Advertisement

ఇలా అయితే అంతర్యుద్ధాలు వస్తాయి: పవన్ కళ్యాణ్

Tue 07th Jul 2015 04:53 AM
pawan kalyan,janasena party,kcr,chandrababu,andhrollu  ఇలా అయితే అంతర్యుద్ధాలు వస్తాయి: పవన్ కళ్యాణ్
ఇలా అయితే అంతర్యుద్ధాలు వస్తాయి: పవన్ కళ్యాణ్
Advertisement
>ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న జనసేన పార్టీ అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాన్ ఎట్టకేలకు ప్రెస్ మీట్ పెట్టి ప్రజల ముందుకు వచ్చాడు. గత నెల రోజులుగా రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాలపై తనదైన శైలిలో స్పందించాడు. క్యాష్ ఫర్ వోట్, సెక్షన్ 8, ఫోన్ ట్యాపింగ్ వంటి వాటిపై స్పందించలేదని తనపై వస్తున్న విమర్శలకు పవన్ ఈ ప్రెస్ మీట్ ద్వారా సమాధానం ఇచ్చాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "రాష్ట్రం విడిపోయాక అందరికి మాట్లాడే బాధ్యత ఉంది. ప్రతి రాజకీయనాయకుడు నోరు పారేసుకోవడం వల్ల ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. పవన్ పార్టీ పెట్టాడు కాని జరుగుతున్న సంఘటనలపై నోరు విప్పడం లేదని కొందరు రాజకీయనాయకులు అన్నారు. నాకు అవసరమైనప్పుడు మాత్రమే నోరు విప్పడం తెలుసు. నా అభిప్రాయాలు నాకున్నాయి. తెలుగు జాతి ఐక్యత కోసం కెసిఆర్ గారు తొలి అడుగు వేసారు. యాదాద్రి ఆర్కిటెక్ట్ గా విజయనగరం వాశిని నియమించారు. తెలుగు జాతి ఐక్యత కోసం తనవంతు కృషి చేస్తున్న తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ గారిని అభినందించాలి. నీతి, నిజాయితీలు ఉన్న రాజకీయాలే కనిపించడం లేదు. కంట్లో దూలాలు పెట్టుకొని ఎదుటవారి కళ్ళలో నలుసులు చూస్తున్నారు. ప్రతి పార్టీకు సమస్యలున్నాయి. ఫోన్ ట్యాపింగ్ చాలా సీరియస్ గా తీసుకోవాలి. ఇద్దరు ముఖ్యమంత్రులకు బాధ్యతలున్నాయి. ప్రజల అవసరాలు తీర్చాల్సిన వారు పొలిటికల్ గేమ్స్ ఆడుతున్నారు. కోర్ట్ కేసులు, సి.బి.ఐ కేసులని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఫోన్ ట్యాపింగ్ నిజమో కాదో తేలాల్సివుంది. నిజమని తెలిస్తే ఖచ్చితంగా శిక్షను అమలు చేయాలి. ఒకరిపై ఒకరు ట్యాపింగ్ చేసుకుంటుంటే ప్రజల్లో అలజడి రగులుతుంది. సయోధ్యతో పనిచేయాల్సిన ప్రభుత్వాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడితే అంతర్గత, శాంతి భద్రతల సమస్యలు ఏర్పడతాయి. ఆంధ్రోళ్లు, సెటిలర్స్ అనే పదాలు బాధ్యత గల పదవుల్లో ఉన్నవారు ఉపయోగించకూడదు. ఎవరితోనూ నాకు వ్యక్తిగత విభేదాలు లేవు. సిద్ధాంత పరమైన విభేదాలున్నాయి. ఆంధ్రోళ్లు అని తిట్టడం సరికాదు. చంద్రబాబు ను తిట్టండి.. నన్ను తిట్టండి.. ఆంధ్రోళ్లు అని అనొద్దు. అనేక మతాల, కులాల సమ్మేళనం ఆంధ్రోళ్లు. కులాల గురించి మాట్లాడడం నాకు నచ్చదు కాని రాజకీయాలలోకి వచ్చాక తప్పట్లేదు.  విభజన తరువాత కేంద్రం ఆంధ్రప్రదేశ్ ని పట్టించుకోవట్లేదు. ఏ.పి కు చాలా అన్యాయం జరిగింది. ప్రస్తుత పరిస్థితుల్లో సెక్షన్ 8 అమలు సరికాదు. నేను సెక్షన్ 8 అమలుకు వ్యతిరేకిని. రెండు రాష్ట్రాల మధ్య సమైక్యత తీసుకురావాలి. సెక్షన్ 8 పై చర్చకు కారణం కెసిఆర్ గారే. ఈ విషయంపై వివరణ ఇవ్వాల్సిన అవసరం ఆయనకుంది. రెండు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారానికి ఎన్డీయే, యూపియే సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయాలి. ఆ కమిటీను పిఎమ్ వోకు అనుసంధానం చేయాలి. ఓ అధికారిని కమిటీ బాధ్యతలు అప్పగించాలి. మీడియా స్వేచ్చను హరించొద్దు. దీనివల్ల వాస్తవాలు బయటకు రాకుండా ఆపలేరు. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని. హైదరాబాద్ లోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టొద్దు. ఏ.పి పాలకులు అన్యాయాన్ని దిగమింగుకోవాలి. కేంద్రం చేసిన అన్యాయానికి మనం గొడవలు పెట్టుకోవడం సరికాదు. తెలంగాణా అనేది ప్రత్యేక రాష్ట్రమే కాని ప్రత్యేక దేశం కాదు. మాటలను అదుపులో పెట్టుకోకపోవడం వలనే ఈ సమస్యలన్నీ.. అదుపులో పెట్టుకోకపోతే శ్రీలంక తరహాలో జాతి పోరాటాలు వస్తాయి. తెలంగాణా అమరవీరుల త్యాగాన్ని మర్చిపోవద్దు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు విలువైన సమయాన్ని వృధా చేసాయి. ప్రత్యేక హొదా ఇస్తామని చెప్పిన ఏ ఒక్కరు మాట్లాడట్లేదు. సీమాంధ్ర ఎంపీలు కూడా సీరియస్ గా తీసుకోలేదు. అందరూ వ్యాపారవేత్తలు కావడం వలనే మాట్లాడట్లేదు. సీమాంధ్ర ఎంపీలకు పౌరుషం లేదా..? తెలంగాణా ఎంపీలలా సమస్యను ముందుకు తీసుకువెళ్ళలేకపోయారు. బి.జె.పి ఎంపీలు కూడా ఏం మాట్లాడట్లేదు. ఎంపీలు పార్లమెంట్ కు వెళ్లి గోడలు చూస్తున్నారు. అడిగే దైర్యం లేకపోతే రాజీనామా చేయండి. అంతేకాని ప్రజల సమస్యలతో ఆడుకోవద్దు. తెలంగాణా ఉద్యమాన్ని స్పూర్తిగా తీసుకొని ప్రత్యేక హొదా కోసం పోరాటం చేయండి. మీ చేతకాని తనానికి రాష్ట్రం బలైపోతుంది. సీమాంధ్ర ఎంపీలంతా వ్యాపారం కోసమే రాజకీయాలలో ఉంటే దయచేసి రాజీనామా చేయండి" అని తన ఆవేదన వ్యక్తం చేసారు. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement