Advertisement

‘మేరీకోమ్‌’ వలె ‘చిరంజీవి’ చరిత్ర తెరకెక్కాలి!

Wed 25th Mar 2015 11:20 AM
chiranjeevi life story,marykom movie,movie on chiranjeevi,ntr,anr,krishna,marykom life  ‘మేరీకోమ్‌’ వలె ‘చిరంజీవి’ చరిత్ర తెరకెక్కాలి!
‘మేరీకోమ్‌’ వలె ‘చిరంజీవి’ చరిత్ర తెరకెక్కాలి!
Advertisement

భారత ప్రజాస్వామ్యంలో నిర్లక్ష్యానికి గురయిన ఈశాన్య భారతంనుంచి (మణిపురి), ఆర్ధికంగా అట్టడుగునున్న కుటుంబాన్నుంచి వచ్చిన ఓ మహిళ - బిడ్డల తల్లి అయికూడా - బాక్సింగ్‌ రింగ్‌లో స్వర్ణపతకంతో యావత్‌ భారతం గర్వించేలా చేసిన మేరీకోమ్‌ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు! స్ఫూర్తిదాయకమైన ఆమె జీవితగాధ జాతీయ అవార్డునందుకోవడం అభినందనీయం.

అలాగే, ‘గాడ్‌ ఫాదర్‌’ లేకుండా తెలుగు సినిమా పరిశ్రమలో అడుగుపెట్టి ‘ఎన్టీఆర్‌ - అక్కినేని - శోభన్‌బాబు -  కృష్ణ -  కృష్ణంరాజు’ వంటి హేమా హేమీల నడుమ తన ఉనికిని చాటుకుంటూ ప్రేక్షకుల రివార్డులు, ప్రభుత్వ అవార్డులు అందుకుంటూ ‘మెగాస్టార్‌’ అనే తారా పధాన్ని అందుకోవడానికి చిరంజీవి కృషి - తాపత్రయం - వినయం - వివేకం; షూటింగులో జరిగిన ప్రమాదాలు; ఎదురయిన పరాభవాలు ఓ చరిత్ర!

‘సాధించాలి’ అన్న విల్‌ పవర్‌;  కృషి వుంటే నీ ప్రతిభే నిన్ను తారాపధానికి చేరుస్తుంది - అన్న చిరంజీవి జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం!

సినిమా కథని మించిన మెలోడ్రామా - ట్విస్ట్‌లు - ఉద్వేగం; జీవితంతో పోరాటం చిరంజీవి జీవితంలో వున్నాయి. ఎందరో మహామహులతో కలసి పనిచేసిన ఆయన తొలినాటి పరిచయస్తులు తారసపడితే ఆనాటి చిరంజీవిలా స్పందిస్తారు. జీవితాన్ని వడకాచిపోసిన ఆయనలో సన్నిహితులు చూసే ఓ మేధావి - తార్కికవాది - యోగి - భోగిని ప్రజలందరూ చూసే అవకాశం కల్పించాలి.

- తోటకూర రఘు

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement