ఈసారి ఆలోచిస్తుందిలే
Janhvi To avoid Telugu films for a while?
ఆచి తూచి సౌత్ లో తెలుగు సినిమాలు ఒప్పుకున్న జాన్వీ కపూర్ కి పెద్ద స్టార్స్ ఇద్దరూ భారీ షాక్ ఇచ్చారు. పాన్ ఇండియా స్టార్స్ ని ఎన్టీఆర్, రామ్ చరణ్ సినిమాలను బ్యాక్ టు బ్యాక్ ఆచి తూచి ఒప్పుకున్నా జాన్వీ కపూర్ కి దేవర, పెద్ది రెండు భీభత్సమైన షాక్స్ ఇచ్చాయి. దేవరలో పాటలకు పరిమితమైతే.. పెద్ది లో గ్లామర్ షో కి పనికొచ్చింది.
రెండు సినిమాల్లో జాన్వీ కపూర్ కి పేరు రాకపోగా.. ఆమెపై విమర్శలు వెల్లువలా వచ్చి పడ్డాయి. పెద్ది లో అయితే జాన్వీ కపూర్ పాత్రని క్రిటిసైజ్ చేసారు. అందుకే ఇకపై సౌత్ సినిమాలకు ఓకే చెప్పాలి అంటే గనక జాన్వీ కపూర్ ఒకటికి 100 సార్లకు ఆలోచిస్తుందో, లేదంటే అస్సలు ఆలోచన చెయ్యకుండా నో చెబుతుందో..
కాదు ఎలాంటి పాత్ర అయినా ఓకే చేస్తుందో అనేది చూడాలి. కానీ ఈసారి ఆమె తెలుగు సినిమా ఒప్పుకుంది అంటే అందరిలో ఇంట్రెస్ట్ పుడుతుందో లేదంటే హా జాన్వీ అన్ని వేస్ట్ పాత్రలే చేస్తుంది అంటారో చూడాలి






































