Advertisement

ఓ మహదవకాశాన్ని చేజార్చుకున్నాం!

Tue 24th Feb 2015 06:33 AM
two states chief ministers,engineering,medicine  ఓ మహదవకాశాన్ని చేజార్చుకున్నాం!
ఓ మహదవకాశాన్ని చేజార్చుకున్నాం!
Advertisement

ఇద్దరు ముఖ్యమంత్రులను ఒకే వేదికపైకి తీసుకొచ్చే మహదవకాశాన్ని చేజార్చుకున్నాం!

ఈ వసుధైక కుటుంబంలో, ఈ పోటీ ప్రపంచంలో భాషను బతికించుకోవడానికి మార్గం ఇదికాదు!!

శివరాత్రి సంబరాలు భూమిబద్దలయ్యేలా వాడవాడలా ఘనంగా జరిగాయి.

ఆ స్థాయిలో కాకపోయినా అంతలో కొంతగా ప్రపంచ తృతీయ తెలుగు మహాసభలు విజయవాడలో జరిగాయి. తదుపరి మహాసభలు విశాఖలో జరపడానికి నిర్ణయమయింది.

ఈ సందర్భంగా ఒక విషయం చెప్పదలిచాను: ఆంధ్ర, తెలంగాణలోని ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్లు లక్షకు పైబడి ఉద్యోగాల మార్కెట్‌కి వస్తున్నారు. వీరిలో నూటికి ఎనభైమంది కమ్యూనికేషన్‌ స్కిల్స్‌లేక ఉద్యోగాలు సంపాదించలేకపోతున్నారు. కంప్యూటర్‌ సైన్సెస్‌ తీసుకుంటే బి.టెక్‌ నాలుగేళ్ళలో నేర్పని ఎన్నో లాంగ్వేజెస్‌ ప్రత్యేకంగా నేర్చుకుని ఇంటర్వ్యూలకి వెళ్తున్నారు. జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో విద్య / వృత్తిపరంగా ఎదురయ్యే పెను సవాళ్ళని ఎదుర్కోవాలంటే తెలుగు మాధ్యమం సరిపోతుందా? అంతర్జాతీయంగా నిన్నటివరకు మనకన్నా వెనుకబడివున్న చైనీస్‌ ఈ రోజున మనల్ని అధిగమించి ముందుకు దూసుకుపోతున్నారు. కారణం? ఇంజనీరింగ్‌, మెడికల్‌, లా, అకౌంటెన్సీ,  గణితం, ఫిజిక్సు, కెమిస్ట్రీ తదితర సబ్జక్టులలో రిఫరెన్సు బుక్స్‌ తెలుగులో వున్నాయా? రాష్ట్ర స్థాయిలో తెలుగు మాధ్యమంలో చదువుతున్న వారికి విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పించగలరా? మన పూర్వీకులు గణితం, ఖగోళం, వైద్యం, ఆర్ధిక శాస్త్రాలలో పాశ్చాత్యులకన్నా మిన్నగా వున్నారు. ఆ శాస్త్రాలను ప్రాధమిక స్ధాయినుంచే ఎందుకు నేర్పలేకపోతున్నాం? ఆ రచనలు ఎక్కడ లభ్యమవుతున్నాయి?

ఇలా ఎన్నో ఎన్నెన్నో సమస్యలు. ఈ సమస్యల పరిష్కారానికి  ఈ వేడుకలకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఒకే వేదికమీదకు తీసుకొచ్చి వారినుంచి ‘వరాలు’ పొందవలసిన సువర్ణావకాశాన్ని జారవిడుచుకున్నాం.

తెలుగు అంటే కేవలం సాహిత్యమే అన్న ధోరణిలో ఈ సమావేశాలు జరగడం శోచనీయం. మన పూర్వీకులు అందించిన శాస్త్రీయ విజ్ఞానాన్ని ప్రాధమిక స్థాయినుంచే  పాఠ్యాంశాలుగా చేర్చడం తక్షణ కర్తవ్యం.

మన పిల్లలకు కమ్యూనికేషను స్కిల్స్‌ లేకపోవడానికి కారణం : తెలుగు సాహిత్యం అందుబాటులో వున్నట్టుగా తెలుగులో శాస్త్రీయ విషయక రచనలు అందుబాటులో లేకపోవడమే. జీవితాన్ని, జీతాన్ని ఇచ్చే సైన్సు, మేథ్స్‌ని ప్రాధమిక దశనుంచే నేర్పించాలి!  టెక్నికల్‌ టెర్మ్స్‌ని లాటిన్‌, ఇంగ్లీషులో చేర్చాలి. పబ్లిక్‌ స్కూల్స్‌ కరిక్యులమ్‌, తెలుగు మాధ్యమంలో నడుస్తున్న విద్యాసంస్ధల కరిక్యులమ్‌ గమనిస్తే ఆ తేడా తెలుస్తుంది. 

ఏది ఏమైనా ఇద్దరు ముఖ్యమంత్రులను ఒకే వేదికమీదకు తీసుకొచ్చే మహదవకాశాన్ని జారవిడుచుకున్నాం. రేపటితరానికి కావలసిందేమిటో చర్చకు రాలేదన్న విషయం బట్టబయలయింది.

-తోటకూర రఘు

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement