Advertisement

రాజకీయ దివాళాకోరుతనం అంటే ఇదే!

Sat 28th Mar 2015 01:27 AM
india politics,aap,bjp,modi,venkayya naidu,politics  రాజకీయ దివాళాకోరుతనం అంటే ఇదే!
రాజకీయ దివాళాకోరుతనం అంటే ఇదే!
Advertisement

సగటు మనిషిలో ఎన్నో ఆశలు రేపిన ‘ఆప్‌, లోక్‌సత్తా’ పార్టీలు అంతర్గత కుమ్ములాటలతో ప్రజల విశ్వాసాన్ని కోల్పోతున్నాయి. కాంగ్రెసు ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలకు హాజరుకాలేదు. తమిళనాడులో జయలలిత, కరుణానిధి, రజనీకాంత్‌ పరిస్థితి బాగుండలేదు. పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తలపై చిట్‌ఫండ్‌ చీటింగ్‌ ఉదంతం కత్తిలా వ్రేలాడుతోంది. బీహార్‌లో నితీష్‌కి మునుపటి చరిష్మాలేదు. కేరళలో కుమ్ములాటలు. ఆంధ్ర, తెలంగాణ మధ్య పేచీలు. రాజ్యసభలో బిల్లు గట్టెక్కించుకోవడానికి వెంకయ్యనాయుడు మల్లగుల్లాలు పడుతున్నారు. మోదీ విదేశీ పర్యటనలలో పూర్వపు దూకుడు కనిపించడంలేదు. కేంద్రంలో పైకి అంతా సజావుగా కనిపిస్తున్నా ఎక్కడో ప్రధాని మోదీ సామర్ధ్యంపట్ల సంశయాలు రేగుతున్నాయి. అభివృద్ధి రేటుపరంగా భారత్‌ చైనాని అధిగమిస్తుందని ఆసియా బ్యాంకు గణాంకాలతో చెప్పినా నమ్మలేని స్థితి. ‘‘భారత్‌ వెలిగిపోతోంది`’’ వాజ్‌పేయి నాటి ప్రచారం మోదీ హయాంలోనూ రిపీట్‌ అవుతుందేమోనన్న సందేహం. నాయకునిపట్ల అచంచల విశ్వాసం వుండాలి. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు, డిల్లీ లో వెంకయ్యనాయుడుపట్ల మొన్నటివరకు ఆ నమ్మకం వుండేది. నిన్న ఆ పరిస్థితి మారింది. నేడు షేర్‌ మార్కెట్‌ కుప్పకూలడంతో ఆశలు ఆవిరవుతున్నాయి. దేశ ప్రయోజనాలు - పార్టీ రాజకీయ ప్రయోజనాలు అన్న విషయాన్ని గమనిస్తే కాంగ్రెసు హయాంలో పార్టీ రాజకీయ ప్రయోజనాలు అంతకుమించి సోనియా కుటుంబ ప్రయోజనాలకే పెద్దపీట వేశారు. కాంగ్రెసుకన్నా బిజెపి బెటరుగా కనిపించవచ్చు; కానీ బిజెపి - ఆరెస్సెస్‌కీ స్వప్రయోజనాలే అజెండాగా కనిపిస్తోంది. అందుకు చక్కని ఉదాహరణ, శివసేన, అకాలీదళ్‌, టిడిపితో మోదీ సంబంధాలే.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement