ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Rashmika and Vijay Deverakonda visited Vijay hometown

విజయ్ దేవరకొండ విందు పై రాద్ధాంతం

Rashmika and Vijay Deverakonda visited Vijay hometown

కొత్త జంట విజయ్ దేవరకొండ - రష్మిక లు ఈరోజు సోమవారం విజయ్ దేవరకొండ స్వగ్రామం నాగర్ కర్నూల్- బలమూరు మండలం తుమ్మన్‌పేట కు వెళ్లారు. అక్కడ విజయ్ దేవరకొండ నిర్మించిన ఫామ్ హౌస్ గృహప్రవేశం తో పాటుగా కొత్త జంట విజయ్-రష్మిక, విజయ్ దేవరకొండ తల్లితండ్రులు సత్యన్నారాయణ వ్రతం నిర్వహించారు. 

కొత్త జంటను ఆశీర్వదించేందుకు అభిమానులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున తరలిరాగా.. విజయ్ దేవరకొండ వారి కోసం స్పెషల్ విందు ఏర్పాటు చేసారు. మటన్, చికెన్ కర్రీస్, బాగారా రైస్ తో తెలంగాణ స్టయిల్లో విందు ఏర్పాటు చేసారు. అయితే ఇక్కడే పెద్ద రాద్ధాంతం మొదలైంది. 

అదేమిటంటే.. విజయ్ దేవరకొండ-రష్మికలు సత్యన్నారాయణ వ్రతం ఆచరించి విందు లో నాన్ వెజ్ ఎలా పెడతారని సోషల్ మీడియాలో రచ్చ కు తెర లేపారు. అయితే తెలంగాణ వాసులు నాగర్ కర్నూల్ ఏరియాలో ఎక్కడైనా వ్రతం చేసినా ముక్క లేనిదే భోజనాలు ఉండవు. అంటుంటే.. వ్రతం చేసినవారు విందులో నాన్ వెజ్ పెట్టరు అని కొందరు వాదులాడుకుంటున్నారు.

మరికొందరు వ్రతం ఆచరించింది విజయ్ దేవరకొండ-రష్మిక లు వారు తినలేదేమో ఎందుకు ఈ రచ్చ అంటున్నారు. ఇక విజయ్ దేవరకొండ-రష్మిక లు విజయ్ స్వగ్రామంలో గ్రామ దేవతకు, తులసి కోటకు పూజలు నిర్వహించిన వీడియోస్ వైరల్ అవుతున్నాయి. 

Vijay Deverakonda and Rashmika Mandanna at Thummanpeta

vijay