Advertisement

సినీజోష్ ఇంటర్వ్యూ- రానా(బాహుబలి)

Tue 07th Jul 2015 04:02 AM
rana,ballaladeva character,rajamouli,bahubali movie  సినీజోష్ ఇంటర్వ్యూ- రానా(బాహుబలి)
సినీజోష్ ఇంటర్వ్యూ- రానా(బాహుబలి)
Advertisement

'ఇండియన్‌ అవతార్‌’, ఇండియన్‌ బిగ్గెస్ట్‌ మోషన్‌ పిక్చర్‌ ఈ మాటలన్నవీ మన దర్శకుడు కాదు రాజమౌళి కలల ప్రపంచం మహిష్మతిని చూసి ఇతర భాషా చిత్రాల దర్శక, నిర్మాతులు చెప్పినవే. ఇండియన్‌ బిగ్గెస్ట్‌ బడ్టెట్‌ మూవీగా, హై టెక్నికల్‌ వాల్యూస్, విజువల్స్‌తో తీసిన చిత్రం ‘బాహుబలి’ గురించి తెలుగు సినిమాకి లభిస్తున్న ఆదరణ అపూర్వం. యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ను అమరేంద్ర బాహుబలిగా తెరపై చూపించడానికి దర్శక ధీరుడు రాజమౌళి మూడేళ్ల ప్రయత్నమే ‘బాహుబలి’. హీరోయిజాన్ని హైరేంజ్‌లో ఎలివేట్‌ చేసే రాజమౌళి, విలనిజాన్ని అంతకంటే ఎక్కువగానే తెరపై ఆవిష్కరిస్తాడు. బాహుబలి వంటి ధీరుడుకి సరిజోడు భల్లాలదేవ. ఆ రేంజ్‌ విలనిజాన్ని చూపించగల ప్రతినాయకుడు. తనకి దేవుడంటే నమ్మకం లేదు..కానీ ఆరాధన నమ్ముతాడు..ఎందుకంటే తనని తాను దేవుడని నమ్ముతాడు..ఇదే భల్లాలదేవ క్యారెక్టర్‌ అని అంటున్నాడు రానా. భల్లాలదేవగా తెలుగు తెరపై పవర్‌ఫుల్‌ విలనిజాన్ని చూపించడానికి జూలై 10న ‘బాహుబలి’ చిత్రంతో మన ముందుకు రానున్న రానాతో సినీజోష్ ఇంటర్వ్యూ...

36 కిలోలు పెరిగాను

బాహుబలి’ షూటింగ్‌కి వెళ్లే ముందు ఆరు నెలు పాటు ట్రైనింగ్‌ తీసుకున్నాం. షూటింగ్‌ వెళ్లడానికి ముందు 86 కిలోు ఉన్న నేను షూటింగ్‌ టైమ్‌ వచ్చేసరికి 122 కిలోయ్యాను. 36 కిలోు వెయిట్‌ పెంచాను. రోజుకి ఆరుసార్లుఎనిమిదితొమ్మిదిసార్లు ఇలా విపరీతంగా తిని దానికి తగిన విధంగా ఎక్సర్‌సైజ్‌ు చేసేవాడిని. మూడేళ్లు అదే వెయిట్‌ చేయడం అంటే మామూలు విషయం కాదు. డైట్‌ విషయంలో చాలా జాగ్రత్తు తీసుకున్నాం.

ఇండియన్‌ వార్‌ మూవీ..ట్రైనింగ్‌ అవసరం

పీటర్‌హెయిన్స్‌ వియత్నాం నుండి ముగ్గురు ఫైట్‌ మాస్టర్స్‌ను సన్‌తన్‌క్‌ను తీసుకొచ్చి ట్రైనింగ్‌ ఇచ్చారు. ఇదొక ఇండియన్‌ వార్‌ ఫిలిం అందుకని స్క్రీన్‌పై చూపించానుకునే వార్‌ సీన్స్‌ మనకు తగిన విధంగా రియాల్టికీ దగ్గరగా ఉండేలా ప్లాన్‌ చేశారు. వెపన్స్‌ను రీమాడ్యుల్‌ చేశారు. ఈ సినిమాలో నా ఆయుధం గద. దగ్గరగా చూడటానికి గదలా ఉండిదూరంగా చూడటానికి చైన్‌లా కనపడుతుంది. ప్రతిసీన్‌కి తగిన విధంగా ఆరు రకా వెపన్స్‌ను యూజ్‌ చేశాం. అలాగే డైలాగ్‌ చెప్పేటప్పుడు తొగుతో పాటుతమిళంలో కూడా చెప్పాలి. తమిళ డైలాగ్స్‌ను ఇంగ్లీష్‌లో రాసి పంపారు. అవి గ్రాంధిక తమిళంలో ఉండటం వ్ల చదువుతున్నప్పటికీ నాకు అర్థం కాలేదు. ఆ డైలాగ్స్‌ రాసిన వైరముత్తు తనయుడు మదన్‌ కర్కేను కాంటాక్ట్‌ చేసి తను రాసిన డైలాగ్స్‌ను చదివి కూడా వినిపించమని చెప్పాను. తీరా ఒక రిథమ్‌లో డైలాగ్స్‌ నేర్చుకుని వచ్చిన తర్వాత డైలాగ్స్‌ మార్చేశారు. దాంతో నేను యూనిట్‌ను తమిళంలో మాత్రం నేను డైలాగ్స్‌ చేప్పే విషయంలో కొద్దిగా పర్మిషన్‌ తీసుకుని ఎలాగలాగో మేనేజ్‌  చేసేశాను. ఇలా చేయడం వ్ల షూటింగ్‌ వెళ్లేటప్పటికీ అన్నీ సిచ్యువేషన్స్‌ మా కంట్రోల్‌కి వచ్చాయిలేకుంటే ఇలాంటి సినిమాని చేయడం సువుకాదు.

ఇలాంటి సినిమా మళ్లీ నా కెరీర్‌లో చేస్తానో లేదో

రాజమౌళిప్రభాస్‌ సినిమా చేస్తున్నారని విన్నాను కానీ ఏ సినిమాఏంటని తెలియలేదు. ఒకరోజు శోభుగారు మా ఇంటికి వచ్చి రాజమౌళిగారు చేయబోయే సినిమాలో విన్‌ క్యారెక్టర్‌ ఉందిదాన్నొక హీరో చేస్తే బావుంటదని అన్నారు. రాజమౌళిగారు కథ వినగానే నేను సార్‌ ఎగ్జైట్‌మెంట్‌తో ఎక్కడ ఎస్‌ చెప్పేస్తానో కొంచెం ఆలోచించుకునే సమయం కావాన్నాను. నేను సినిమా వాతావరణంలో పెరిగాను. చిన్నప్పట్నుంచి ట్రాయ్‌, 300 వంటి సినిమాు చూసినప్పుడు మనకు ఇంత మంచి కథున్నాయి మనమెందుకు తీయలేమని అనుకునేవాడిని అలాంటి నాకు ఇలాంటి కథ చెప్పినప్పుడు సినిమా వెంటనే చూసేయాలి అనుకున్నాను. గతంలో ఎన్టీఆర్‌గారు,ఎ.ఎన్‌.ఆర్‌గారు చేసిన పురాణ సినిమాన్నీ తొగు సినిమా నిర్మాణంలో పార్ట్స్‌. సాధారణంగా నేను రాజ్యాురాజుకు సంబంధించిన కథున్న సినిమాన్నీ ముందు చూస్తుంటాను. ఎందుకంటే అటువంటి సినిమాు మనల్ని ఒక లోకంలోకి తీసుకెళ్లి వాటితో పాటు ట్రావెల్‌ చేయిస్తాయి. నాకు చిన్నప్పట్నుంచి ఇలాంటి సినిమాలే ఫేవరేట్‌ జోనర్‌ మూవీస్‌. రాజమౌళిగారు ఈ కథను గంటన్నరపాటు చెప్పారు. అలా చెప్పేటప్పుడు కథకు సంబంధించిన పిక్చర్స్‌ అన్నీ చూపిస్తూ ఎక్స్‌ప్లెయిన్‌ చేశారు. అలా చెప్పేటప్పుడు మనల్ని ఆయన ఆ కథలోకి తీసుకెళతారు. అలా చెప్పినప్పుడు ఇటువంటి సమయంలో ఈ సినిమా చేయడం కరెక్టా కాదాఅని ఆలోచించాను. రాజమౌళిగారిని కూడా అదే విషయం అడిగితే ఆయన నేను నీకు కథఅందులో నీ క్యారెక్టర్‌ చెప్పాను...నిర్ణయం నీదే అన్నారు. ఇలాంటి పీరియాడిక్‌ సినిమా మళ్లీ నా సినీ కెరీర్‌లో వస్తుందామళ్లీ చేస్తానో లేదోఅని ఆలోచించాను. వెంటనే ఆయన దగ్గరకెళ్లి ఓకే చెప్పాను.

భల్లాలదేవ క్యారెక్టర్‌

భల్లాలదేవ క్యారెక్టర్‌ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. దేవుణ్ణి నమ్మడు కానీ ఆరాధనను నమ్ముతాడు. ఎందుకంటే తనని ఒక దేవుడిలా భావిస్తుంటాడు. భల్లాలదేవుని వైపు నుండి చూస్తే అతను చేసిందే కరెక్ట్‌. ఈ సినిమాలో గ్రే క్యారెక్టర్స్‌ చాలా ఉంటాయి. పవర్‌ కోసంరాజ్యం కోసం అలా జరిగి ఉంటుందేమో అనేలా సినిమా నడుస్తుంది. బాహుబలిభల్లాలదేవ ఇద్దరూ తాము ఎంచుకున్న బాటను బాగా నమ్ముతారు. ఈ సినిమాకి ముందు నా క్యారెక్టర్‌ గురించి పూర్తిగా చెప్పినాకు సంబంధించిన డాక్యుమెంట్‌ను చదవమని చెప్పి పూర్తిగా ఇన్‌వాల్వ్‌ చేయించారు. రాజమౌళిగారు చెప్పే విధానంయాక్టర్స్‌ నుండి నటనను రాబట్టుకునే తీరు అద్భుతం. అందుకే రాజమౌళి సినిమాలోని క్యారెక్టర్స్‌ ఆడియెన్స్ కి అద్భుతంగా అనిపిస్తాయి.

చిన్నపాటి గర్వముండేది

ఎవరూ చేయని ఒక సినిమా చేస్తున్నామని ఒక చిన్నపాటి గర్వముండేది. ఇప్పుడు ఆలోచిస్తే ఇంత పెద్ద సినిమాని ఎలా చేశామా అని అనిపిస్తుంది. రెండు వే మంది ఆర్టిస్టుతో పెద్ద వార్‌ సీక్వెన్స్‌ చేశాము.

నా విగ్రహం చూసి షాకయ్యాను

పీటర్‌ ఫైట్‌ మాస్టర్‌ పీటర్‌  హెయిన్స్‌ ఫైట్‌ మాస్టర్‌ కాదు..ఫైట్‌ ఇంజనీర్‌. ప్రతి యాక్షన్‌ సన్నివేశాన్ని అద్భుతంగా డిజైన్‌ చేశారు. ఇందులో నా విగ్రహం ఎత్తు 130 అడుగు ఉంటుంది. ఎనిమిదిన్నర టన్ను వెయిట్‌ ఉండేది. ఆ విగ్రహాన్ని నిబెట్టడానికి నాుగు ఇండస్ట్రీ క్రేన్స్‌ పీటర్‌గారి ఆధ్వర్యంలో పనిచేశాయి. విగ్రహం నిబెట్టే సన్నివేశానికి పన్నెండు రోజు సమయం పట్టింది. చివరికి అంత పెద్ద విగ్రహం చూడగానే షాకయ్యాను.

ఆరోజు నేను పడ్డ  కష్టాన్నే మరచిపోయాను

వార్‌ సీక్వెన్స్ ను చలికాంలో చేద్దామని ముందు ప్లాన్‌ వేసుకున్నాం. అయితే మధ్యలో ప్రభాస్‌ భజానికి ఆపరేషన్‌ జరగడంనాకు మోకాలి దగ్గర గాయం అవడంతో దాదాపు మూడు నెలు ఆ పార్ట్‌ను పోస్ట్‌ పోన్‌ చేశారు. చివరికి మండు వేసవిలో వార్‌ సీక్వెన్స్‌ చేయాల్సి వచ్చింది. నాకోసంప్రభాస్‌ కోసం రాజమౌళిగారు రాజస్థాన్‌ నుండి ప్రత్యేకంగా గుర్రాలను తెప్పించి వాటిని ట్రైన్‌ చేసినా అవి మొరాయించేవి. వార్‌ సీక్వెన్స్‌లో రథంపై వెళ్లే సన్నివేశాన్ని చిత్రీకరించడానికి ఉదయం పదకొండు గంట నుండి ఆరు గంట వరకు సమయం పట్టింది. ఏంటి ఒక షాట్‌ కోసం ఇంత టైమ్‌ పట్టిందే అని అనుకున్నాను. తీరా ఆ సీన్‌ను మోనిటర్‌లో చూడగానే ఎక్సలెంట్‌గా అనిపించి అప్పటి వరకు పడ్డ కష్టాన్నంతా మరచిపోయాను.

ఇప్పుడు తలుచుకుంటే భయమేస్తుంది

వార్‌ సీక్వెన్స్‌ టైమ్‌లో రెండు వే మందికి పైగా ఆర్టిస్టు పనిచేసేవారు. రోజు ఎవరికో ఒకరికి గాయాలవుతుండేవి. మా సెట్‌లో అంబులెన్స్‌ సైరన్‌ వినిపించేది. అమ్మ ఈరోజు మనం కాదు..అని అనుకునే వాడిని. ఓ వార్‌ సీక్వెన్స్ లో ఆరుగురితో ఫైట్‌ చేయాల్సి ఉంది. దాని కోసం ప్రాక్టీస్‌ చేస్తుండగా ఎలా జరిగిందో తెలియదు కానీ నా మోకాలికి గాయమైంది. నీ గార్డ్‌ పెట్టుకున్నప్పటికీ జరిగింది. ప్రభాస్‌ అయితే బావా దరిద్రం నిన్ను చేస్‌ చేస్తుంది. ఏమీ చేయలేం అన్నాడు. నెలరోజు పాటు బెడ్‌రెస్ట్‌ తీసుకోవాల్సి వచ్చింది. ఈ సినిమా విషయంలోనే కాదు. కృష్ణం వందే జగద్గురుమ్‌ టైమ్‌లో చేతి దగ్గర గాయమైంది. ఇలా చాలా గుర్తున్నాయి. చెప్పడం మరచిపోయాను కానీ ఈ సందర్భంలో చెప్పాలి..రాజస్థాన్‌ నుండి రాజమౌళిగారు తెప్పించిన గుర్రాలపై ట్రైనింగ్‌ తీసుకుంటున్నప్పుడు నేను ముందు వెళుతున్నానునా వెనుక ప్రభాస్‌ వస్తున్నాడు. గుర్రం వెళుతుంది... కంట్రోల్‌ కావడం లేదు. వెనుక నుండి ప్రభాస్‌ వెనుక నుండి తంతుంది చూసుకో అని అరుస్తున్నారు. ఏం చేయాలో తెలియక గుర్రాన్ని పక్కకి తిప్పాను. ఎలాగలాగో ఆపేశాను కానీ..నేను మాత్రం గాలిలో ఎగిరి కిందపడ్డాను. చిన్న గాయయ్యాయి. పడేటప్పుడు త ముందు నేలకు ఆనింది కాబట్టి ట్రైనర్‌ మాత్రం డాక్టర్‌ దగ్గరకి వెళ్లాల్సిందేనని డాక్టరు దగ్గరకి తీసుకెళ్లాడు. డాక్టర్‌ చెక్‌ చేసి చేసిన ఎక్సర్‌సైజుట్రయానింగ్‌బాడీ బిల్డింగ్‌ కారణంగానే చిన్నగాయాలతో తప్పించుకున్నావ్ లేకుంటే మినిమమ్‌ నాలుగు ఫ్రాక్చర్స్‌ అయ్యేవని అన్నారు. అవన్నీ ఇప్పుడు తుచుకుంటే భయమేస్తుంది.

ఆయన్ని చూసి ఇన్‌స్ఫైర్‌ అయ్యాను

నేను చెన్నైలో పుట్టి పెరిగాను. చిన్నప్పుడు కమల్‌హాసన్‌గారి నాయగన్‌’ సినిమా విడుదలైంది. ఆ సినిమాలో ఆయన వేసిన ముసలివాడి గెటప్‌ను పెద్ద కటౌట్‌గా చూశాను. ఆ టైమ్‌లో ఆయన మంచి ఏజ్‌లో ఉండేవారు. అలాంటాయన ముసలివాడిగా చేయడం చూసి ఆశ్యర్యపోయాను. ఆ గెటప్‌ చూసి ఇన్‌స్ఫైర్‌ అయ్యాను. కాబట్టి ఈ సినిమాలో నేను కూడా మిడిల్‌ ఏజ్‌లో నటించడానికి రెడీ అయిపోయాను.

అదృష్టంగా ఫీవుతాను

నేను ఇప్పటి వరకు చూసిన విలన్స్ రాజమౌళిగారు ఇప్పటి వరకు చేసిన సినిమాలోని విలన్స్ లో భల్లాదేవానే పవర్‌ఫుల్‌. ఇటువంటి సినిమా చేయడం అదృష్టంగా ఫీవుతాను.

ఆయనే ముందు ఆ మాటన్నారు

నాన్నగారు ఇటువంటి వరల్డ్‌ క్లాస్‌ మూవీని హిందీలోకి తీసుకెళితే బావుంటుంది. కరణ్‌జోహార్‌తో మాట్లాడమని అన్నారు. ఏ జవానీ హై దివాని చిత్రంలో నేను గెస్ట్‌ రోల్‌ చేసి ఉండటం వ్ల నాకు ఆయనతో పరిచయం ఉంది. దాంతో నేను ఆయనకి ఫోన్‌ చేసి సినిమా గురించి చెప్పాను. ఆయనైతే ముందు నువ్వు ముంబయ్‌ రా మాట్లాడుదాం అన్నారు. నేను వెళ్లి ఆయన్ను కలిసి కథ వినిపించాను. ఆయన నిజంగానే తీస్తున్నారాఅని అడిగారు. నేను కొన్ని ఫోటోస్‌ చూపించాను. ఇండియన్‌ అవతార్‌ లా ఉందన్నారు. అంతే కాకుండా ఇండియాస్‌ బిగ్గెస్ట్‌ మోషన్‌ పిక్చర్‌ అనే మాట ముందు ఆయన నోటి నుండే విన్నాను.

ఆయనలా చెప్పడం మరచిపోలేను

అమితాబ్‌ బచ్చన్‌గారు ట్రైలర్‌ చూసి ఆశ్చర్యపోయారు. ఎక్కడ తీస్తున్నారని వివరాు అడిగి తెలుసుకున్నారు. నాతో చాలా సేపు సినిమా గురించి మాట్లాడారు. ఈ సినిమా ముందు నేను చిన్నగా కనిపిస్తున్నానని అన్నారు. అంత పెద్ద నటుడు అలా చెప్పడం మరచిపోలేను.

నిర్మాతలు గ్రేట్‌

ఇటువంటి సినిమాు తీయాంటే ముందు నిర్మాతు ధైర్యంగా ఉండాలి. వారి ఫేస్‌లో ఎక్కడైనా ఆందోళన కనపడితే అది టోటల్‌ టీమ్‌పై ఎఫెక్ట్‌ చూపెడుతుంది. శోభుయార్లగడ్డప్రసాద్‌ దేవినేనిగారు ఆ విషయంలో చాలా గ్రేట్‌. శోభుగారే సెట్‌లో ఎక్కువగా ఉండేవారు. ఎప్పుడు చూసినా ఆయన నవ్వుతూ ఉండేవారు. ప్రభాస్‌ అయితే బావా ఇంకెవరో నిర్మాత డబ్బు ఖర్చు పెడుతున్నట్లు ఆయన చూడు ఎంత కూల్‌ ఉన్నాడో అనేవాడు. బాహుబలి అనే ఇంటర్నేషనల్‌ ప్రాజెక్ట్‌ చేస్తున్నామని నమ్మకంతో ఈ సినిమాని పూర్తి చేశారు.

నెక్స్ ట్‌ ప్రాజెక్ట్స్‌

ఈ సినిమా షూటింగ్‌ టైమ్‌లో ప్రభాస్‌ భుజం ఆపరేషన్‌తో హాస్పిటల్‌లో రెండు నెలు రెస్ట్‌ తీసుకున్నాడు. ఆ గ్యాప్‌లో నేను బేబి సినిమా చేశాను. ఇప్పుడు తమిళంలో బెంగళూర్‌ డేస్‌ మూవీ చేశాను. నా పార్ట్‌ అంతా పూర్తయిపోయింది. ఇక బాహుబలి పార్ట్‌ 2 40-50 శాతం పూర్తయింది. మిగిలిన దానికోసం మళ్లీ బాడీ బిల్డ్‌ చేయాలి. ఇది పూర్తయ్యాకే నెక్స్ ట్‌ ప్రాజెక్ట్‌ గురించి ఆలోచిస్తా.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement