ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Tamannaah shares a serene glimpse from the Linga Bhairavi Devi Punya Pooja
ఇంట్లో తమన్నా స్పెషల్ పూజ
Tamannaah shares a serene glimpse from the Linga Bhairavi Devi Punya Pooja
మిల్కి బ్యూటీ తమన్నా ప్రస్తుతం సౌత్ నుంచి కాస్త గ్యాప్ మైంటైన్ చేస్తుంది. ఓదెల 2 తర్వాత తమన్నా తెలుగులో కనిపించింది లేదు. అటు తమిళనాట కూడా తమన్నాకు ఆట్టే అవకాశాలు రావడం లేదు. ఇక బాలీవుడ్ లో మాత్రం నిత్యం బిజీగా ఉండేలా మూవీ షూటింగ్స్, వెబ్ సీరీస్ అంటూ హడావిడి చేస్తుంది.
మరోపక్క వ్యాపారాల్లోనూ బిజీ అయ్యింది. తండ్రి సూచనలతో తమన్నా జ్యువెలరీ బిజినెస్ స్టార్ట్ చేసింది. ముంబై లో ఓ షోరూం ఓపెన్ చేసి సెలబ్రిటీస్ తో పబ్లిసిటీ చేయించింది. ఇక కెరీర్ లో బిజీగా ఉంటే తమన్నా తాజాగా తన ఇంట్లోనే తల్లితండ్రులతో కలిసి లింగ భైరవి దేవి పుణ్య పూజ నిర్వహించింది.
చక్కటి చీరకట్టు లో సాంప్రదాయంగా తమన్నా పేరెంట్స్ తో కలిసి లింగ భైరవి దేవి అమ్మవారి పుణ్య పూజ చేస్తున్న ఫోటొస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Tamannaah Bhatia recently performed the Linga Bhairavi Devi Punya Puja






































