Advertisementt

అఫీషియల్ - పెద్ది వాయిదా

Wed 15th Apr 2026 06:11 PM
ram charan  అఫీషియల్ - పెద్ది వాయిదా
Peddi Officially Postponed అఫీషియల్ - పెద్ది వాయిదా
Advertisement
Ads by CJ

ఫైనల్లీ పెద్ది మేకర్స్ ఏప్రిల్ 30 నుంచి పెద్ది చిత్రాన్ని పోస్ట్ పోన్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. గత 20 రోజులుగా ప్రచారంలో ఉన్న వార్తలను పెద్ది మేకర్స్ ఇప్పటికి నిజం చేసారు. పెద్ది షూటింగ్ బ్యాలెన్స్, అలాగే పోస్ట్ ప్రొడక్షన్ ఇంకా ఫినిష్ కాకపోవడంతో పెద్ది చిత్రం విడుదల వాయిదా అంటూ ప్రచారం జరిగినా పెద్ది మేకర్స్ మాత్రం ఇప్పటివరకు మౌనం వహించారు.

దానితో మెగా ఫ్యాన్స్ లో ఆందోళన, మే 1 రిలీజ్ అన్న సినిమాల మేకర్స్ లో టెన్షన్ కనిపించింది. ఎట్టకేలకు పెద్ది మేకర్స్ అఫీషియల్ గా పెద్ది చిత్రం వాయిదా అని ప్రకటించారు 

సినిమాలోని టాకీ పార్ట్ మొత్తం పూర్తయ్యింది. కేవలం ఒకే ఒక్క సాంగ్ షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే ఎడిటింగ్ పనులు కూడా ఒక కొలిక్కి రావడంతో, సినిమా అవుట్ ఫుట్ చూసిన మేకర్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారట. కానీ ప్రేక్షకులకు ఒక అద్భుతమైన థియేట్రికల్ ఎక్స్ పీరియెన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసం మరికొంత సమయం కేటాయించాలని టీమ్ నిర్ణయించుకుంది. 

మాపై మీరు చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు. మీ ఓపికకు తగిన ప్రతిఫలం దక్కేలా అత్యుత్తమమైన కంటెంట్తో వస్తాం అని పెద్ది టీమ్ ప్రెస్ నోట్ వదిలింది. 

Peddi Officially Postponed:

Ram Charan Peddi Confirmed for Worldwide Release in June

Tags:   RAM CHARAN
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ