Advertisement

దాసరి 71వ జన్మదిన వేడుకలు..!

Mon 04th May 2015 09:30 AM
dasari narayanarao,birthday celebrations,chandamama kadalu,naresh  దాసరి 71వ జన్మదిన వేడుకలు..!
దాసరి 71వ జన్మదిన వేడుకలు..!
Advertisement

తెలుగు ఇండస్ట్రీలో నటుడిగా,దర్శకుడిగా, నిర్మాతగా సినిమాకు సంబంధించిన అన్ని శాఖలలోను పని చేసి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు దర్శకనిర్మాత దాసరి నారాయణరావు. ఇండస్ట్రీలో ఆయన అడుగు పెట్టి 50 సంవత్సరాలు అయినా ఇప్పటికీ సినిమాలు చేస్తున్న ఘనత ఆయనకే దక్కింది. మే 4న ఆయన పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ లో అభిమానుల మధ్య వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా దాసరి నారాయణరావు మాట్లాడుతూ "40 సంవత్సరాలుగా సంప్రదాయబద్దకంగా ఈ వేడుకను నిర్వహిస్తున్నాం. 1975 వ సంవత్సరం నుండి నా భార్య ఇండస్ట్రీ లో అందరిని పిలిచి ఈ కార్యక్రమం నిర్వహించేది. ఆవిడ ఉన్నంతకాలం ఈ వేడుక జరుపుకుంటూ వచ్చింది. ఆవిడ మరణించాక నా సన్నిహితులు, అభిమానులు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. నన్ను ఇంతగా అభిమానిస్తున్న అందరికి నా ధన్యవాదాలు. స్వయం కృషితో నేను ఎదుగుతూ వచ్చాను. నాలాంటి వాళ్ళని స్పూర్తిగా తీసుకొని యువత ఎదగాలని కోరుకుంటున్నాను" అని తెలియజేసారు. 

ఈ సందర్భంగా ఆయనను 'ఏపి ఫిలిం ఫెడరేషన్ ఎంప్లాయీస్' , 'తెలంగాణా ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్' , ' మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్' వారు పూలతో సత్కరించారు. దాసరి నారాయణరావు పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఏట కొందరి విద్యార్థులకు స్కాలర్ షిప్స్ ఇవ్వడం జరుగుతోంది. ఈ ఏడు కూడా అదే విధంగా కొంతమందికి ఆయన చేతుల మీదుగా స్కాలర్ షిప్స్ అందించారు. అంతేకాకుండా ఆయన దృష్టిలో ముఖ్యమైన పలువురిని దర్శకుడు రాఘవ, పసుపులేటి పూర్ణచంద్రరావు, అభిమానుడు సాయి ని ఆయనే స్వయంగా సన్మానించారు. దీంతో పాటు 'చందమామ కథలు' చిత్రానికి జాతీయస్థాయిలో అవార్డు రావడంతో ఆ చిత్రానికి సంబంధించిన వారికి ప్రత్యేకంగా సన్మానించారు. ఈ సందర్భంగా దాసరి నారాయణరావు మాట్లాడుతూ "ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా 'చందమామ కథలు' సినిమా అవార్డు గెలుచుకోవడం సంతోషకరమైన విషయం. దీనికి ఇండస్ట్రీ పత్యేకంగా చిత్రబృందాన్ని సత్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాని ఇండస్ట్రీ తరపున వారికి ఎలాంటి సత్కారాలు, సన్మానాలు జరగలేదు. ఇండస్ట్రీ చేయలేకపోయిన నా తరపున వారిని అభినందించాలని నా పుట్టినరోజుని సంతరించుకొని వారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను" అని చెప్పారు. 

సీనియర్ నటుడు నరేష్ మాట్లాడుతూ "ఈరోజు దర్శకరత్న గారి పుట్టినరోజు అంటే ఇండస్ట్రీ పుట్టినరోజు. 'చందమామ కథలు' స్టొరీతో ప్రవీణ్ సత్తారు నా దగ్గరకి వచ్చినప్పుడు మంచి సినిమా తీస్తున్నారని మెచ్చుకున్నాను. జాతీయ స్థాయిలో అవార్డు గెలుచుకోవడం సంతోషంగా ఉంది. దాసరి గారు చేసిన ఈ సత్కారాన్నే ఇండస్ట్రీ సత్కారంగా భావిస్తున్నాను" అని తెలిపారు.

ఇంకా ఈ కార్యక్రమంలో కొడాలి వెంకటేశ్వరరావు, అశ్వనీదత్, భీమనేని స్రీనివాసరావు, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, మురళి మోహన్, జయసుధ, ప్రముఖ దర్శకురాలు బి.జయ, పరుచూరి వెంకటేశ్వరరావు, ఎస్.వి.కృష్ణారెడ్డి, తెలంగాణా సినీ ఆర్టిస్ట్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు నాగరాజు, రమేష్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement