Advertisement

పట్టిసీమపై ప్రతిపక్షానికి పట్టు విడుపులుండాలి!

Tue 31st Mar 2015 02:08 AM
ys jagan,patti seema,chandrababu naidu  పట్టిసీమపై ప్రతిపక్షానికి పట్టు విడుపులుండాలి!
పట్టిసీమపై ప్రతిపక్షానికి పట్టు విడుపులుండాలి!
Advertisement

2004 ఎన్నికలలో వైయస్సార్‌ అధికారానికి రావడానికి; చంద్రబాబు గద్దె దిగడానికి కారకుడు : రైతన్న.

ఆ రైతన్న రుణమాఫీ పధకంతోపాటు ‘పోలవరం’ జాతీయ ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేయడానికి పిడికిలి బిగించిన చంద్రబాబు ఉభయ గోదావరి జిల్లాల్లోని రైతాంగం కొరకు ‘పట్టిసీమ ఎత్తిపోతల పధకం’కి భూమిపూజ చేశారు. ధవళేవ్వరం బ్యారేజీ వద్ద 14 మీటర్ల పైన నీటిమట్టం వున్నప్పుడే - సముద్రంలోకి వదిలే మిగులు నీటిని కృష్ణాడెల్టాకు మళ్ళిస్తామని, అప్పుడు శ్రీశైలం నుంచి నీటిని కృష్ణా డెల్టాకు వాడుకోవాల్సిన అవసరం వుండదని, ఆ నీటిని రాయలసీమకు మళ్ళిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు.

చంద్రబాబు తన పని తాను చేసుకుపోతున్నారు. ఇప్పుడు చేయవలసింది ప్రతిపక్ష నేత జగన్‌ మాత్రమే. తొలుత రాజధాని ప్రదేశం ఎంపికపై తకరారుకి దిగిన జగన్‌ విజ్ఞతగల నేతగా వెంటనే సర్దుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా - నిధుల కోసం ప్రధానిని కలుస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధిలో ప్రతిపక్షం భాగస్వాములు కావడం అభినందనీయం. అలాగే రాజధాని భూసేకరణ, పట్టిసీమ ఎత్తిపోతల పధకంపై రాజకీయం చేయకుండా రాజకీయ ప్రయోజనాలతో రాజీపడి స్వర్గీయ వైయస్సార్‌ని ఏ రైతులు ముఖ్యమంత్రిని చేశారో వారికోసం జగన్‌ నిధులు సేకరించాలి. బడుగులు తమ గుండెల్లో గుడికట్టిన ఆ వైయస్సార్‌ తనయుడుగా జగన్‌ ప్రజాహిత కార్యక్రమాలలో ప్రభుత్వానికి సహకరించాలి. జోలెపట్టి నిధులు సేకరించాలి. ఓదార్పు యాత్రతో వాడవాడలు తిరిగిన జగన్‌ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పునర్నిర్మాణానికి నిధులకోసం, నీళ్ళకోసం, విద్యుత్తుకోసం అన్ని పార్టీల నాయకులను కలవాలి. పొరుగు రాష్ట్రాలవారితో స్నేహం పెంపొందించాలి.

- ఈ పని చేయగల దార్శనికుడు జగన్‌ ఒక్కడే! కేంద్రంలోని అన్ని పక్షాలను, రాష్ట్రంలోని అధికార పక్షంతోనూ కలిసిరాగల పెద్దమనసు జగన్‌ది. పట్టిసీమ ఎత్తిపోతల పధకంపై పట్టువిడుపులతో జగన్‌ ఓ మెట్టు దిగాడని ప్రత్యర్ధులు అనుకోవచ్చు. ప్రజలు తమ హృదయాలలో స్ధాపించిన వైయస్సార్‌ గుడిమెట్లపైకి పైపైకి ఎక్కిన వాడవుతారు జగన్‌!

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement