ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Karuppu Storms Box Office With Rs 135 Cr For Four Days

కరుప్పు - మిక్స్డ్ టాక్ తో బంపర్ కలెక్షన్స్

Karuppu Storms Box Office With Rs 135 Cr For Four Days

ప్రస్తుతం థియేటర్స్ లో మంచి సినిమాలు లేక ప్రేక్షకులు చాలా బోర్ ఫీల్ అవుతున్నారు. సమ్మర్ లో ఎంజాయ్ చేస్తూ థియేటర్ కి వెళ్లి సినిమా చూద్దామంటే థియేటర్స్ లో మంచి సినిమాలు లేక ప్రేక్షకులు డిజప్పాయింట్ అవుతున్నారు. కనీసం యావరేజ్ టాక్ సినిమా అయినా చాలు అనుకునే పరిస్థితుల్లోకి ఆడియన్స్ వెళ్లిపోయారు.

అందుకు ఉదాహరణే సూర్య కరుప్పు చిత్రం. గత గురువారం విడుదల కావాల్సిన సూర్య కరుప్పు(వీరభద్రుడు) చిత్రం నిర్మాణసంస్థ ఆర్థిక లావాదేవీల వలన ఒక రోజు ఆలస్యంగా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫస్ట్ హాఫ్ చాలా బావున్నా.. సెకండ్ నిరాశపరిచింది అంటూ కరుప్పు కి మిక్స్డ్ రెస్పాన్స్ చూపించారు ప్రేక్షకులు.

దానితో సూర్య ఖాతాలో మరో ప్లాప్ యాడ్ అయ్యింది అన్నారు. కట్ చేస్తే ఫస్ట్ వీకెండ్ లో కరుప్పు కలెక్షన్స్ చూస్తే మిక్స్డ్ టాక్ తో అంత భారీ కలెక్షన్స్ ఎలా అనేలా కరుప్పు థియేటర్స్ లో దూసుకుపోతుంది. సోమవారం కూడా తమిళనాడులో మంచి నెంబర్లు నమోదు చేసింది కరుప్పు.

మరి మిక్స్డ్ తో సూర్య కరుప్పు బంపర్ కలెక్షన్స్ నమోదు చెయ్యడం అటు సూర్య కు ఇటు ఆయన అభిమానులు.. ఇంకా ప్రేక్షకులకు కాస్త ఊరటనిచ్చింది అనే చెప్పాలి.

Karuppu ,