Advertisementt

అల్లు అర్జున్ ముంబై కి షిఫ్ట్ అవుతున్నాడా

Mon 20th Apr 2026 02:31 PM
allu arjun  అల్లు అర్జున్ ముంబై కి షిఫ్ట్ అవుతున్నాడా
Is Allu Arjun shifting to Mumbai అల్లు అర్జున్ ముంబై కి షిఫ్ట్ అవుతున్నాడా
Advertisement
Ads by CJ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముంబై టు హైదరాబాద్ అంటూ గత ఏడాది కాలంగా అప్ అండ్ డౌన్ చేస్తున్నాడు. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ తో మొదలు పెట్టిన రాకా చిత్ర షూటింగ్ ఎక్కువగా ముంబై లో జరుగుతుంది. అక్కడ స్పెషల్ గా వేసిన సెట్స్ లో రాకా షూటింగ్ చేస్తున్నారు. ముంబై లో ఉంటూ షూటింగ్ లో పాల్గొంటున్న అల్లు అర్జున్ ఏదైనా అకేషన్స్ కి హైదరాబాద్ వచ్చి వెళుతున్నాడు.

నానమ్మ చనిపోయినప్పుడు, తమ్ముడు పెళ్ళికి, మెగా ఈవెంట్స్ కి, బర్త్ డే లకు, పెళ్లి రోజులకు ఇలా హైదరాబాద్ వచ్చి వెళుతున్న అల్లు అర్జున్ ఇకపై తన నివాసాన్ని ముంబై కి షిఫ్ట్ చేయబోతున్నాడనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రాకా షూటింగ్ ఫినిష్ అయ్యేవరకు అల్లు అర్జున్ ముంబై లో ఉంటాడని తెలుస్తుంది.

ఫ్యామిలీతో అల్లు అర్జున్ ముంబై కి మూవ్ అవ్వబోతున్నాడంటున్నారు. రాకా షూటింగ్, ఇంకా నార్త్ ప్రమోషన్స్ ఇలా అన్ని కలిపి ఇంకా రెండేళ్లు పెట్టె అవకాశం ఉన్నందున అప్పటివరకు అల్లు అర్జున్ ఫ్యామిలీతో కలిసి ముంబై లోనే ఉంటాడని తెలుస్తుంది. 

Is Allu Arjun shifting to Mumbai:

Allu Arjun Leaving Hyderabad For Mumbai

Tags:   ALLU ARJUN
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ