చేజేతులా కొని తెచ్చుకున్నారు
TDP Removes SVSN Varma as Pithapuram In-Chargeపిఠాపురం టీడీపీ ఇంచార్జ్ పదవి నుంచి SVSN వర్మను అధిష్టానం తప్పించింది. కూటమి కట్టిన తర్వాత ఎవరో ఒకరు సీటు త్యాగం చెయ్యాలి. పవన్ కళ్యాణ్ కోసం వర్మ పిఠాపురం సీటు త్యాగం చేశారు. దానికి పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు వర్మకు తగిన మర్యాద ఇస్తున్నారు. కానీ నాగబాబు ఎంట్రీ వర్మ తట్టుకోలేకపోయారు.
ఎమ్యెల్సీ అయినా వస్తుంది అనుకున్న వర్మకు టీడీపీ అధిష్టానం హ్యాండ్ ఇచ్చింది. దాంతో వర్మ పిఠాపురం జనసేన కార్యకలాపాల్లో రచ్చ చేస్తున్నారు. ప్రతి విషయంలోనూ గొడవకు దిగుతున్నారు. కూటమిగా ఉన్నప్పుడు ఇలా రెండు పార్టీల వారు గొడవ పడితే అది ప్రభుత్వానికి చెడ్డపేరు. అందుకే వర్మ విషయంలో ముఖ్యమంత్రి , టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఎన్నిసార్లు చూసి చూడకుండా వదిలేసినా వర్మ మాత్రం పట్టు విడవడం లేదు.
రీసెంట్ గా జరిగిన విషయాలపై టీడీపీ అధిష్టానం వర్మపై సీరియస్ గా ఉంది. దానితో ఆయన్ని ఇంచార్జ్ పదవి నుంచి తప్పించడంతో వర్మ కన్నీటి పర్యంతమవుతూ మీడియా ముందు మాట్లాడలేక వెళ్లిపోయారు. అది వర్మ చేజేతులా చేసుకుంది. అధిష్టానం ఆగ్రహానికి వర్మ గురయ్యారు.
ఆయన మీడియా ముందు మాట్లాడుతూ.. పార్టీ అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి తాను కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో పార్టీ ఆదేశాల మేరకే పనిచేశానని, పార్టీ బలోపేతం కోసమే కృషి చేశానని, ఎన్నడూ వ్యతిరేకంగా పనిచేయలేదని అన్నారు.






































