Advertisement

టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా హైకోర్టు తీర్పు..!!

Fri 29th May 2015 05:42 AM
high court,mlc elections,mlas,trs  టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా  హైకోర్టు తీర్పు..!!
టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా హైకోర్టు తీర్పు..!!
Advertisement

ంధ్రప్రదేశ్‌లో కంటే కూడా తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. అందుబాటులో ఉన్న ఆరుస్థానాల కోసం 7 మంది పోటీలో ఉండటంతో ఎవరు గెలుస్తారనేది ఆసక్తికరంగా ఉంది. టీఆర్‌ఎస్‌ కచ్చితంగా నాలుగు స్థానాలు గెలిచే అవకాశం ఉన్నా.. ఐదుగురిని బరిలో దించింది. ఈ ఐదో సీటు గెలవాలంటే అటు కాంగ్రెస్‌గాని ఇటు టీడీపీగాని ఓటమి చెందాల్సి ఉంటుంది. మరోవైపు టీడీపీ, కాంగ్రెస్‌లనుంచి టీఆర్‌ఎస్‌లోకి జంప్‌ చేసిన ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుహక్కు తొలగించాలంటూ టీడీపీ నేతలు వేసిన పిటీషన్‌కు హైకోర్టులో చుక్కెదురైంది.

ఇతర పార్టీలనుంచి టీఆర్‌ఎస్‌లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఓటుహక్కు వినియోగించుకోవచ్చని హైకోర్టు స్పష్టంచేసింది. దీంతో టీఆర్‌ఎస్‌కు ఊరట దొరికింది. కాంగ్రెస్‌, టీడీపీలనుంచి  టీఆర్‌ఎస్‌లో చేరిన 7మంది ఎమ్మెల్యేలు కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించడానికి అర్హత సాధించినట్లే. మరోవైపు ఎన్నికలు రహస్య బ్యాలెట్‌ పద్ధతిలో సాగుతుండటంతో ఎవరు ఎవరికి ఓటు వేస్తారోనని టీడీపీ, కాంగ్రెస్‌ నాయకులు ఆందోళనకు గురవుతున్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలతో క్యాంపులు నిర్వహించడానికి వారు సిద్ధమవుతున్నారు.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement