Advertisement

క్రీడారంగంలో హైదరాబాద్‌కి బ్రాండ్‌ ఇమేజ్‌ !

Wed 01st Apr 2015 03:17 AM
hyderabad,brand image,saina nehwal,sania mirza,shruti haasan,maa elections,kcr  క్రీడారంగంలో హైదరాబాద్‌కి బ్రాండ్‌ ఇమేజ్‌ !
క్రీడారంగంలో హైదరాబాద్‌కి బ్రాండ్‌ ఇమేజ్‌ !
Advertisement

భారత్‌ క్రికెట్‌ జట్టు ఓటమి -

‘శృతి హాసన్‌’ పై పివిపి కేసు -

‘మా’ ఎన్నికలు : వీటి గురించే చర్చలు!

తనను బ్యాట్మింటన్‌ కోర్టులో ఓడిరచిన వారందర్నీ ఓడిరచి ప్రపంచ నెం.1 కిరీటాన్ని సాధించిన సైనా నెహ్వాల్‌ గురించి, ‘ఇండియన్‌ ఓపెన్‌ విజేత’ తెలుగు తేజం శ్రీకాంత్‌ గురించి, ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రం ‘చందమామ కథలు’ గురించి జరగవలసినంత చర్చ - యువతరంలోకి వెళ్ళవలసినంతగా వెళ్ళలేదు. కానీ వీరి ప్రతిభని, వీరి విజయాలను ఎవరు గుర్తించాలో వారు గుర్తించారు :ఆయనే తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌. హైదరాబాద్‌ దశ తిరిగింది. మిగులు బడ్జెట్‌తో మెరిసిపోతున్న తెలంగాణ బ్రాండ్‌ అంబాసిడర్‌గా సానిమా మీర్జాకి పట్టంగట్టిన వేళా విశేషం : సానియా మీర్జా వరుస విజయాలతో దూసుకుపోతోంది. టెన్నిస్‌లో సానియా వీర విహారం చేస్తుంటే, బ్యాట్మింటన్‌లో సైనా నెహ్వాల్‌ ప్రపంచ నెం.1 టైటిల్‌ కైవసం చేసుకుంది. ఆమె బాటలోనే శ్రీకాంత్‌ - సింధు - కశ్యప్‌ టైటిళ్ళ వేట కొనసాగిస్తున్నారు. 

హైదరాబాద్‌ బాడ్మింటన్‌ విజేతలతో మెరిసిపోతోంది. ఇదే సమయంలో సానిమా మీర్జా కృషివలన టెన్నిస్‌ పుంజుకుంటోంది. ఈ స్థితిలో టెన్నిస్‌కి - బాడ్మింటన్‌కి జాతీయ స్ధాయిలో మైదరాబాద్‌ గుర్తుకురావాలి. ఈ విజేతల క్రీడా స్ఫూర్తితో ఎందరెందరో టెన్నిస్‌ - బాడ్మింటన్‌ రంగాలలోకి రావాలి. అలాగే ‘చందమామ కథలు’ వంటి లో`బడ్జెట్‌, ఎక్స్‌పెరిమెంటల్‌ ఫిలిమ్స్‌కి ప్రభుత్వ ఆదరణ లభించాలి.

సైనా నెహ్వాల్‌ - శ్రీకాంత్‌ - ‘చందమామ యూనిట్‌’ విజయాలను కెసిఆర్‌ ముందు కుప్ప పోశారు. ఆ స్ఫూర్తిని వాడవాడలా వ్యాపింపజేయాల్సిన బాధ్యత కెసిఆర్‌ భుజస్కంధాలపై వుంది. ‘టెన్నిస్‌’ పేరు చెప్పినా, ‘బాడ్మింటన్‌’ ప్రస్తావన వచ్చినా ‘హైదరాబాద్‌’ స్మృతి పథంలో మెదలాలి!

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement