Advertisement

పారితోషికం కోసం అగ్రతారల పర్మిషన్‌..!

Fri 15th May 2015 06:06 AM
telugu film industry,star heroes,remuneration,scams  పారితోషికం కోసం అగ్రతారల పర్మిషన్‌..!
పారితోషికం కోసం అగ్రతారల పర్మిషన్‌..!
Advertisement

సినిమా నిర్మాణమే వృత్తిగా పెట్టుకున్న పలువురు ప్రముఖ నిర్మాతలు చిత్ర నిర్మాణానికి స్వస్తి పలికి ఇతర రంగాలకు వలసపోయిన నేపధ్యంలో చిత్ర నిర్మాణంలో ఏ విధమైన అనుభవం లేనివారు చిత్ర నిర్మాణ రంగంలోకి వస్తున్నారు. కొత్తవారు రావడం ఆహ్వానించదగిన పరిణామమే. కానీ సినిమా అన్నది వ్యాపారం. ఇందులో ఎందరో ఎన్నో రకాలుగా పెట్టుబడులు పెడతారు. ఈ షో బిజినెస్‌లో పెట్టిన పెట్టుబడి తిరిగివస్తే లాభాలు గడిరచినట్లే. కానీ రకరకాల వృత్తులలో చేతికందిన మొత్తాన్ని ‘వైట్‌’ చేసుకోవడానికి కొందరు చిత్ర నిర్మాణాన్ని వేదికగా చేసుకుంటున్నారని ఆరోపణలు వెలువడుతున్నాయి. ఈ ప్రహసనంలో భాగంగా కొత్తగా కొనుగోలుదార్లు కూడా ప్రవేశిస్తున్నారు. థియేటర్లు ఖాళీగా వున్నా రికార్డు కలెక్షన్లు చెబుతున్నారు. అదేమంటే పబ్లిసిటీ అంటున్నారు. క్రేజీ కాంబినేషన్‌కొరకు కోట్లు వెదజల్లుతున్నారు. 

దీనివలన పరిశ్రమలోని ప్రతి ఒక్కరి పారితోషికం చుక్కలను చూస్తున్నాయని అంటున్నవారున్నారు. బ్లాక్‌మనీని వైట్‌ చేసుకోవడానికి ‘అడ్డా’గా చిత్ర నిర్మాణం తయారయిందన్న విమర్శలూ వున్నాయి. ముంబయి సినిమాని మాఫియా శాసించిన ఉదాహరణలున్నాయి. ఈ మాఫియా మరోపేరుతో మరో రూపంలో చిన్న సినిమాని చంపేస్తోంది. ‘కన్నడ కంఠీరవ’ రాజ్‌కుమార్‌, ‘నటరత్న’ ఎన్టీఆర్‌, ‘నటసామ్రాట్‌’ నాగేశ్వరరావు ‘నడిగరతిలకం’ శివాజీ మరియు ‘జూబ్లీ స్టార్‌’ ఎంజిఆర్‌ తమ పారితోషికం పెంచేముందు దర్శక నిర్మాతలను, పంపిణీదారులను సంప్రదించేవారు. తమ సినిమా బిజినెస్‌ని నిర్మాణ వ్యయాన్ని తెలుసుకునేవారు. హీరో పారితోషికం పెంచనంతకాలం మిగిలినవారు డిమాండ్‌ చేసేవారు కాదు. ఒక సినిమా తీసి దెబ్బతిన్న నిర్మాతని నిలబెట్టడానికి మళ్ళీ కాల్షీట్సు ఇచ్చి సహకరించేవారు. తమ నట జీవితానికి ‘బ్రేక్‌’ ఇచ్చినవారిని దేవుడితో సమానంగా గౌరవించేవారు. ఆ రోజులలో పొలాలు అమ్మి సినిమాలు తీసేవారు. ఈ రోజుల్లో స్కాంలు చేసి సినిమాలు తీస్తున్నారు అని వ్యాఖ్యానించాడొక సినీ పాత్రికేయుడు.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement