Advertisement

బాలూ.. క్షమించు, నిన్ను అర్ధం జేసుకోలేకపోయాం!

Mon 05th Jan 2015 07:31 AM
balu,engineering,medicine,aims,balu mahendra,cinematographer,screen play,director,framing,lighting,prajasakthi,radha krishna murthi,jyothi chithra,siva ranjani,commercial film  బాలూ.. క్షమించు, నిన్ను అర్ధం జేసుకోలేకపోయాం!
బాలూ.. క్షమించు, నిన్ను అర్ధం జేసుకోలేకపోయాం!
Advertisement

భారతదేశంలో ఇంజనీరింగ్ లో అగ్రశ్రేణి విద్యాసంస్థలు 'ఐఐటి'లు; మెడిసిన్ లో 'ఎయిమ్స్'. వీటి తర్వాతే మరొకటి. 'ఎయిమ్స్' లో ఆల్ ఇండియా స్థాయిలో తొలిసారిగా ఫస్ట్ ర్యాంకు, సెకండ్ ర్యాంకు వచ్చాయి. ఆ టాప్ రాంక్యుల విలువ తెలియక సీదాసాదాగా వార్తని ప్రచురించారు. అలాగే 'బాలు మహేంద్ర' గురించి..బాలు మహేంద్ర బతికివుండగా రావలసినంత గుర్తింపు, గౌరవం రాలేదు. చనిపోయిన తర్వాత కూడా...

బాలూ మహేంద్ర - గొప్ప రచయిత, కవి, పాత్రికేయుడు, సినిమాటో గ్రాఫర్, స్టిల్ ఫోటో గ్రాఫర్, స్క్రీన్ ప్లే రచయిత, డైరెక్టరు వగైరా వగైరా... వెరసి 'జీనియస్'. ఆయన తీసిన ఆయన సినిమా స్టిల్ సినీ పత్రికలకు బొనాంజా - ఫ్రేమింగ్, లైటింగ్!

2014 లో 'బా'త్రయాన్ని(బాలు మహేంద్ర, బాపు, బాల చందర్)కోల్పోయాం. ఎందువలనో గాని బాలు మహేంద్ర కి ఇవ్వవలసిన ప్రాధాన్యత ఇవ్వలేకపోయాం అనిపించింది. ఆఖరికి, 'ప్రజాశక్తి' గోళ్ళ రాధాకృష్ణమూర్తి గారి 'తరం మారింది' చిత్రానికి బాలు మహేంద్ర - శోభ పనిచేశారన్న విషయాన్ని కూడా విస్మరించాం. (జగ్గయ్యపేట కోటలో ఆ చిత్ర నిర్మాణం జరిగింది. విజయవాడ నుంచి పాత్రికేయులు ఆ సినిమా కవరేజీకి వెళ్ళారు.

శ్రీలంకలో పుట్టి, భారతీయ సినిమాని సుసంపన్నంచేసిన మహానుభావుడు బాలు మహేంద్ర. బాలు మహేంద్ర అర్ధం కావాలంటే వడ్డెర చండీదాసు రచనలు జీర్ణం కావాలి; చలంని అధ్యయనం చేసి వుండాలి. 'జ్యోతిచిత్ర , శివరంజని' సినీ పాత్రికేయుడుగా - పాత్రికేయుడయిన సినిమాటోగ్రాఫర్ ఐ.అర్జునరావు మిత్రుడుగా - నిర్మాత, రూపశిల్పి జయ కృష్ణ అభిమాన దర్శకుడుగా బాలు మహేంద్రతో నాకు కొద్దిపాటి సాన్నిహిత్యం వుంది. ఆయనతో సినిమా కబుర్లేకాదు, జీవితం - సాహిత్యం - ప్రేమ వగైరా వగైరా ఎన్నో ముచ్చట్లు. ఆర్ట్ ఫిలిమ్ - కమ్మర్షియల్ ఫిలిమ్ - పేరలల్ సినిమా : పేరు ఏదైనా కావచ్చు అన్ని ఫార్మాట్స్ అద్భుత మిశ్రమం బాలు మహేంద్ర సినిమాలు! సిలోన్ వాసి అక్రమంగా భారతదేశం లో వుంటున్నాడని ఈ జాతీయ బహుమతి గ్రహీతపై కోర్టులో కేసులు పెట్టారు. బాలు మహేంద్ర  వ్యక్తిత్వంలో డిఫరెంట్ షేడ్స్; జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు మెట్టపల్లాలు. ఆయన జీవితం ఆయన చిత్రాలలో అంతర్లీనంగా కనిపిస్తుంది. ఆయన అర్ధంకాడు కానీ ఆయన సినిమాలు అర్ధమవుతాయి - ఎవరి మేధసుకి తగ్గట్టుగా వారికి.  

                                                                                   -తోటకూర రఘు    

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement