ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Mammootty Mohanlal Patriot OTT Release Date Announced

మోహ‌న్ లాల్ మల్టీస్టారర్ పేట్రియాట్ స్ట్రీమింగ్ డేట్

Mammootty Mohanlal Patriot OTT Release Date Announced

 

జీ5 లో మలయాళ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ ‘పేట్రియాట్‌’ జూన్ 5 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ప్రముఖ దర్శకుడు మ‌హేష్ నారాయ‌య‌ణ‌న్‌ తెరకెక్కించారు. 18 ఏళ్ల త‌ర్వాత‌ మలయాళ సినీ దిగ్గజాలు మ‌మ్ముట్టి, మోహ‌న్ లాల్  ఈ చిత్రంలో క‌లిసి న‌టించారు. న‌య‌న‌తార‌, ఫ‌హాద్ ఫాజిల్‌, కున్‌చాకో బొబ‌న్ త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. పేట్రియాట్ మూవీ మలయాళంతో పాటు హిందీ, తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

గూఢచర్యం, రాజకీయాలు, టెక్నాలజీ, భావోద్వేగాలు, నాట‌కీయ‌తల‌ను కలిపి రూపొందించిన ఈ సినిమాలో అధికారం ఆధారంగా నడిచే వ్యవస్థలో నియంత్రణలేని నిఘా ఎంత ప్రమాదకరంగా మారుతుందో చూపించారు. క‌థ‌లో ప్ర‌ధాన పాత్ర‌ధారి దేశ భద్రత కోసం ఒక అత్యాధునిక ప్రభుత్వ నిఘా వ్యవస్థను రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాడు. కానీ ఆ వ్యవస్థను నిరపరాధ ప్రజలపై మోసం, బ్లాక్‌మెయిల్, నియంత్రణల‌ కోసం వాడుతున్నారని తెలుసుకున్న తర్వాత అతని ఆలోచనలు పూర్తిగా మారిపోతాయి. నిఘా వ్య‌వ‌స్థ‌ను రూపొందించ‌టంతో కీల‌కంగా మారిన ఆ వ్య‌క్తే దానికి ఎదురు నిలుస్తాడు. త‌ను నిజాన్ని బయటపెట్టడం దేశద్రోహమా? లేక నిజమైన దేశభక్తి చర్యనా? అనే ప్రశ్నలతో పోరాటం చేయాల్సి వ‌స్తుంది. దేశభక్తి, దేశ ద్రోహం మధ్య ఉన్న స‌న్న‌ని గీత‌ను ఈ సినిమాలో అర్థ‌వంతంగా, ఆస‌క్తిక‌రంగా రూపొందించారు.

పేట్రియాట్ మూవీలో భారతీయ సామాజిక, రాజకీయ నేపథ్యాన్ని ఆధారంగా తీసుకున్నప్పటికీ, నిఘా వ్యవస్థలు..ప్రైవ‌సీ వంటి ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యం ఉన్న అంశాలను స్పృశించేలా, భారీ కుట్ర‌, భావోద్వేగాల‌ను నిండిన క‌థ‌తో పేట్రియాట్ సినిమాను తెర‌కెక్కించారు. మ‌మ్ముట్టి, మోహ‌న్ లాల్‌, న‌య‌న‌తార‌, ఫ‌హాద్ ఫాజిల్‌, కున్‌చాకొ బొబ‌న్ స్క్రీన్ ప్రెజ‌న్స్ సినిమాపై మ‌రింత ఆస‌క్తిని పెంచింది. వీరితో పాటు రేవ‌తి, రాజీవ్ మీన‌న్‌, ద‌ర్శ‌నా రాజేంద్ర‌న్‌, జ‌రీన్ సాహిబ్ వంటి న‌టీన‌టులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఈ చిత్రం ఉత్కంఠభరితంగా, ఆలోచింపజేసేలా ద‌ర్శ‌కుడు మ‌హేష్ నారాయ‌ణ‌న్ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో సినిమాను ఆస‌క్తిక‌రంగా తీర్చిదిద్దారు. ఈ సంద‌ర్భంగా..

 

Mammootty Mohanlal Patriot