Advertisement

ఎంట్రీట్యాక్స్‌పై ఎట్టకేలకు తేల్చారు..!!

Sat 25th Apr 2015 12:10 AM
entry tax in ap,telangana,chandrababu naidu  ఎంట్రీట్యాక్స్‌పై ఎట్టకేలకు తేల్చారు..!!
ఎంట్రీట్యాక్స్‌పై ఎట్టకేలకు తేల్చారు..!!
Advertisement

ఎట్టకేలకు ఓ విషయంలో ఏపీ సర్కారు ఫైనల్‌ నిర్ణయానికి వచ్చేసింది. తెలంగాణ నుంచి వచ్చే వాహనాలకు ఎంట్రీ ట్యాక్స్‌ విధించాలా..? వద్దా..? అనే విషయాన్ని తేల్చుకోలేక ఇన్నాళ్లు ఏపీ సర్కారు సతమతమైంది. చంద్రబాబు సర్కారు విజ్ఞప్తిని ఏమాత్రం పట్టించుకోకుండా తెలంగాణ సర్కారు ఏపీనుంచి వచ్చే వాహనాలకు ఎంట్రీ ట్యాక్స్‌ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం నుంచే వచ్చే వాహనాలకు ఏపీలో ట్యాక్స్‌ విధించాలా..? వద్దా..? అనే విషయమై చంద్రబాబు సర్కారు ఆచితూచి స్పందించి ఎట్టకేలకు ట్యాక్స్‌ విధించాలన్న ఫైనల్‌ నిర్ణయానికి వచ్చేసింది. ఈ మేరకు ప్రభుత్వంనుంచి జీఓ కూడా జారీ అయ్యింది.

 

సాధారణంగా తెలంగాణలో ఉన్న హైదరాబాద్‌కు ఏపీనుంచి రాకపోకలు అధికంగా ఉంటాయి. ఇక టీ-సర్కారు ఎంట్రీ ట్యాక్స్‌ విధించడంతో ప్రతినెలా ఆ రాష్ట్రానికి దాదాపు రూ. 50 కోట్ల ఆదాయం ఏపీ నుంచి వాహనాలు ఎంట్రీట్యాక్స్‌ రూపంలో చెల్లిస్తున్నాయి. అదే సమయంలో తెలంగాణ నుంచి ఏపీలోకి వచ్చే వాహనాల సంఖ్య నామమాత్రం. పుణ్యక్షేత్రాలు, సరుకు రవాణాకు మినహాయించి మిగిలిన వాటికి  తెలంగాణనుంచి పెద్దగా వాహనాలు ఏపీకి రావు. వీటిపై ట్యాక్స్‌ విధించినా ప్రభుత్వానికి పెద్దగా ఆదాయం సమకూరుతుందన్న ఆలోచన లేదు. దీనికితోడు ఎంట్రీట్యాక్స్‌ విధించాలన్న తెలంగాణ నిర్ణయాన్ని ఏపీకి చెందిన పలువురు హైకోర్టులో పిటీషన్‌ దాఖలు వేశారు. అయితే తాము కూడా ఎంట్రీట్యాక్స్‌ విధిస్తూ నిర్ణయం తీసుకుంటే కోర్టు టీ-సర్కారు ఆలోచనను కూడా సమర్థించవచ్చని ఏపీ భావించింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఎంట్రీట్యాక్స్‌పై నిర్ణయం తీసుకోకుండా వేచిచూసింది. ఇక హైకోర్టు కూడా తెలంగాణ నిర్ణయానికి ఓకే  చెప్పడంతో ఎట్టకేలకు ఏపీ కూడా ఎంట్రీట్యాక్స్‌ విధిస్తూ నిర్ణయం తీసుకుంది.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement