Advertisement

చిన్న సినిమాకి పెద్ద పండుగ

Tue 24th Mar 2015 04:19 AM
small movie,big festival,srirama navami,ugadi,surya vs surya  చిన్న సినిమాకి పెద్ద పండుగ
చిన్న సినిమాకి పెద్ద పండుగ
Advertisement

‘సూర్య వర్సెస్‌ సూర్య, జెండాపై కపిరాజు, ఎవడే సుబ్రమణ్యం, చిరునవ్వుల చిరుజల్లు, అనేకుడు, కాలింగ్‌ బెల్‌, డాక్టరు సలీం, టామి, మగ మహారాజు’. 

-ఈ సినిమాలలో కోట్లు పారితోషికం తీసుకునే హీరోలు, దర్శకులు లేరు. ఇంకా చెప్పాలంటే చిరునవ్వుల చిరుజల్లు, అనేకుడు, మగ మహారాజు - డబ్బింగ్‌ సినిమాలు. ఈ సినిమాలన్నీ విడుదలకు నోచుకోవడం అందునా అద్భుతమైన థియేటర్లలో : పోస్టర్‌పడిన రోజునే పెద్ద హిట్‌. దీనికితోడు మార్కెట్‌లో పెద్ద హీరోల సినిమాలు లేవు, ఇంటర్‌ పరీక్షలు పూర్తవుతున్నాయి. మొత్తానికి చిన్న సినిమాలకి పెద్ద పండుగలు ఉగాది, శ్రీరామనవమి కూడా కలిసొచ్చాయి. జాక్‌పాట్‌ కొట్టేశాయి ఈ సినిమాలన్నీ!!

ఇప్పుడు అడగండి - చిన్న సినిమాకి మనుగడలేదన్నది ఎవరని? ‘శంకరాభరణం, సీతాకోక చిలుక,  అహ నా పెళ్లంట, పెళ్లిసందడి’ విడుదలకు ముందు చిన్న సినిమాలే; ఎన్టీఆర్‌ / రాఘవేంద్రరావు ‘తిరుగులేని మనిషి, సింహబలుడు’ విడుదలకు ముందు పెద్ద సినిమాలే! 

అవకాశం చిక్కినప్పుడు ఈ లో-బడ్జెట్‌ సినిమాలు ప్రేక్షకుల, థియేటర్‌ యజమానుల, జిల్లా వారీ కొనుగోలుదార్ల ఆలోచనా విధానాన్ని మార్చగలగాలి. ఇప్పుడు అటువంటి అవకాశం దొరికింది. విడుదలకు ముందు చిన్న సినిమా విడుదలయి పెద్ద సినిమాగా మారే సత్తా వీటికి వుందో లేదో తేలిపోతుంది!

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement