ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Nikhila Vimal responds to questions on marriage

పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన హాట్ బ్యూటీ

Nikhila Vimal responds to questions on marriage

మలయాళ చిత్ర పరిశ్రమలో బాలనటిగా ప్రస్థానాన్ని ప్రారంభించి అటుపై తమిళ, తెలుగు భాషల్లో కథానాయికగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి శ్రమిస్తోంది నటి నిఖిలా విమల్. తమిళంలో `వెట్రివేల్`, `కిడారి`, `తంబి`, `పోర్ తొళిల్` వంటి విభిన్న చిత్రాల్లో నటించిన అమ్మ‌డు ఇటీవలే  మారి సెల్వరాజ్ తెరకెక్కించిన 'వాళై' చిత్రంలో సహజసిద్ధమైన నటనతో విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంది.

దక్షిణాదిలో వరుస అవకాశాలతో ముందుకు సాగుతోంది. ఈ నేప‌థ్యంలో పెళ్లి చేసుకుంటుంద‌నే ప్ర‌చారం జోరందుకుంది. తాజాగా  ఈ క‌థ‌నాల‌పై స్పందించింది.  ప్రేమ, వివాహ బంధాలపై వ‌స్తోన్న‌ పుకార్లకు పూర్తిగా చెక్ పెట్టింది. ప్రస్తుతం తన మనసులో ఎవరూ లేరని.. తానెవరితోనూ ప్రేమలో లేనని తెలిపింది. అంతే కాదు పెళ్లి అనే అంశంపై ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని వెల్లడించింది.

ప్రేమ ..పెళ్లి అనేవి జీవితంలో ముందే ఆందోళన చెందాల్సిన పెద్ద విషయాలు కావని.. భవిష్యత్తులో ఆ ఆలోచన  వచ్చినప్పుడు వాటి గురించి చూసుకోవచ్చని ప్రాక్టికల్‌గా సమాధా నమిచ్చింది.  ప్రస్తుతానికి తన ఆలోచనలు.. లక్ష్యాలు అన్నీ కేవలం సినిమాల చుట్టూనే తిరుగుతున్నాయని  ముద్దుగుమ్మ స్పష్టం చేసింది. పరిశ్రమలో నటిగా స్థిరపడటం, వైవిధ్యమైన పాత్రల తో  ప్రేక్షకులను అలరించడమే  తక్షణ ప్రాధాన్యత అని.. అందుకే పూర్తి సమయాన్ని వృత్తికే కేటాయిస్తున్నానని తెలిపింది.

Nikhila Vimal