ఉన్నా.. 

'అందాల రాక్షసి' సినిమా ఎంత ప్లస్ అయిందో.. ఓ రకంగా మైనస్‌ కూడా అయింది. ఎందుకంటే అందులో నేను చేసిన మిథున క్యారెక్టర్‌ను ప్రేక్షకులు బాగా ఇష్టపడ్డారు. వారి మనస్సుల్లో ఇంకా మిథునగానే ఉన్నాను. నన్ను గ్లామర్‌ రోల్స్‌లో వారు ఉహించుకోలేకపోతున్నారు. ఆ మార్క్‌ పోవాలంటే కొంత సమయం పడుతుంది. 

తెలుగుకే నా ప్రయారిటీ.. 

ప్రస్తుతం బాలీవుడ్ సినిమాల్లో చేయాలని ప్రయత్నాలు చేయడం లేదు. ఒకవేళ చేసినా తెలుగు ఇండస్ట్రీని మాత్రం వదులుకోను. తమిళంలో కూడా అప్పట్లో బ్రహ్మ సినిమా చేశాను. ఆ తర్వాత తమిళం, కన్నడ, మలయాళ సినిమాల అవకాశం వచ్చినా నేను తెలుగువైపే మొగ్గు చూపాను. 

నెక్స్ట్ ప్రాజెక్ట్స్‌... 

నాగార్జునగారితో సొగ్గాడే చిన్ని నాయనా, లచ్చిందేవికి ఓ లెక్కుంది, అల్లుశిరీష్‌తో గీతాఆర్ట్స్‌ బ్యానర్‌లో మరో మూవీ చేస్తున్నాను. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement